Mega Meems : నా తమ్ముడు జెమ్ అండీ జెమ్.. చిరు-రజనీతో ఏం చెప్పాడంటే…
పవర్ స్టార్ (Power Star) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) 10యేళ్ళ నిరీక్షణ ఫలించింది. పిఠాపురం (Pithapuram) నుంచి భారీ మెజారిటీతో నెగ్గటమే కాదు... ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా కూడా ప్రమాణం చేశారు.

What did my younger brother Gem and Gem say to Chiru-Rajni...
పవర్ స్టార్ (Power Star) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) 10యేళ్ళ నిరీక్షణ ఫలించింది. పిఠాపురం (Pithapuram) నుంచి భారీ మెజారిటీతో నెగ్గటమే కాదు… ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా కూడా ప్రమాణం చేశారు. దాంతో మెగాస్టార్ (Megastar) కుటుంబంతో పాటు అభిమానులు కూడా సంతోషంలో మునిగి తేలుతున్నారు. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అనే నేను… అంటూ పవర్ స్టార్ మంత్రిగా ప్రమాణం చేస్తుంటే… ఈ మెగా ఈవెంట్ కి అటెండ్ అయిన అన్న చిరంజీవి, రామ్ చరణ్ తో పాటు పవన్ భార్యా అన్నా కూడా హ్యాపీగా ఫీలయ్యారు. అభిమానులైతే కేరింతలు కొట్టారు. ప్రమాణ స్వీకారం వేదికపై సూపర్ స్టార్ (Superstar) రజినీ కాంత్ పక్కనే కూర్చున్నారు మెగాస్టార్ చిరంజీవి. పవన్ ప్రమాణం చేసేటప్పుడు చిరు కళ్ళల్లో ఆనందం కనిపించింది. ప్రమాణం తర్వాత తన దగ్గరకు వచ్చి కాళ్ళు మొక్కుతుంటే… తమ్ముడిని దగ్గరకు తీసుకొని ఆప్యాయంగా హత్తుకున్నారు చిరంజీవి. ఆ అన్నాదమ్ముల అనుబంధం చూసి… ప్రతి ఒక్కరికీ కళ్ళు చెమర్చాయి. చిరు పక్కనే ఉన్న రజనీ కాంత్ కూడా చప్పట్లు కొడుతూ ఆనందంగా కనిపించారు.
ప్రమాణస్వీకారం వేదికపై మెగాస్టార్, సూపర్ స్టార్ పక్కపక్కనే కూర్చున్నారు. కార్యక్రమం నడుస్తున్న టైమ్ లో తరుచుగా వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం కనిపించింది. అయితే రజనీకాంత్ తో చిరంజీవి ఏం మాట్లాడారన్నది ఆసక్తికరంగా మారింది. తన తమ్ముడి పదేళ్ళ కష్టం గురించి చెప్పారా… ఏపీలో కూటమి విజయం గురించి మాట్లాడుకున్నారా. అసలు ఏం మాట్లాడారన్నది బయటకు తెలియనప్పటికీ… సోషల్ మీడియాలో మాత్రం అన్నయ్య మూవీలోని డైలాగ్స్ తో మీమ్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి. అందులో తన తమ్ముళ్ళుగా నటించిన… రవితేజ, వెంకట్ ని సౌందర్యకు పరిచయం చేస్తూ… నా తమ్ముళ్ళు జెమ్స్ అండీ జెమ్స్ అని అంటాడు చిరంజీవి. పవన్ కల్యాణ్ ప్రమాణం చేస్తున్నప్పుడు రజనీకాంత్ కి కూడా మా తమ్ముడు జెమ్ అండీ జెమ్ అని చిరంజీవి చెబుతున్నట్టు మీమ్ చేశారు. దానికి సమాధానంగా రజనీకాంత్… ఆ.. ఇప్పటికి వంద సార్లు చెప్పావ్… అని సమాధానం ఇచ్చినట్టుగా మీమ్ వైరల్ అవుతోంది. ఇది కాకుండా… అదే మూవీలో తన తమ్ముడిని పొగుడుతున్న సీన్ కి… మొన్నీ మధ్య nda మీట్ లో… పవన్ ను ఉద్దేశించి నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) చేసిన కామెంట్స్ ని యాడ్ చేశారు. పవన్ తుఫాను లాంటి వాడని చెప్పిన డైలాగ్ ని జత చేశారు మెగాస్టార్ అభిమానులు. ఈ మీమ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.