వివి వినాయక్ కు ఏమైంది..? ఆయన ఆరోగ్యం నిజంగానే ఆందోళనకరమా..?
VV వినాయక్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చూసి ఆయన అభిమానులు కంగారు పడుతున్నారు. మరి నిజంగానే ఆయన ఆరోగ్యం విషమంగా ఉందా.. అసలు ఎలా ఉంది..

VV వినాయక్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చూసి ఆయన అభిమానులు కంగారు పడుతున్నారు. మరి నిజంగానే ఆయన ఆరోగ్యం విషమంగా ఉందా.. అసలు ఎలా ఉంది.. వినాయక్ కు ఏమైంది అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి కంటే ముందు నెంబర్ వన్ మాస్ డైరెక్టర్ వివి వినాయక్. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు. ఎందుకంటే ఆది సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ఆ తర్వాత బాలకృష్ణతో చెన్నకేశవరెడ్డి సోసోగా ఆడింది. కానీ దిల్ సినిమాతో మరో సెన్సేషనల్ హిట్ కొట్టాడు వినాయక్. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు ఈ దర్శకుడికి. వినాయక్ వర్క్ నచ్చి.. తనతో ఠాగూర్ సినిమా చేసే అవకాశం ఇచ్చాడు చిరంజీవి. అది ఇండస్ట్రీ హిట్ అయింది. తమిళ సినిమా రమణకు రీమేక్ అయినా.. అక్కడ లేని చాలా సన్నివేశాలు తెలుగులో యాడ్ చేశాడు వినాయక్.
సాంబ యావరేజ్ దగ్గరే ఆగినా.. లక్ష్మీ, బన్నీ, కృష్ణ, అదుర్స్ లాంటి సినిమాలతో తన రేంజ్ చూపించాడు ఈయన. మధ్యలో యోగి, బద్రీనాథ్ అంచనాలు తప్పినా కూడా భారీ నష్టాలు మాత్రం తీసుకురాలేదు. కానీ ఇలాంటి సమయంలో వచ్చిన అఖిల్ వినాయక్ కెరీర్ ను చావుదెబ్బ తీసింది. దాని కంటే ముందు అల్లుడు శీను ఫ్లాప్ అయినా కూడా మంచి సినిమాగా మిగిలిపోయింది. కాస్ట్ ఫెయిల్యూర్ అయింది కానీ కమర్షియల్ గా మాత్రం బెల్లంకొండ శ్రీనివాస్ ను హీరోగా పరిచయం చేసింది అల్లుడు శీను. కానీ అఖిల్ ఫ్లాప్ ఈ మాస్ డైరెక్టర్ కెరీర్ ను బాగా డిస్టర్బ్ చేసింది. చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నెంబర్ 150 సూపర్ హిట్ అయినా కూడా అది పూర్తిగా మెగా మానియాలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన ఇంటలిజెంట్ దారుణంగా నిరాశ పరిచింది. దాంతో ఆరేళ్లుగా మళ్ళీ తెలుగు సినిమా చేయలేదు.
మధ్యలో హిందీకి వెళ్లి చత్రపతి రీమేక్ చేశాడు కానీ.. అది ఒక్కరోజు కంటే ఎక్కువగా ఆడలేదు. ప్రస్తుతం ఈయన ఫోకస్ సినిమాల కంటే కూడా ఆరోగ్య మీదనే ఉంది. కొన్ని రోజులుగా వివి వినాయక్ అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. గతేడాది ఈయనకు లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగింది. అప్పటినుంచి అసౌకర్యంగానే ఉన్నాడు వినాయక్. అప్పుడప్పుడు ఆయన బయటికి వచ్చినప్పుడు అతని చూసి షాక్ అవుతున్నారు అభిమానులు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి అయినా అస్వస్థతకు గురైనట్టు తెలుస్తుంది. ప్రమాదం ఏమీ లేకపోయినా కూడా పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పినట్టు ఇండస్ట్రీ నుంచి వస్తున్న టాక్. ఈ లెక్కల ఇప్పట్లో వినాయక్ నుంచి సినిమాలు ఊహించడం కష్టమే. అన్నట్టు గతవారం జరిగిన దిల్ సినిమా సెలబ్రేషన్స్ లో పాల్గొన్నాడు వినాయక్. అప్పుడు ఆయన ఉత్సాహంగానే కనిపించినా.. మొహంలో మాత్రం మునపటి కళ కనిపించలేదు.