అసలు నయనతార, ధనుష్ గొడవేంటి…? సెట్స్ లోనే గొడవ పడ్డారా…?
ఎప్పుడూ ఏదోక వివాదంతో వార్తల్లో ఉండే తమిళ సినిమా పరిశ్రమలో మరో వివాదం బయటకు వచ్చింది. స్టార్ హీరోయిన్ నయనతార, స్టార్ హీరో ధనుష్ మధ్య పదేళ్ళ క్రితం చెలరేగిన ఓ వివాదం చినికి చినికి ఇప్పుడు గాలి వానగా మారింది.
ఎప్పుడూ ఏదోక వివాదంతో వార్తల్లో ఉండే తమిళ సినిమా పరిశ్రమలో మరో వివాదం బయటకు వచ్చింది. స్టార్ హీరోయిన్ నయనతార, స్టార్ హీరో ధనుష్ మధ్య పదేళ్ళ క్రితం చెలరేగిన ఓ వివాదం చినికి చినికి ఇప్పుడు గాలి వానగా మారింది. నయనతార జీవితం ఆధారంగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్… ఓ డాక్యుమెంటరి నిర్మించింది. దీనికి సంబంధించి ఓ ట్రైలర్ ను రిలీజ్ చేయగా… అందులో ధనుష్ నిర్మాతగా… విజయ్ సేతుపతి, నయనతార హీరో హీరోయిన్లుగా విజ్ఞేశ్ శివన్ డైరెక్షన్ లో వచ్చిన సినిమాలో ఓ క్లిప్ ను వినియోగించారు.
నానుం రౌడీ దాన్ అనే సినిమాలోని ఓ మూడు సెకన్ల క్లిప్ ను డాక్యుమెంటరిలో వినియోగించాగా అది ట్రైలర్ ద్వారా బయటకు వచ్చింది. వెంటనే ధనుష్… ఆ మూడు సెకన్ల క్లిప్ కు నష్టపరిహారంగా ఏకంగా 10 కోట్లు డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసులు పంపారు. ఆ లీగల్ నోటీసులపై నయనతార ఘాటుగా రియాక్ట్ అయింది. అనుమతి కోసం రెండేళ్ళ నుంచి తిప్పించుకుంటున్నారు అని… ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే క్లిప్ వాడినందుకు పది కోట్లు డిమాండ్ చేయడం షాకింగ్ గా ఉందని నయనతార పేర్కొంది.
దేవుడు అన్నీ చూస్తాడన్న నయనతార… సినిమా బ్లాక్ బస్టర్ కావడం అసలు మీకు ఇష్టం లేదని… మీరు ఈవెంట్స్ లో వేదికలపై చేసేది అంతా నటన అంటూ మండిపడింది. సినిమా రిలీజ్ అయి పదేళ్ళు అయినా ఇంత అక్కసు మనసులో పెట్టుకుని ఎలా బ్రతుకుతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది నయనతార. మీరు పంపిన లీగల్ నోటీసులకు తాను కూడా అలాగే స్పందిస్తా అని కౌంటర్ ఇచ్చింది. వ్యాపార, ఆర్ధిక ఇబ్బందులు ఉంటే మీరు అభ్యంతరం వ్యక్తం చేసినా మేము అర్ధం చేసుకునే వాళ్ళమని పేర్కొంది.
నయనతార లేఖతో అసలు ఈ ఇద్దరి మధ్య వివాదం ఏంటీ అనేది ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది. అసలు వివాదం ఏంటీ అనేది ఒకసారి చూస్తే… ధనుష్, నయనతార కాంబినేషన్ లో ‘యారది నీ మోహిని’ అనే సినిమా వచ్చింది. ఆ తర్వాత ధనుష్ నిర్మాణంలో ‘నానుం రౌడీ ధాన్’లో నయనతార హీరోయిన్ గా నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో సెట్స్ కు వచ్చిన ధనుష్… నయనతార నటన నచ్చకపోవడంతో యాక్టింగ్ మార్చాలని, బెటర్ గా చేయాలి అంటూ ఓ సలహా ఇచ్చాడు. కాని నయనతార నటించిన చెవిటి పాత్రకు చాలా మంచి మార్కులు పడ్డాయి. ఆమెకు 2016 లో ఫిలిం ఫేర్ అవార్డ్ కూడా వచ్చింది. ఇక ఆ సినిమా హిట్ కావడం కూడా ధనుష్ కు ఇష్టం లేదని ఆమె లేఖలో ప్రస్తావించింది. ఫిలిం ఫేర్ అవార్డుల ప్రధానోత్సవంలో ఈ విషయం సామాన్యులకు కూడా అర్ధమవుతుందని లేఖలో పేర్కొంది.