ముగ్గురు మొనగాళ్లకు ఏమైంది… 1000 కోట్ల విరక్తి… !

గ్లోబల్ స్టార్ అలియాస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి విరక్తి పెరిగినట్టుంది...ఇంచుమించు బన్నీ పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. కనీసం అల్లు అర్జున్ కి పాన్ ఇండియా లెవల్లో పుష్ప2 తో హిట్ పడింది... చరణ్ కి అది కూడా లేదు. గేమ్ ఛేంజర్ తో పంచ్ పడ్డాక తన సందడే కనిపించట్లేదు... వీళ్లకు తోడు సూపర్ స్టార్ మహేశ్ బాబుకి కూడా ఇంచుమించు ఇలాంటి సిచ్చువేషనే ఎదురైంది...

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 3, 2025 | 05:00 PMLast Updated on: Feb 03, 2025 | 5:00 PM

What Happened To The Three Heros 1000 Crores Of Hatred

గ్లోబల్ స్టార్ అలియాస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి విరక్తి పెరిగినట్టుంది…ఇంచుమించు బన్నీ పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. కనీసం అల్లు అర్జున్ కి పాన్ ఇండియా లెవల్లో పుష్ప2 తో హిట్ పడింది… చరణ్ కి అది కూడా లేదు. గేమ్ ఛేంజర్ తో పంచ్ పడ్డాక తన సందడే కనిపించట్లేదు… వీళ్లకు తోడు సూపర్ స్టార్ మహేశ్ బాబుకి కూడా ఇంచుమించు ఇలాంటి సిచ్చువేషనే ఎదురైంది… విచిత్రం ఏంటంటే కన్నడ స్టార్ రాకీ భాయ్ మిస్టర్ యష్ మాత్రం ఎటు పోవాలో.. ఎటు పోతున్నాడో అర్ధం కావట్లేదు… ఇందులో రామ్ చరణ్ కి త్రిబుల్ ఆర్ తో 1350 కోట్ల రికార్డు దక్కింది. ఇలాంటి పాన్ ఇండియా హిట్లు యష్ కి రెండు దక్కితే, బన్నీకి రెండు సార్లు పాన్ ఇండియా మార్కెట్ షేక్ చేసిన రికార్డు దక్కింది. కాని పుష్ప2 హిట్ తర్వాత సంధ్యా థియేటర్ ఇష్యూ, ఐటీ రైడ్ తో కలెక్సన్స్ మీద జరిగిన రచ్చ కాస్త ఇబ్బంది పెట్టాయి. అంత మాత్రానికే విరక్తి చెందాడా? సరే బన్నీ, రామ్ చరణ్ విరక్తికి కారణముంది… యష్ కన్ ఫ్యూజన్ వెనక పెద్ద కథే ఉంది… కాని సూపర్ స్టార్ మహేశ్ ఎందుకు ఈ ఏడాది మీద అలిగాడు… రాజమౌళి మాత్రమే రీజనా..? హావేలుక్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి దెబ్బ మీద దెబ్బ పడేసరికి మైండ్ బ్లాంక్ అయినట్టుంది. ఆచార్యా, గేమ్ ఛేంజర్ లాంటి పాన్ ఇండియా ఫ్లాప్స్ తో సడన్ గా తను సైలెంట్ అయ్యాడు. బుచ్చి బాబు మూవీ పెద్ది ప్లానింగ్ తో బిజీ అయ్యాడు. ఈ సినిమా మొదలై, పూర్తవ్వాలంటే 9 నెలలకంటే ఎక్కువే టైం పట్టేలా ఉంది. పీరియాడిక్ డ్రామా అవటంతో, మేకింగ్ తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ కి చాలా టైం పట్టే ఛాన్స్ఉంది.

