అల్లు అర్జున్ చేసిన పది తప్పులేంటి ? మెగా ఫ్యామిలీకి దూరం చేసుకున్నాడా ?

మెగాస్టార్ ఇమేజ్ వాడుకునే...అల్లు అర్జున్ సినిమాల్లో ఎదిగాడా ? వరుసగా సినిమా అవకాశాలు రావడానికే చిరంజీవి జపం చేశాడా ? పుష్ప సినిమా హిట్ తో బన్నీకి బలుపు పెరిగిపోయిందా ? మెగాస్టార్ బ్రాండ్ నుంచి కావాలనే...పక్కకు తప్పుకున్నాడా ?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 27, 2024 | 11:10 AMLast Updated on: Dec 27, 2024 | 11:10 AM

What Are The Ten Mistakes Allu Arjun Made Did He Distance Himself From The Mega Family

మెగాస్టార్ ఇమేజ్ వాడుకునే…అల్లు అర్జున్ సినిమాల్లో ఎదిగాడా ? వరుసగా సినిమా అవకాశాలు రావడానికే చిరంజీవి జపం చేశాడా ? పుష్ప సినిమా హిట్ తో బన్నీకి బలుపు పెరిగిపోయిందా ? మెగాస్టార్ బ్రాండ్ నుంచి కావాలనే…పక్కకు తప్పుకున్నాడా ? తానే ఒక ఫైర్ అనేలా వ్యవహరించాడా ? ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు…వైసీపీ తరపున ప్రచారం చేసి వైరం కొని తెచ్చుకున్నాడా ? చిరు కుటుంబమంతా జనసేనకు మద్దతిస్తే…అల్లు అర్జున్ మాత్రం తన రూటే సపరేట్ అనేలా బిల్డప్ ఇచ్చాడా ?

1. పుష్పసినిమా హిట్ తో విజయగర్వం

బన్నీ, దేశముదురు, ఆర్య వంటి సినిమాలు హిట్టయినపుడు అల్లు అర్జున్ మాములుగానే ఉన్నాడు. పుష్ప సినిమా ఎపుడైతే రిలీజయి…వసూళ్లలో రికార్డులు నెలకొల్పిందో…బన్నీకి ఎవరూ ఊహించనంతగా బలుపు పెరిగిపోయింది. ఇంకా చెప్పాలంటే ఒళ్లు కొవ్వెక్కి…అహంకారం, గర్వంతో వీర్రవీగాడు. తన కంటే పోటుగాడు ఎవరు లేరనేలా…టాలీవుడ్ లోనే సూపర్ స్టార్ లా కాలర్ ఎగరేసుకొని తిరిగాడు. పుష్ప సినిమాకే ఇంత ఓవర్ యాక్షన్ చేస్తే ఎలా అంటూ అనేక మంది విమర్శలు చేసినా…సద్విమర్శగా తీసుకోలేదు. పైగా టన్నుల కొద్దీ టాలెంట్ ఉందంటూ అతి చేశాడు. మెగా హీరోలను డామినేట్ చేసేలా యాటిట్యూడ్ చూపించాడు.

2. మెగాస్టార్ కాపౌండ్ నుంచి పక్కకు జరగడం

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ అంటే ఓ బ్రాండ్. ఎవరు ఎన్ని అన్నా…చిరంజీవి టాప్ స్టార్. అల్లు అర్జున్…కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలో మెగాస్టార్ చిరంజీవి పేరును ప్రస్తావించని సందర్బమంటూ లేదు. ఆడియో ఫంక్షన్ జరిగినా…సక్సెస్ మీట్ అయినా…మేనమామ మెగాస్టార్ పేరు జపించాడు. ఆ నీడలోనే ఎన్నో సినిమా అవకాశాలను సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీలో హీరోగా రాణించాడు. ఎప్పుడైతే పుష్ప సినిమా హిట్టయి…మంచి వసూళ్లు రాబట్టిందో…తనకంటే గొప్ప నటుడు లేరనేలా వ్యవహరించాడు. మరొకరు తనకు సాటి రారు..యాక్టింగ్ చేయలేరు అనేలా బిల్డప్ ఇచ్చాడు. చిరంజీవి కుటుంబానికి దూరమయ్యాడు. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే…మెగా పవర్ పేరు చెప్పడానికి కూడా నోరు పెగల్లేదు.

3. తానే ఓ బ్రాండ్ అనేలా ఓవర్ యాక్షన్
హ్యాపీ, పరుగు, ఆర్య, జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, రేసుగుర్రం వంటి సినిమాలు హిట్టయ్యాక…అల్లు అర్జున్ యాట్యిట్యూడ్, బీహేవియర్ పూర్తిగా మారిపోయింది. తానే ఒక బ్రాండ్ అనేలా…ఎక్కడికి వెళ్లినా…ఐకానిక్ స్టార్ నేమ్ పేరుతో ఉన్న షర్టులు, టీషర్టులు వేసుకొని తిరిగాడు. అల్లు అర్జున్ పేరే…ట్రెండ్ సెట్టర్, బ్రాండ్ అనుకునేలా టాలీవుడ్ లో తనను తాను ప్రమోట్ చేసుకున్నాడు. ఎవరి సాయం అవసరం లేదు…తానే సొంతంగా ఈ స్థాయికి వచ్చాననేలా షో చేశాడు. అనేక సినిమా ఫంక్షన్లలో పవన్ కల్యాణ్ పేరు ఎత్తితే…అభిమానులపైన ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో మెగాస్టార్, అల్లు కుటుంబాల మధ్య వార్ మొదలైందన్న వాదనలు వచ్చాయి. ఈ వివాదాలకు కేంద్ర బిందువు అల్లు అర్జున్ కారణమన్న విమర్శలు ఉన్నాయి.

4. జాతీయ అవార్డుతో ఓవర్ బిల్డప్

పుష్ప-1 సూపర్ హిట్ అయ్యాక…అల్లు అర్జున్ పట్టపగ్గాల్లేకుండా వ్యవహరించాడు. నాటి తరం హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్, క్రిష్ణ, శోభన్ బాబు, క్రిష్ణంరాజు…ఆ తర్వాత జనరేషన్ సూపర్ స్టార్లు చిరంజీవి, బాలక్రిష్ణ, నాగార్జున, వెంకటేశ్…నేటి తరం హీరోలు పవన్ కల్యాణ్, ప్రభాస్, రాంచరణ్, ఎన్టీఆర్ వంటి హీరోలకు సాధ్యం కానిది…తానే సాధించినట్లు ఫీలయ్యాడు. బాలయ్య నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ షోలోనూ…జాతీయ అవార్డు గురించి ఓవర్ గా చెప్పుకున్నాడు. అనేక దశాబ్దాల తెలుగు సినిమా రంగంలో…తానే నంబర్ వన్ అని…తనను ఇంకెవరు అందుకోలేరనేలా ఫీలయిపోయాడు.

5 ఏపీ ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం

2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో…మెగాస్టార్ కుటుంబం మొత్తం పవన్ కల్యాణ్ కు మద్దతు ఇచ్చింది. నాగబాబు, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వంటి మెగా హీరోలంతా…పవర్ స్టార్ తరపున పిఠాపురంలో ప్రచారం చేశారు. పలువురు టాలీవుడ్ హీరోలు సైతం…పవన్ కల్యాణ్ కు సపోర్ట్ గా నిలిచారు. అయితే అల్లు అర్జున్ మాత్రం…పవన్ కల్యాణ్ వ్యతిరేకులకు అండగా నిలిచాడు. స్నేహారెడ్డి ఫ్రెండ్ శిల్పా కిశోర్ కోసం ఎన్నికల వేళ నంద్యాలకు వెళ్లాడు. వైసీపీ అభ్యర్థి తరపున ర్యాలీ చేశాడు అల్లు అర్జున్. ఇది మెగాస్టార్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. మొన్నటి వరకు సైలెంట్ ఉన్న మెగా పవర్ స్టార్ అభిమానులు…బన్నీ అరెస్టయ్యాక…తగిన శాస్తి జరిగిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

6. సంధ్య థియేటర్ వద్ద ఓపెన్ టాప్ లో ర్యాలీ

పుష్ప-2 సినిమాను సంధ్య థియేటర్ లో చూసేందుకు వెళ్లిన అల్లు అర్జున్…అక్కడ పొలిటికల్ లీడర్లలాగా ర్యాలీ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోయి…ఆమె కుమారుడు చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే మహిళ చనిపోయిన విషయం…తనకు మరుసటి రోజు తెలిసిందని చెప్పి…అడ్డంగా ఇరుక్కుపోయాడు. తన కళ్ల ఎదురుగానే తొక్కిసలాట జరిగితే…తనకేం తెలియనట్లు నటించి…తన గోతిని తానే తీసుకున్నాడు. పైగా మహిళ చనిపోతే…సినిమా సూపర్ హిట్టే అని…సన్నిహితుల వద్ద అదే రోజు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో జనాల్లో ఉన్న మంచిపేరును…చేజేతులా సర్వనాశనం చేసుకున్నాడు. పోలీసులు మాత్రం…తొక్కిసలాట జరిగిన రోజే మహిళ చనిపోయినట్లు అల్లు అర్జున్ కు సమాచారం ఇచ్చామని బల్లగుద్ది చెబుతున్నారు.

