తస్సాదియ్యా ఏం ప్లాన్ చేశావయ్యా అనిల్..! చిరుతో అలాంటి సినిమా చేయబోతున్నావా..!
చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న విశ్వంభర కంటే.. నెక్స్ట్ అనిల్ రావిపూడితో చేయబోయే సినిమా కోసమే అభిమానులు ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు అంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే అనిల్ ట్రాక్ రికార్డు అలా ఉంది మరి.

చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న విశ్వంభర కంటే.. నెక్స్ట్ అనిల్ రావిపూడితో చేయబోయే సినిమా కోసమే అభిమానులు ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు అంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే అనిల్ ట్రాక్ రికార్డు అలా ఉంది మరి. కేవలం ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేసి ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టిన ఘనత అనిల్ రావిపూడి సొంతం. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత అనిల్ రేంజ్ చూస్తుంటే మిగిలిన దర్శకులకు భయమేస్తుంది. రిస్కు తీసుకోడు.. కొత్త కొత్త కథల వైపు వెళ్ళడు.. వందల కోట్ల బడ్జెట్ పెట్టించడు.m అన్నింటికి మించి మూడు నెలల్లో షూటింగ్ పూర్తి చేసి.. ఆరు నెలల్లో సినిమా రిలీజ్ చేస్తాడు. ఒక నిర్మాతకు ఇంతకంటే దర్శకుడు నుంచి ఏం కావాలి..? అందుకే అనిల్ రావిపూడి కోసం నిర్మాతలు మాత్రమే కాదు.. హీరోలు కూడా పోటీ పడుతున్నారు.
ఈ లిస్టులో అందరికంటే ముందు చిరంజీవి ఉన్నాడు. నిజానికి అనిల్, చిరంజీవి కాంబినేషన్లో సినిమా ఎప్పుడో రావాల్సి ఉన్నా కూడా అనుకోకుండా ఆలస్యం అవుతూ వస్తుంది. తాజాగా ఇద్దరు కాంబినేషన్లో సినిమా వర్కవుట్ అయింది. మే నుంచి షూటింగ్ కూడా మొదలు కాబోతుంది. అయితే హీరోను బట్టి కథ రాసుకునే అనిల్.. చిరంజీవి కోసం ఎలాంటి కథ సిద్దం చేస్తున్నాడనే ఆసక్తి అందరిలోనూ ఉంది. దానికి సమాధానం దొరికిపోయిందిప్పుడు. ఇందులో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. మెగాస్టార్ కెరీర్ లో డ్యూయల్ రోల్ చేసిన సినిమాలు చాలా వరకు సక్సెస్ అయ్యాయి.
దొంగ మొగుడు, యముడికి మొగుడు, రౌడీ అల్లుడు, స్నేహం కోసం, ఖైదీ నెం 150 లాంటి సినిమాలు బాక్సఫీస్ దగ్గర రఫ్పాడించాయి. అందరివాడు, ముగ్గురు మొనగాళ్ళు లాంటి సినిమాలు నిరాశపరిచి ఉండొచ్చు కానీ.. అందులో చిరంజీవి వింటేజ్ మాస్ యాక్షన్ మాత్రం అదిరిపోతుంది. అందరివాడు సినిమాలో గోవిందరాజులు క్యారెక్టర్ ఇప్పటికీ చూసి నవ్వుకుంటూ ఉంటారు ఫ్యాన్స్. ఇప్పుడు అనిల్ రావిపూడి కూడా చిరంజీవితో ఇలాంటి డబుల్ డోస్ ప్లాన్ చేస్తున్నాడు. అందుకే ఆ మధ్య ఒక ఈవెంట్ కు వచ్చినప్పుడు కూడా అనిల్ తనకు కథ చెప్పినప్పుడు రౌడీ అల్లుడు, దొంగ మొగుడు లాంటి సినిమాలు గుర్తుకు వచ్చాయని చెప్పాడు చిరంజీవి. ఈ లెక్కన అనిల్ సినిమాలో కూడా చిరంజీవి డ్యూయల్ రోల్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఇందులో ఒకటి కంప్లీట్ మాస్ అయితే.. ఇంకొకటి పూర్తిస్థాయి కామెడీ. 2026 సంక్రాంతికి సినిమా విడుదల కానుంది.