అందుకే 2025 లో గ్లోబల్ స్టార్ సినిమా సందడికి ఛాన్సేలేదు. అసలే వరుస హిట్లతో డిప్రెషన్ లో ఉన్న స్టార్స్, ఎన్నడూ వెంట వెంటనే సినిమాలతో దండెత్తడం జరగదు… కోలుకోవటానికి కాస్త టైం కావాలి… కొత్త సినిమా పూర్తవ్వాలంటే కూడా టైం కావాలి… అందుకే చెర్రీ సందడి ఈ ఏడాది మిస్ అయినట్టే… ఏదున్నా 2026 లోనే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి చరణ్ లా ఫ్లాప్ పడలేదు. పాన్ ఇండియా లెవల్లో పుష్ప2 సాలిడ్ హిట్ గా మారింది. కాని, సంథ్యా థియేటర్ సంఘటన, ఆతర్వాత ఐటీ రైడ్స్, ఆవెంటనే కలెక్షన్స్ నెంబర్స్ లో చాలా వరకు ఫేట్ అంటూజరిగిన ప్రచారం…మొత్తంగా బన్నీని చాలా డిస్ట్రబ్ చేశాయంటున్నారు

అలా జరక్కున్నా, వెంటనే తను ఏ సినిమా కమిట్ అవ్వనన్నాడు. ఆరునెల్ల టైం తీసుకున్నకే కొత్త ప్రాజెక్ట్ చేస్తానన్నాడు. కాని ఈలోపే త్రివిక్రమ్ తో సినిమాకు కమిటయ్యాడు. కాని అది మొదలయ్యేదే జూన్ లో అంటే, పూర్తయ్యేదెప్పుడు..? అలా చూస్తే 2025 లో ఈ హీరో సినిమా కూడా వచ్చేఛాన్స్ లేదు. ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎలాగూ రాజమౌళి సినిమాకు కమిటయ్యాడు. కాబట్టి కనీసం రెండేళ్లవరకు తన సినిమా రాదు. రాజమౌళి సినిమాను శిల్పం చెక్కినట్టు చెక్కుకుంటూ పోతే, అదెప్పుడొస్తుందో అన్న కంగారు ఫ్యాన్స్ లోతప్పదు

అసలే గుంటూరు కారం లో హీరో పాత్ర అదిరింది.. కథ మాత్రం బెదిరిందనే డిసప్పాయింట్ మెంట్ ఫ్యాన్స్ లో ఉంది. త్రివిక్రమ్ లేజీ రైటింగ్స్ తో గుంటూరు కారం, ఫ్యాన్స్ కళ్లలో పడినట్టైంది. ఇలాంటి టైంలో ఓ సాలిడ్ హిట్ పడితే ఆ కిక్కే వేరు. అలాంటి ప్రయత్నం జరిగిందంటే ఎవరైనా నమ్ముతారా..? నిజంగానే షార్ట్ అండ్ స్వీట్ గా అనిల్ రావిపుడి మేకింగ్ లో మహేశ్ ఓ మూవీ చేయాలనుకుని, లుక్ కండీషన్స్ పరంగా రాజమౌళి నో చెప్పడంతో, సీన్ మారింది. మెగాస్టార్ వైపు అలా అనిల్ రావిపుడి రూట్ మార్చాడని లేటుగా తెలుస్తోంది

ఏదేమైనా 2025 లో బన్నీ,చెర్రీ, మహేశ్ ఈముగ్గురి సినిమాలు మిస్ అవబోతున్నాయి. ఆగస్ట్ 14 కి వార్ 2 తో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీతో దాడి చేయబోతున్నాడు. ఏప్రిల్ కుదరకున్న సమ్మర్ లో ది రాజా సాబ్ గా ప్రభాస్ రాబోతున్నాడు. ఇక ఎటొచ్చి యష్ సంగతే తేలలేదు. ఏప్రిల్ 10కి తన టాక్సిక్ మూవీ వస్తుందన్నారు. కాని షూటింగ్ ప్రోగ్రెస్ చూస్తుంటే, ఈ ఏడాది ఎండ్ వరకు కూడా టాక్సిక్ వచ్చే ఛాన్స్ కనిపించట్లేదు.