శోభిత సూసైడ్ లెటర్ లో ఏముంది…? సూసైడ్ చేసుకోమని చెప్పింది ఎవరు…?
కన్నడ నటి శోభిత ఆత్మహత్య వ్యవహారం సంచలనం అవుతోంది. హైదరాబాద్ లో ఆమె ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. మూడు రోజుల కు ముందు గోవాకు శోభిత తన భర్త సుధీర్ తో కలిసి వెళ్ళింది.

కన్నడ నటి శోభిత ఆత్మహత్య వ్యవహారం సంచలనం అవుతోంది. హైదరాబాద్ లో ఆమె ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. మూడు రోజుల కు ముందు గోవాకు శోభిత తన భర్త సుధీర్ తో కలిసి వెళ్ళింది. గోవా లో జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్ లో పాల్గొన్న ఇరువురు… అప్పుడు సంతోషంగానే కనిపించార్. శోభిత తల్లిదండ్రులు సుధీర్ మీద ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయలేదని తెలుస్తోంది.
శోభిత లాస్ట్ కాల్ వాళ్ళ అక్కతో మాట్లాడింది… ఇక్కడ అంతా బాగుంది అని… రెండు వారాలలో ఊరు కి వచ్చి కలుస్తాం అని వాళ్ళకి చెప్పిందని పోలీసులు చెప్తున్నారు. కర్ణాటక కు చెందిన సఖిలేష్ పురం శోభిత సొంత ఊరు అని పోలీసులు పేర్కొన్నారు. సుధీర్ సాఫ్ట్ వేర్, శోభిత ఇండస్ట్రీ లో పని చేస్తోంది. శోభిత తల్లిదండ్రులు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదని సమాచారం. పక్కన ఇంటి వాళ్ళని కూడా శోభిత తల్లిదండ్రులు మాట్లాడారు అని… వాళ్ళు ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు అని చెప్పారని పోలీసులు పేర్కొన్నారు.
నటి శోభిత ఆత్మహత్యకేసులో సూసైడ్ నోటును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ చేసుకోవాలంటే యు కెన్ డూ ఇట్ అంటూ లేఖ రాసారు. ఎవరిని ఉద్దేశించి శోభిత సూసైడ్ నోట్ లేఖ రాసిందన్న కోణంలో దర్యాప్టు వేగవంతం చేసారు. శోభిత మృతికి డిప్రెషన్ కారణమా అనే కోణంలో విచారణ ముమ్మరం చేసారు. సీరియల్స్, మూవీస్ కి దూరంగా ఉండటమా..? అనే కోణంలో విచారిస్తున్నారు.