Jr NTR Vs Balakrishna: సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్.. బాలయ్య వర్సెస్ ఎన్టీఆర్..?
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా విశ్వ విఖ్యాత నటసార్వభౌముని పేరు మీద కాయిన్ రిలీజ్ చేశారు. ఆ సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో నందమూరి ఫ్యామిలీ అంతా సందడి చేసింది. కాని అక్కడ ఎన్టీఆర్ మిస్ అయ్యాడు.

Jr NTR Vs Balakrishna: టాలీవుడ్‌లో ఇప్పుడో ప్రాక్సీ వార్ నడుస్తోందంటున్నారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్‌కు తన బాబాయ్ బాలయ్యతో మంచి ర్యాపోనే ఉండేది. కాని, కొన్నేళ్లుగా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఆ సంగతి నందమూరి ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో కొట్టొచ్చినట్టు కనిపిస్తోందంటారు. ఇక రీసెంట్ ఫంక్షన్‌లో తారక్, కళ్యాణ్ రామ్ ఇద్దర్నీ బాలయ్య పలకరించని వీడియో వైరలైంది కూడా. కట్ చేస్తే ఎన్టీఆర్ జయంతి సందర్భంగా విశ్వ విఖ్యాత నటసార్వభౌముని పేరు మీద కాయిన్ రిలీజ్ చేశారు.
ఆ సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో నందమూరి ఫ్యామిలీ అంతా సందడి చేసింది. కాని అక్కడ ఎన్టీఆర్ మిస్ అయ్యాడు. పోనీ.. లక్ష్మీ పార్వతితో ఆ ఫ్యామిలీకున్నఈక్వెషన్స్ అందరికీ తెలిసిందే. అందువల్ల ఆమెను ఫంక్షన్‌కు పక్కనబెట్టడం పెద్ద విషయం కాదు. కాని ఎన్టీఆర్ మనవడు జూనియర్ మిస్ అవటం.. తనదారిలోనే కళ్యాణ్ రామ్ నడవటంతో, ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇక సోషల్ మీడియా విషయానికొస్తే, ఎన్టీఆర్ మీద జాలితో ఫ్యాన్స్ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. కొన్ని కామెంట్లు బాలయ్య ఫ్యాన్స్‌కి పంచ్‌లా ఉండటంతో, కౌంటర్ ఎటాక్ కూడా జరుగుతోంది.
దీంతో నందమూరి ఫ్యాన్స్ వర్సెస్ తారక్ ఫ్యాన్స్ అనేలా సీన్ మారిందంటున్నారు. పొలిటికల్ డిఫరెన్సెస్‌తో ఇలా ఇద్దరు బడా హీరోల మధ్య గ్యాప్ రావటం, వాళ్ల ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గొంతు చించుకోవటంతో కోల్డ్ వార్‌కి డోర్ క్లోజ్ అయ్యే పరిస్థితులు కనిపించట్లేదు.