అల్లు అర్జున్ కు ఏమైంది..? అతి జాగ్రత్తతో అసలుకే మోసం వస్తుందేమో చూస్కో బన్నీ..?
కళ్ళ ముందు దర్శకులున్నారు.. ఏం చేయాలో క్లారిటీ ఉంది.. అయినా కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాడు అల్లు అర్జున్. పుష్ప సినిమా తర్వాత ఈయన ఏం చేయాలనే విషయంపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు.

కళ్ళ ముందు దర్శకులున్నారు.. ఏం చేయాలో క్లారిటీ ఉంది.. అయినా కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాడు అల్లు అర్జున్. పుష్ప సినిమా తర్వాత ఈయన ఏం చేయాలనే విషయంపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. ఎందుకు నెక్స్ట్ సినిమాను ఆలస్యం చేస్తున్నాడు అనే విషయం కూడా అర్థం కావడం లేదు. కళ్ళ ముందు ఇద్దరు దర్శకులు సిద్ధంగా ఉన్నారు. అయినా కూడా ఇంకేదో కావాలని ఆలోచిస్తున్నాడు అల్లు అర్జున్. పుష్ప 2 తర్వాత బన్నీ ఇమేజ్ గ్లోబల్ స్థాయికి చేరిపోయింది. దాదాపు 1800 కోట్లు వసూలు చేయడంతో.. నెక్స్ట్ సినిమా కూడా అలాగే ఉండాలని ప్లాన్ చేస్తున్నాడు అల్లు అర్జున్. దీనికోసం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. కావాలంటే ఆరు నెలలు ఖాళీగానే ఉన్నా.. నెక్స్ట్ వచ్చే సినిమా మాత్రం కచ్చితంగా 2000 కోట్లు వసూలు చేయాల్సిందే అని పట్టుబడుతున్నాడు ఈయన.
దీనికోసం ఏ దర్శకుడు అయితే బాగుంటాడని కన్ఫ్యూజ్ పడుతున్నాడు. నిజానికి పుష్ప 2 విడుదలకు ముందు త్రివిక్రమ్ తో సినిమా అనౌన్స్ చేశాడు అల్లు అర్జున్. అయితే ఇప్పటి వరకు ప్యాన్ ఇండియా సినిమా చేసిన అనుభవం ఈయనకు లేదు. తెలుగు ఇండస్ట్రీ వరకు త్రివిక్రమ్ కథలు బాగానే వర్కౌట్ అవుతాయి. తెలిసిన కథనే అలా ఇలా మార్చు చెప్పడంలో మాస్టర్ మన గురూజీ. కానీ ప్యాన్ ఇండియా సినిమా చూసే సత్తా ఈయనకు ఉందా లేదా అనే అనుమానాలు కూడా అలాగే ఉన్నాయి. పైగా గుంటూరు కారం కూడా అంతంతమాత్రంగానే ఆడింది. ఇలాంటి సమయంలో గురూజీని నమ్మి సినిమా ఇవ్వాలా వద్దా అని డైలమాలో పడిపోయాడు అల్లు అర్జున్. అందుకే అనౌన్స్ చేసి ఇన్ని రోజులైనా.. ఇంతవరకు పూజా కార్యక్రమాలు కూడా చేయలేదు. అన్నింటికీ మంచి త్రివిక్రమ్ ఇప్పటి వరకు కథ కూడా సిద్ధం చేయలేదని తెలుస్తోంది. కెరీర్లో మొదటిసారి మైథాలజికల్ సబ్జెక్టు సిద్ధం చేస్తున్నాడు మాటలు మాంత్రికుడు. ప్యాన్ ఇండియన్ సినిమా చేయాలంటే కథ కూడా అలాగే ఉండాలని ఇతిహాసాల వైపు వెళ్తున్నాడు త్రివిక్రమ్. కార్తికేయ స్వామి నేపథ్యంలో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది.
మరోవైపు అట్లీ కూడా అల్లు అర్జున్ కోసం కథ సిద్ధం చేస్తున్నాడు. నిజానికి త్రివిక్రమ్ కంటే అట్లీ మీదే అల్లు అర్జున్ గురి ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే జవాన్ సినిమాతో వెయ్యి కోట్లు వసూలు చేశాడు ఈ దర్శకుడు. అలాంటి డైరెక్టర్ తో నెక్స్ట్ సినిమా చేస్తే ఖచ్చితంగా గ్లోబల్ రేంజ్ ఉంటుందని అల్లు అర్జున్ ఆలోచన. అలా కాదని త్రివిక్రమ్ తో పని చేస్తే కేవలం తన బ్రాండ్ మీదే సినిమాను బయటకు తీసుకెళ్లాలి.. ఒకవేళ అట్లీతో పాటు చేస్తే ఇద్దరి బ్రాండ్ పనికొస్తుంది. ప్రస్తుతం ఈ కన్ఫ్యూజన్లోనే ఉన్నాడు బన్నీ. త్వరలోనే దీని నుంచి బయటికి వచ్చి నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేస్తాడని తెలుస్తుంది.