ప్రభాస్, ఎన్టీఆర్ ఏం మాయచేశారు.. టెన్షన్ లో ఐకాన్ స్టార్.
రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సౌత్ నార్త్ మొత్తంగా పాన్ ఇండియానంతటినీ దున్నేశారు. బన్నీ మాత్రం నార్త్ లో తప్ప సౌత్ లో మాత్రం మల్లీ మళ్లీ ప్రూవ్ చేసుకోవాల్సి వస్తోంది.

రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సౌత్ నార్త్ మొత్తంగా పాన్ ఇండియానంతటినీ దున్నేశారు. బన్నీ మాత్రం నార్త్ లో తప్ప సౌత్ లో మాత్రం మల్లీ మళ్లీ ప్రూవ్ చేసుకోవాల్సి వస్తోంది. ఆఖరికి ఆచార్య, గేమ్ ఛేంజర్ ప్లాపైనా చరణ్ మీద సౌత్, నార్త్ అంతటా జాలి, అభిమానం కనిపిస్తోంది. ఇదే అల్లు అర్జున్ విషయంలో మిస్ అవుతోంది.. సోషల్ మీడియా కామెంట్స్ నుంచి ట్రోలింగ్స్ వరకు అంతా ఎందుకలా అందరూ పగబట్టారు.?మెగా వ్యతిరేకత ఉందనే అనుకున్నా, మిగతా వాళ్లనుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉండాలి కదా? అంతా సోషల్ మీడియా కుట్రేనా?లేదంటే సంధ్యా థియేటర్ ఇన్స్ డెంట్ తర్వాతే సౌత్ మొత్తం తను బ్యాడైపోయాడా? అందులో తనదే తప్పుందని జనం భావిస్తే, నార్త్ ఇండియాలో కూడా తనమీద వ్యతిరేకత రావాలి. కాని అక్కడ మాత్రం తనమీద అభిమానం అలానే ఉందెందుకు? ఏదేమైనా ప్రభాస్, ఎన్టీఆర్, ఆఖరికి చరణ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ తాలూకు ఏ అప్ డేట్ వచ్చినా, సోసల్ మీడియాలో పూనకాలు కనిపిస్తున్నాయి. కాని అల్లు అర్జున్ ఆట్లీ మూవీ, త్రివిక్రమ్ తో ప్లాన్ చేసిన సినిమా ప్లానింగ్ పూర్తైనా పట్టించుకున్న నాథుడు లేడు.. అసలేం జరుగుతోంది? టేకేలుక్.
రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి1, బాహుబలి 2, సాహో, సలార్, కల్కీ మొత్తంగా 5 పాన్ ఇండియా హిట్లతో 5 వేల కోట్ల వసూళ్లు రాబ్టటాడు. కాని మధ్యలో రాధేశ్యామ్ ఫ్లాపైంది. అయినా 370 కోట్లొచ్చాయి. ఎవరూ రెబల్ స్టార్ ని పెద్దగా ట్రోలింగ్ చేసింది లేదు. తర్వాత ఆదిపురుష్ కూడా ఫ్లాపైంది. ఐనా 700 కోట్ల వరకు వసూల్లొచ్చాయంటే, ఆల్ మోస్ట్ పెట్టింది తిరిగి వచ్చేసినట్టే..అప్పుడు కూడా రైటర్స్ మీద, దర్శకుడి మీద ట్రోలింగ్ జరిగింది. కాని ఎవరూ రెబల్ స్టార్ ని కార్నర్ చేయలేదు. ఇక ఎన్టీఆర్ దేవర గా వచ్చినప్పుడు బాలీవుడ్ బ్యాచ్ తోపాటు యాంటీ ఫ్యాన్స్ కుల్లుకున్నారే కాని, ఎవరెన్ని ట్రోలింగ్స్ చేసినా 670 కోట్ల వసూళ్ల వరద ఆగలేదు. తర్వాత తను వార్ 2 చేస్తున్నాడన్నా, వార్ 2 షూటింగ్ అయిపోవచ్చిందన్నా, ఇలా తనేం చేసినా వార్తైపోయింది.
డ్రాగన్ సెట్లో వచ్చే వారం అడుగుపెడుతున్నాడన్నా చెవులు నిక్కబెట్టుకుని సౌత్, నార్త్ బ్యాచ్ ఎదురుచూస్తున్నారు. ఆఖరికి రామ్ చరణ్ దేవర తర్వాత ఆచార్య, గేమ్ ఛేంజర్ లాంటి ఫ్లాపులు ఫేస్ చేశాక కూడా, తన పెద్ది అప్ డేట్స్ మీద అందరి అటెన్షన్ కనిపిస్తోంది. కాని విచిత్రంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏం చేసినా ఎవరూ పట్టించుకోవట్లేదు.తను ఆట్లీతో ముందు మూవీ అన్నాడు. తర్వాత అది ఆగిందన్నారు. వెంటనే దుబాయ్ లో స్టోరీ సిట్టింగ్స్ అన్నారు. అయినా ఎక్కడ సోషల్ మీడియా లో నో రెస్పాన్స్. కనీసం నెగెటీవ్ గా అయినా యాంటీఫ్యాన్స్ ఎటాక్ చేస్తున్నారా అంటే, అది కూడా లేదు. 175 కోట్ల రెమ్యునరేషన్ తో పాటు, 19 శాతం ప్రాఫిట్లో వాటా తీసుకున్న బన్నీ అన్న వార్త నిజానికి సెన్సేషన్ అవ్వాలి. అలా కూడా జరగలేదు.
త్రివిక్రమ్ మేకింగ్ లో బన్నీ చేయాల్సిన సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ లో సెట్స్ పైకెళుతుందన్నాడు ప్రొడ్యూసర్ నాగవంశీ. ఇక ఆట్లి మేకింగ్ లో అల్లు అర్జున్ మూవీ ఏప్రిల్ 8న తన బర్త్ డే కి ఎనౌన్స్ చేయొచ్చని తెలుస్తోంది. కాని సోషల్ మీడియాలో మినిమమ్ రెస్పాన్స్ లేదు. పుష్ప హిట్టైనప్పుడు ఉన్న జోష్, పుష్ప2 బ్లాక్ బస్టర్ తర్వాత కనిపించట్లేదు. ఎక్కడైనా ఫ్లాప్ పడితే హీరోలని పట్టించుకోరు. కాని పుష్ప2 హిట్టైనా తనని పట్టించుకోకపోవటానికి రీజన్, సంధ్యా థీయేటర్ వల్ల జరిగిన డ్యామేజ్. దాంతో ఏర్పడ్డ అభిప్రాయాలే అనంటున్నారు. అదే నిజమైతే నార్త్ ఇండియాలో కూడా అలానే నెగెటీవ్ ఇంపాక్ట్ కనిపించాలి. అక్కడ మాత్రం బన్నీకి మంచి ఫాలోయింగే ఉంది. కారణం సంధ్యా థియేటర్ ఎఫెక్ట్ సౌత్ లో కనిపించినంత నార్త్ లో లేకపోవటమే. ఇదో పొలిటికల్ రివేంజ్ అని నార్త్ జనం నమ్మటమే అనంటున్నారు.