నందమూరి కుటుంబంలో ఏం జరుగుతోంది…? హరి ఎవరు, ఎన్టీఆర్‌కు ఎందుకంత అభిమానం…?

దేవర సినిమాతో ఎన్టీఆర్ రేంజ్ ఎంత పెరిగిందో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ రేంజ్ కూడా అంతే పెరిగింది. ఎన్టీఆర్ చేయబోయే సినిమాలు అన్నీ పక్కాగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైనే ఉండే అవకాశం ఉందనే టాక్ వస్తోంది. దేవర సినిమాతో ఎన్టీఆర్ ఆర్ట్స్ ఇప్పుడు నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ అయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 7, 2024 | 10:36 AMLast Updated on: Oct 07, 2024 | 10:36 AM

What Is Going On In The Nandamuri Family Who Is Hari And Why Is Ntr So Fond

దేవర సినిమాతో ఎన్టీఆర్ రేంజ్ ఎంత పెరిగిందో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ రేంజ్ కూడా అంతే పెరిగింది. ఎన్టీఆర్ చేయబోయే సినిమాలు అన్నీ పక్కాగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైనే ఉండే అవకాశం ఉందనే టాక్ వస్తోంది. దేవర సినిమాతో ఎన్టీఆర్ ఆర్ట్స్ ఇప్పుడు నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ అయింది. అయితే తాజాగా ఎన్టీఆర్ దేవర విజయోత్సవ వేడుకల్లో చేసిన కామెంట్స్ తో అసలు ఎన్టీఆర్ ఆర్ట్స్ లో ఏం జరుగుతుంది ఏంటీ అనేది హాట్ టాపిక్ అయింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ కి హరి మూల స్థంభం అని… ఎవరు ఏమనుకున్నా హరిదే కీలక పాత్ర అంటూ ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చాడు.

ఎన్టీఆర్ చెప్పిన విధానం గాని మాట్లాడిన మాటలు గాని చాలా ఘాటుగా ఉన్నాయి. దీనితో అసలు ఈ హరి ఎవరు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా జనాలు వెతుకుతున్నారు. ముందు హరి అంటే హరికృష్ణ అనుకున్నారు కొందరు. తన తండ్రి పేరు అలా ఎందుకు చెప్తాడు అని మరికొందరు అన్నారు. అయితే అతను… నందమూరి కళ్యాణ్ రామ్ భార్య స్వాతికి తమ్ముడు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా వ్యవహారాలు అన్నీ హరి చూస్తున్నాడట. ముందు మహేష్ కోనేరు చూసేవాడు.

అయితే మహేష్ మరణం తర్వాత ఎన్టీఆర్ వ్యవహారాలను మొత్తం హరి చూడటం అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ బాధ్యతలు కూడా హరీ చూస్తూ కళ్యాణ్ రామ్ పై భారం తగ్గించడం చేస్తున్నాడట. ఎన్టీఆర్ కథల ఎంపిక విషయంలో కూడా హరి సలహాలు ఇస్తున్నాడట. దేవర సినిమా సక్సెస్ లో కూడా హరి పాత్ర కీలకం అని టాక్. ఇక హరికి సినిమా పరిశ్రమలో చాలా మంచి పేరు ఉందట. ఎవరితో వివాదాలకు వెళ్ళే వ్యక్తి కాదని టాక్. అందుకే ఎన్టీఆర్ కూడా హరీ విషయంలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే ఎన్టీఆర్ ఆర్ట్స్ విషయంలో నందమూరి కుటుంబంలో ఏమైనా విభేదాలు ఉన్నాయా అనే దానిపై ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతోంది సోషల్ మీడియాలో.

ఎన్టీఆర్ ఆర్ట్స్ విషయంలో మిగతా కుటుంబ సభ్యులు ఎవరూ ఇప్పటి వరకు జోక్యం చేసుకోలేదు. మరి ఎన్టీఆర్ ఆ క్లారిటీ ఇవ్వడానికి కారణం ఏంటీ…? తన మామ నార్నే శ్రీనివాసరావు గురించి అని కొందరు అంటున్నారు. ఇక మరికొందరు ఏమో వేరే బంధువులు ఎన్టీఆర్ ఆర్ట్స్ విషయంలో పట్టు కోసం ప్రయత్నం చేస్తున్నారని వాళ్లకు ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చాడని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా ఇప్పుడు ఎన్టీఆర్ ఆర్ట్స్ విషయంలో ఎన్టీఆర్ ఇచ్చిన క్లారిటీ తర్వాత బ్రాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది అంటున్నారు సినిమా పండితులు. ఇక హరి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాడు.