సాయి పల్లవికి ఏమైంది..? సీరియస్ వార్నింగ్ ఇచ్చిన డాక్టర్స్
సౌత్ ఇండియాలో సాయి పల్లవి ఫాలోయింగ్ రోజు రోజుకి పెరిగిపోతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న సాయి పల్లవి ప్రస్తుతం నాగచైతన్య హీరోగా వస్తున్న తండేల్ అనే సినిమాలో నటిస్తోంది.
సౌత్ ఇండియాలో సాయి పల్లవి ఫాలోయింగ్ రోజు రోజుకి పెరిగిపోతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న సాయి పల్లవి ప్రస్తుతం నాగచైతన్య హీరోగా వస్తున్న తండేల్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా కోసం నాగ చైతన్య దాదాపు ఏడాది నుంచి కష్టపడుతున్నాడు. ఎలాగైనా సరే ఈ సినిమాతో అక్కినేని కుటుంబాన్ని వందకోట్ల క్లబ్లో చేర్చాలని నాగచైతన్య కమిట్మెంట్ తో వర్క్ చేశాడు. ఇక డైరెక్టర్ చందు మొండేటి కూడా ఈ సినిమాను చాలా సీరియస్ గా తీసుకున్నాడు.
నిర్మాత బన్నీ వాసు కూడా కథ బాగా నష్టంతో పెట్టుబడి విషయంలో ఎక్కడా వెనకడుగు వేయలేదు. హీరోయిన్ సాయి పల్లవి కూడా ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేసింది. రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు మేకర్స్. కథలో దమ్ము ఉండటంతో సినిమా ఖచ్చితంగా హిట్టు కొడుతుందని ప్రమోషన్స్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేస్తున్నారు మేకర్స్. ఈనెల 7న ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కానుంది. రీసెంట్గా చెన్నైలో ప్లాన్ చేసిన ఈవెంట్ కూడా సూపర్ సక్సెస్ అయింది.
ఈ సినిమా హిట్ అయితే నాగచైతన్య తర్వాతి ప్రాజెక్టుల విషయంలో మరింత స్పీడ్ పెంచే ఛాన్స్ ఉంది. అందుకే నాగార్జున కూడా ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో హెల్ప్ చేస్తున్నారట. అయితే లేటెస్ట్గా వచ్చిన ఒక అప్డేట్ మాత్రం సాయి పల్లవి ఫాన్స్ ను కంగారు పెడుతుంది. ఎప్పుడు ఎంతో యాక్టివ్ గా కనబడే సాయి పల్లవి ఇప్పుడు మాత్రం చాలా డల్ గా కనపడుతుంది. దీంతో అసలు ఏమైంది అంటూ అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇక సోషల్ మీడియాలో అయితే ఆమెకు ఏదో వైరస్ వచ్చిందంటూ ప్రచారం చేయడం గమనార్హం.
అయితే లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ప్రకారం ఆమె ప్రస్తుతం జలుబు జ్వరం అలాగే దగ్గుతో తీవ్రంగా బాధపడుతున్నారట. అయినా సరే ఈ సినిమా సూపర్ హిట్ కావాలని ప్రమోషన్స్ విషయంలో సాయి పల్లవి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా హెల్ప్ చేస్తోంది. అమరన్ సినిమా తర్వాత సాయి పల్లవికి తమిళంలో మంచి ఫాలోయింగ్ వచ్చింది. కథలో పట్టుంటే సాయి పల్లవి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా రెమ్యూనరేషన్ కూడా డిమాండ్ చేసేస్తోంది. ప్రస్తుతం సాయి పల్లవి జ్వరంతో ఇబ్బంది పడటంతో ఆమెను ప్రమోషన్స్ కు వద్దని మూవీ మేకర్స్ చెప్పారట. ఇక వైద్యులు కూడా ఆమెను రెస్ట్ తీసుకోవాలని కొన్నాళ్లపాటు బయట తిరగొద్దని చెప్పడంతో సాయి పల్లవి తన సొంత ఊరు వెళ్లిపోయిందట. దీనితో ఇకనుంచి జరగబోయే ప్రమోషన్స్ లో సాయి పల్లవి లేకుండానే ప్లాన్ చేయనున్నారు మేకర్స్.