వాళ్లకి నిజంగానే ఎన్టీఆర్ దేవుడు… వాడుకుంటే ఆడుకుంటాడు.

దేవర మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసినా జనంలో పూనకాలను తెప్పిస్తూ, వచ్చేశాడు ఎన్టీఆర్. ప్రివ్యూ పేలింది. మొదటి రోజు వసూళ్ల జాతర మొదలైంది. విలన్ గా నటించిన సైఫ్ ఆలీఖాన్ మాట నిజమౌతోంది. ఫ్యాన్స్ కి నిజంగా ఎన్టీఆర్ దైవంతో సమానం అంటూ షాక్ ఇచ్చాడు సైఫ్ ఆలీ ఖాన్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 28, 2024 | 10:57 AMLast Updated on: Sep 28, 2024 | 10:57 AM

What Is Devara Original Talk

దేవర మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసినా జనంలో పూనకాలను తెప్పిస్తూ, వచ్చేశాడు ఎన్టీఆర్. ప్రివ్యూ పేలింది. మొదటి రోజు వసూళ్ల జాతర మొదలైంది. విలన్ గా నటించిన సైఫ్ ఆలీఖాన్ మాట నిజమౌతోంది. ఫ్యాన్స్ కి నిజంగా ఎన్టీఆర్ దైవంతో సమానం అంటూ షాక్ ఇచ్చాడు సైఫ్ ఆలీ ఖాన్. ఆ మాటే తూటాలా దూసుకెళుతోంది. వెండితెర వెయ్యిరెట్లు వెలిగిపోతోంది. కొరటాల శివ కథ బాగా చెప్పాడా? మేకింగ్ బాగుందా? రాజమౌళి క్రియేట్ చేసిన బలమైన సెంటిమెంట్ ని ఎన్టీఆర్ బ్రేక్ చేశాడా? ఈ డౌట్లన్నీంటికి దేవరనే సమాధానంగా మారాడు. ఆల్రెడీ ప్రివ్యూలుచూశాకే రివ్యూలు వచ్చాయి. కొన్ని హిట్టన్నాయి. ఇంకొన్ని విజువల్స్ అదుర్స్, ఎమోషన్ మీద మిక్స్ డ్ రియాక్షన్స్ ఇచ్చాయి… కాని ప్రివ్యూతో వినిపించే రివ్యూ లో రిజల్ట్ తేలదు… మొదటి రోజు వచ్చే టాక్ తోనే కాసులు కిక్ ఉంటుందా లేదా తెలుస్తుంది.. ఇంతకి దేవరి వసూళ్ల వరాలు కన్ఫామ్ అయ్యాయా? ఓవరాల్ గా దేవర రిజల్ట్ మీద ఫైనల్ టాకేంటి?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని సరిగ్గా వాడుకుంటే, బాక్సాఫీస్ తో ఆడుకుంటాడనంటారు… అలాంటి సినిమాలే అరుదగా వస్తాయి. అందులో టెంపర్ తర్వాత అంతకుమించే టెంపర్ మెంట్ తో వచ్చింది దేవర. దేవర టైటిల్ లోనే ఇద్దరు ఎన్టీఆర్ పాత్రల పేర్లు పెట్టేశాడు డైరెక్టర్ కొరటాల శివ. నిజానికి ఈ సినిమాలో విలన్ గా నటించిన సైఫ్ అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సౌత్ లో మరీ ముఖ్యంగా టాలీవుడ్ లో ఫ్యాన్స్ హీరోలని ఎలా చూస్తారో సైఫ్ వివరించాడు. హీరోని దేవుడిలా చూసే అభిమానులు, హీరోయిజాన్ని గొప్పగా చూపించే దర్శకులు, ఇది సోషల్ మీడియాలో వైరల్ అయిన సైఫ్ ఆలీ ఖాన్ మాటలు

అన్నట్టుగానే దేవరకి ఆరేంజ్ రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్ కి ముందు దేవరని ముంబైలోని ఫ్యాన్సే కాదు,యూఎస్ లో అది షార్క్ ల మధ్య కటౌట్లు పెట్టి అభిమానులు చేసిన రచ్చ తో అదే తేలింది. ఇంత చేస్తే మరి దేవర దుమ్ముదులిపాడా? టైటిల్ లానే దేవర బాక్సాఫీస్ కి దేవుడయ్యాడా?