7. బాధితురాలు రేవతితో చావును పట్టించుకోకపోవడం

అభిమానులు ఎవరైనా చనిపోతే…హీరోలు సానుభూతి చూపాలి. జరిగిన ఘటన బాధాకరమని చెప్పాలి. అంతేకాని…మహిళ చనిపోయిన విషయమే తనకు తెలియదని నటించడంతో…జనాల్లో తనకున్న ఇమేజ్ ను పొగ్గుట్టుకున్నాడు. తన అభిమాని రేవతి చనిపోతే…ఆ కుటుంబాన్ని పరామర్శించాల్సిన అల్లు అర్జున్ పట్టించుకోలేదు. ఆమె కుమారుడు శ్రీతేజ్…కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే…కనీసం చూసేందుకు కూడా మనసు రాలేదు. దీంతో అల్లు అర్జున్ ను అంతో ఇంతో అభిమానించే వారు కూడా…ఛీ కొట్టాల్సిన పరిస్థితికి తెచ్చుకున్నాడు. నిర్మాతలు, దర్శకుడు, తండ్రి అల్లు అరవింద్ కూడా రేవంత్ కుటుంబాన్ని పరామర్శించలేదు. 15 రోజుల తర్వాత అల్లు అరవింద్ ఆస్పత్రికి వెళ్లి…శ్రీతేజ్ ఆరోగ్యం గురించి ఆరా తీశాడు. అయితే ఎలాంటి ఆర్థిక సాయమూ చేయలేదు. ప్రభుత్వమే శ్రీతేజ్ మెడికల్ బిల్లులను చెల్లించింది.

8. జైలు నుంచి విడుదలయ్యాక బలప్రదర్శన

సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో పోలీసులు కేసు పెట్టి అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. అదే రోజు కోర్టు బెయిలివ్వడంతో..మరుసటి రోజు ఉదయం జైలు నుంచి విడుదలయ్యాడు. జైలు నుంచి గీతా ఆర్ట్స్ కార్యాలయం, అక్కడి నుంచి ఇంటికి చేరుకున్నాడు అల్లు అర్జున్. అయితే ఇంటి వద్ద టాలీవుడ్ హీరోలతో బలప్రదర్శనకు దిగాడు. టాలీవుడ్ హీరోలకు…తన టీం ద్వారా ఫోన్లు చేయించుకొని ఇంటికి పిలిపించుకున్నాడు. హీరోలు, దర్శకులు, నిర్మాతలకు షేక్ హ్యాండ్లు ఇస్తూ…ఫోటోలకు ఫోజులిచ్చాడు. తానేదో దేశ సరిహద్దుల్లో యుద్ధం చేసి వచ్చినట్లు…దేశం కోసం ఏదో చేసినట్లు ఓవర్ బిల్డప్ ఇచ్చాడు. సినీ రంగ ప్రముఖులతో టీలు, కాఫీలు తాగుతూ కనిపించడం…జనానికి ఆగ్రహం తెప్పించింది.

9. ప్రెస్ మీట్ పెట్టి పోలీసులను తప్పుపట్టడం

సంధ్య థియేటర్ వద్ద ఘటనలో తన తప్పేమీ లేదని…పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత వెళ్లానని ప్రెస్ మీట్ చెప్పాడు అల్లు అర్జున్. ఇక్కడే ఐకాన్ స్టార్ తప్పులో కాలేశాడు. పోలీసులను బుక్ చేద్దామనుకుని…తానే బుక్కయ్యాడు. సంధ్య థియేటర్ కు రావొద్దని…జనాల రష్ ఎక్కువ ఉందని…అల్లు అర్జున్ టీంకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు ఆధారాలు చూపిస్తున్నారు. అల్లు అర్జున్ బెయిల్ వాదనల సందర్బంగా…పోలీసులు కూడా విధులు మానేసి…బన్నీని చూసేందుకు వచ్చారంటూ వాదించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. తొక్కిసలాటలో మహిళ అపస్మారక స్థితిలోకి వెళితే…సీపీఆర్ చేశామని…రేవతిని కాపాడేందుకు చివరి దాకా ప్రయత్నించామని చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించిన వీడియోలను రీలీజ్ చేశారు. దీంతో అల్లు అర్జున్…చేజేతులా పోలీసుల చేతిలో బుక్కయ్యాడు.

10. తెలంగాణ ప్రభుత్వంతోనే ఢీ అంటే ఢీ

చంచలగూడ జైలు నుంచి విడుదలయిన తర్వాత అల్లు అర్జున్…జరిగిన ఘటనకు క్షమాపణ చెప్పి ఉంటే వివాదం సమసిపోయేది. కానీ నిప్పుతో చెలగాటం ఆడినట్లు…ప్రభుత్వంపైనే విమర్శలు చేశాడు. తన క్యారెక్టర్ అసాసినేషన్ కు పాల్పడుతున్నారని…20 ఏళ్లుగా సంపాదించుకున్న నమ్మకాన్ని, ఇమేజ్ పై బురద జల్లుతున్నారంటూ కామెంట్లు చేశాడు. తనపై కుట్రలు చేస్తున్నారంటూ మీడియా ముందుకు వచ్చి చెప్పడం…అల్లు అర్జున్ చేసిన దిద్దుకోలేని తప్పు. జైలుకు పోయి వచ్చాక ఏమైనా మారాడా అంటే అది లేదు. కుక్క తోక వంకరే అన్నట్లు…ప్రభుత్వంతోనే యుద్దానికి దిగాడు. తాను సినిమా చూసిన తర్వాత ఎలాంటి హడావిడి చేయలేదని అల్లు అర్జున్ చెబుతుంటే…ప్రభుత్వం వీడియోలతో సహ బయటపెట్టి…బన్నీ గాలి మొత్తం తీసేసింది.