బెట్టింగ్ డబ్బులు ఏం చేశావ్, పోలీసుల ప్రశ్నలకు రీతూ కన్నీళ్లు
బెట్టింగ్స్ యాప్స్ వ్యవహారంలో ఇన్‌ఫ్లుయెన్సర్ రీతూ చౌదరి పోలీసుల ముందు హాజరయ్యారు. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో రీతూ చౌదరిని పోలీసులు విచారించారు. ఈ విచారణలో రీతూ నుంచి కీలక సమాచారం సేకరించారు.

బెట్టింగ్స్ యాప్స్ వ్యవహారంలో ఇన్‌ఫ్లుయెన్సర్ రీతూ చౌదరి పోలీసుల ముందు హాజరయ్యారు. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో రీతూ చౌదరిని పోలీసులు విచారించారు. ఈ విచారణలో రీతూ నుంచి కీలక సమాచారం సేకరించారు. ఈ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసేందుకు ఎవరు, ఎలాంటి ఆఫర్ ఇచ్చారు. బెట్టింగ్ యాప్స్ నుంచి వచ్చి డబ్బుతో ఏం చేశారంటూ రీతూను పోలీసులు విచారించారు. ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. రీతూ బ్యాంక్ అకౌంట్‌తో పాటు కాల్ డేటాను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇదే కేసులో ఇవాళే యాక్టర్ విష్ణుప్రియను కూడా పోలీసులు విచారించారు. విష్ణుప్రియ బ్యాంక్ వివరాలు తీసుకున్న పోలీసులు.. ఆమె సెల్‌ఫోన్‌ను సీజ్ చేశారు. మొబైల్ నుంచి కీలక విషయాలు సేకరించే పనిలో ఉన్నారు. ఇక బ్యాంక్ లావాదేవీలు కూడా సేకరించిన తరువత మరోసారి విష్ణుప్రియను విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఇదే కేసేలు హీరోలు రానా, విజయ్ దేవరకొండతో పాటు ప్రకాష్‌రాజ్ మీద కూడా కేసులు నమోదు చేశారు. త్వరలోనే వాళ్లను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంది.