ఫ్యాన్స్ తో ప్లానేంటి..? దెబ్బకు దేశం ఊగిపోవాలి.. ట్రెండ్ సెట్ అవ్వాలి..

పుష్ప2 మూవీ టైంలో సంధ్య థియేటర్ ఇన్స్ డెంట్ ప్రతీ హీరోని అలర్ట్ చేసినట్టుంది. ఎన్టీఆర్ కూడా తన కోసం పాదయాత్ర ప్లాన్ చేసిన ఫ్యాన్స్ మనసు మార్చాడు. తనే స్వయంగా అభిమానులని కలుస్తా అన్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 6, 2025 | 07:05 PMLast Updated on: Feb 06, 2025 | 7:05 PM

What Are You Planning With The Fans The Country Should Be Shaken By The Blow The Trend Should Be Set

పుష్ప2 మూవీ టైంలో సంధ్య థియేటర్ ఇన్స్ డెంట్ ప్రతీ హీరోని అలర్ట్ చేసినట్టుంది. ఎన్టీఆర్ కూడా తన కోసం పాదయాత్ర ప్లాన్ చేసిన ఫ్యాన్స్ మనసు మార్చాడు. తనే స్వయంగా అభిమానులని కలుస్తా అన్నాడు. అంతవరకు అదో పెద్ద వార్తగా మారింది. కాని ఇప్పుడు విషయం అది కాదు.. ఎన్టీఆర్ నిజంగా ఏం చేయబోతున్నాడు..? ఫ్యాన్స్ కి మీటింగ్ పెట్టి కలుస్తాడా..? అంటే ఆ మీటింగ్ ఎలా ఉంటుంది… ఆడియోఫంక్షన్ లా ఉంటుందా? ప్రీరిలీజ్ ఈవెంట్ లా ప్లాన్ చేస్తారా…? అలా చేయబోతేనే దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది. 5 వేలమందికి బదులు 30 వేల వరకు ఫ్యాన్స్ రావటమే కారణం. సో ఇప్పడు ఫ్యాన్స్ తో గెట్ టు గేదర్ అంటే, వేలల్లో కాదు లక్షల్లో వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మళ్లీ రచ్చయ్యేలా ఉంది. అలా కాదు సింపుల్ గా మండలానికో ఐదుగురు చొప్పున పిలుస్తాడా అంటే… పర్మీషన్స్ కోసం ట్రై చేస్తున్నా అన్నాడు ఎన్టీఆర్. పోలీస్ పర్మీషన్ వరకు మ్యాటర్ వేల్లిందంటే, ఈ ఫ్యాన్స్ గ్యాదరింగ్ పెద్ద మొత్తంలోనే ఉండబోతోందని తేలింది… మరి ఈ మీటింగ్ ఉద్దేశ్యం ఏంటి? ఎలా ఉండబోతోంది? దేశం మొత్తం ఉలిక్కి పడేలా, రజినీకాంత్ ని మించేలా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఏం చేయబోతున్నాడు..? టేకేలుక్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రీసెంట్ గా ఫ్యాన్స్ ని రిక్వెస్ట్ చేశాడు. తనని కలవొద్దని, తానే అందరిని కలిసేందుకు వస్తానని అన్నాడు.అందరిని కలిసేందుకు ఆ గెట్ టూ గేదర్ కి పర్మీషన్స్ తీసుకుంటున్నట్టు కూడా తేల్చాడు. ఇంతకి ఇలా ఆల్ ఆఫ్ సడన్ గా ఫ్యాన్స్ ని కలిసే ప్రయత్నం తానెందుకు చేస్తున్నాడు..? ఇప్పడప్పట్లో తన సినిమాలు లేవు.