రటాల శివ సినిమా అంటే సోషల్ మెసేజ్ ని కమర్శియల్ గా సూటిగా సుత్తిలేకుండా చెబుతాడనే పేరుంది. ఒక్క ఆచార్య మాత్రం మిస్ ఫైర్ అయ్యింది కాని, లేదంటే తను కూడా రాజమౌళిలా ఫెల్యూర్స్ అంటే ఏంటో తెలియని దర్శకుడు మరి ఆ దర్శకుడి విజన్ గొప్పగా ఉందా అంటే… దేవర కథలోకి వెళితేనే తెలుస్తుంది

దేవర కథ విషయానికొస్తే, ఏపీ తమిళ నాడు బోర్డర్ లో ఎర్ర సముద్రం దగ్గర నాలుగు ఊళ్లు… ఒక్కో ఊరికి ఒక్కో నాయకుడు.. అలాంటి ఓ ఊరి నాయకుడే దేవర. ఆనాలుగు ఊళ్లు కలిసి బ్రిటీష్ మనదగ్గరనుంచి దోచుకున్న సొమ్ముని తిరిగి తోచుకునే పనిచేస్తుంటారు.. కాల క్రమేనా బ్రిటీషర్స్ జమానా పోయాక, సీన్ మారిపోతుంది. పనిలేక ఖాలీగా ఉన్న ఆ నాలుగూళ్ల జనం, సముద్రదొంగలుగా మారిపోతారు. కాని ఆ దొంగతనాలతో వాళ్లు తీసుకొచ్చే ఆయుధాలు ఎందరి జీవితాలను నాశనం చేస్తున్నాయో తెలిసి, దేవర ఆ రక్తపు కూడొద్దంటాడు. చేపలు పట్టి బతుకుదామంటాడు. అది మరో ఊరినాయకుడైన బైరాకు నచ్చదు…

దీంతో వాళ్లని దేవర కంట్రోల్ చేస్తుంటాడు. ఓ స్టేజ్ లో దేవరని చంపేయాలనుకున్న బైరా టీం నే కాదు, ఇంకెవరినీ సముద్రపు దొంగతనాలకు పోకుండా, సముద్రలో తుఫానులా ఎర్ర సముద్రానికి కావలి కాస్తాడు దేవర… మరి ఆ దేవరని బైరీ ఎలా ఎదుర్కొన్నాడు.. దేవర ఎలాంటి త్యాగంతో ఎర్ర సముద్రాన్ని కాపాడాడు..? తన తర్వాత వరగా మరో పాత్రలో వచ్చినఎన్టీఆర్ ఈ కథకి కంచికి ఎలా చేర్చాడు.. అన్నదే కథ..

దేవరగా పాత్రలో పాతుకుపోయాడు ఎన్టీఆర్. అరవింద సమేత వీరరాఘవలో చావుకి గొంతుంటే ఇలానే మాట్లాడుతుందా అనే రేంజ్ లో హై బేస్ వాయిస్తో దేవరగా దూసుకెళ్లాడు ఎన్టీఆర్. వర పాత్రలో కూడా పర్లేదనిపించాడు. ఇక జాన్వీ కపూర్ తెలుగు తెరమీద అందాల ఆరబోతకే పరిమితమైంది. బైరా గా సైఫ్ ఆలీఖాన్ పాత్రలో పాతుకుపోతే, మిగతా నటులు కేవలం సింగిల్ సీన్ కే పరిమితమయ్యారు

అనిరుధ్ మ్యూజిక్ నిజంగా మ్యాజిక్ చేస్తోంది. పాతలు తూటాల్లా పేలితే, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. ఫస్ట్ హాఫ్ కథంతా గంబీరంగా కేజీయఫ్ స్టైల్లో సాగితే, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ బాహుబలి క్లైమాక్స్ లాగా మతిపోగొడుతోంది. కాకపోతే వరగా ఎన్టీఆర్ పాత్ర డిజైన్ చేసిన విధానం మీదే కొంత మిక్స్ డ్ టాక్ వస్తోంది. ఇక థియేటర్స్ లో రాజమౌళి స్పెషల్ గా వచ్చి సందడి చేయటం, అభిమానుల స్పందన చూసి, తనకు తానే అభిమానిగా మారి ఎన్టీఆర్ సంబర పడుతూ ట్వీట్ చేయటం సోసల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓవరాల్ గా దేవర పాన్ ఇండియా లెవల్లో ఒకటీ అర చిన్న చిన్న లోపాలతో, వసూళ్ల విషయంలో మాత్రం దూసుకెళ్లే దేవరగా మారాడు. హిట్ టాక్ తో కిక్ ఇస్తున్నాడు.