కేవలం తనని కలిసేందుకు ఫ్యాన్స్ పాదయాత్ర ప్లాన్ చేయటమే రీజనా అంటే, అసలు కారణం దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ తో ముడిపడింది. అప్పట్లో ఈ ఈవెంట్ ఆగిపోయింది. 5 వేల మంది వస్తారనుకుంటే, 30 వేలకు మించి ఫ్యాన్స్ రావటంతో, ఈవెంట్ నే క్యాన్సిల్ చేశారు. ఆతర్వాత పుష్ప2 సంధ్యా థియేటర్ ఇన్స్ డెంట్ లో తొక్కిసలాట జరిగింది. ఒక ప్రాణం పోయింది. మరో చిన్నారికి హాస్పిటల్ లో చికిత్స జరుగుతోంది.

అప్పడే చాలా మంది దేవర ఈవెంట్ వాయిదా పడటం మంచిదైందన్నారు. ఏకంగా 30 వేల మంది వచ్చినప్పుడు ఈవెంట్ ని కంటిన్యూచేస్తే ఏమయ్యేదో అని, చాలా మంది రెస్పాండ్ అయ్యారు. అప్పట్లో సోషల్ మీడియాలో ఈ టైపు స్టేట్ మెంట్లు కూడా కనిపించాయి. కట్ చేస్తే దేవర ఈవెంట్ అప్పుడు క్యాన్సిల్ అయ్యింది కాబట్టే, ఇప్పుడు ఫ్యాన్స్ తో గెట్ టూగేదర్ ప్లాన్ చేశాడట తారక్.

తన ఫ్యాన్స్ ఏకంగా పాదయాత్ర చేసి తనని కలవాలనుకోవటం వల్ల, ఆ నిర్ణయం వెనక్కి తీసుకునేలా అభిమానులను ఒప్పించగలిగాడు. రిక్వెస్ట్ చేసి తానే అందరిని కలుస్తానన్నాడు. ఉగాది తర్వాతే ఆ మీటింగ్ ఉండొచ్చని తెలుస్తోంది. ఏదో వెయ్యో రెండు వేలమందితో ఈ గెట్ టుగేదర్ కాదు, లక్షకి పైనే ఉండొచ్చని తెలుస్తోంది.

అప్పట్లో ఆంద్రావాలా ఆడియో ఫంక్షన్ కి పదిలక్షల వరకు ఫ్యాన్స్ ఎన్టీఆర్ స్వగ్రామానికొచ్చారు. రైల్వే శాఖ 9 ప్రత్యేక రైల్లను కూడా నడిపింది. అద్రుస్టం కొద్ది ఏ అభిమానికి ఏమి కాలేదని చాలా ఇంటర్వూల్లో చెప్పాడు తారక్. కాకపోతే బాద్ షా ఆడియో ఫంక్షన్ లోనే అపశ్రుతి జరిగింది. కాబట్టే తన ఫ్యాన్స్ తన కోసం ఇబ్బంది పడొద్దని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఇంకా వెన్యూ ఫిక్స్ కాలేదు కాని, లక్ష మందికి సరిపడా లొకేషన్, అంత మందిని జాగ్రత్తగా తీసుకొచ్చి, అంతా జాగ్రత్తగా ఇంటికెల్లేలా భారీ ప్లానింగ్ జరుగుతోంది. అదంతా పోలీస్ పర్మీషన్ తర్వాతే అని తెలుస్తోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా తన ఫ్యాన్స్ ని అప్పడప్పుడు ఇలా పిలిపించుకుని, అందరితో ఆప్యాయంగా మాట్లాడటతాడు.. కాని అది పరిమిత సంఖ్యలోనే… కాని ఇక్కడ తారక్ లక్షల్లో ఫ్యాన్స్ ని మీటయ్యేందుకు భారీ ఎత్తున ప్లానింగ్చేస్తున్నాడట. సో ఫ్యాన్స్ కోసం సినిమా రిలీజ్ లేవి లేకున్నా, ఎన్టీఆర్ ఇలా ఓ ఈవెంట్ ని ప్లాన్ చేయటం టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టింగ్ ఎలిమెంట్ గా మారుతోంది.