ఎన్టీఆర్ రెమ్యునరేషన్ 370 కోట్లలో… చరణ్ కి దక్కేది 65 కోట్లేనా..?
కోలీవుడ్ లివింగ్ లెజెండ్ శంకర్ మేకింగ్ లో రామ్ చరణ్ చేసిన మూవీ గేమ్ ఛేంజర్. ట్రైలర్ ఆల్రెడీ వచ్చింది. యూట్యూబ్ ని కుదిపేస్తోంది. టీజర్ ని రివర్స్ లో టాక్ షాక్ ఇస్తోంది. టీజర్ పేలలేదు. పాటలు అస్సలు తూటాలే కాదనే కామెంట్లు ఆగలేదు.
కోలీవుడ్ లివింగ్ లెజెండ్ శంకర్ మేకింగ్ లో రామ్ చరణ్ చేసిన మూవీ గేమ్ ఛేంజర్. ట్రైలర్ ఆల్రెడీ వచ్చింది. యూట్యూబ్ ని కుదిపేస్తోంది. టీజర్ ని రివర్స్ లో టాక్ షాక్ ఇస్తోంది. టీజర్ పేలలేదు. పాటలు అస్సలు తూటాలే కాదనే కామెంట్లు ఆగలేదు. కట్ చేస్తే ట్రైలర్ కి టాక్ కిక్ ఇస్తోంది. రాజమౌళి చేతుల మహత్యమో, లేదంటే ఎన్టీఆర్, మహేశ్ బాబు ప్రస్తావనో మొత్తనికి కారనాలు ఏవైనా, సడన్ గా గేమ్ ఛేంజర్ మీద హైప్ పెరిగింది. సింగిల్ ట్రైలర్ తో అలా కలిసొస్తోంది
ఇదంతా ఓకే, కాని రామ్ చరణ్ రెమ్యునరేషన్ పరిస్థితేంటి? అదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. త్రిబుల్ ఆర్ కి 80 లక్షలు తీసుకున్న చరణ్, బుచ్చి బాబు మూవీ పెద్దికి 150 కోట్ల నుంచి 200 కోట్లు తీసుకుంటున్నాడు. అలాంటి తను గేమ్ ఛేంజర్ కి 65 కోట్లే తీసుకున్నాడు. డైరెక్టర్ శంకర్ ఈజీగా తన ప్రతీ మూవకి వందకోట్ల నుంచి 150 కోట్లు తీసుకుంటాడు.
అలాంటి తాను 35 కోట్లు మాత్రమే తీసుకున్నాడు. అంతటికీ కారనం ఈ సినిమా బడ్జెట్ 250 కోట్లనుకుంటే 450 కోట్లకి చేరటం. షూటింగ్ డిలే అవటం, గ్రాఫిక్స్ వర్క్ కి ఎక్కువ ఖర్చవటంతో, 200 కోట్లు అదనంగా ఖర్చు పెట్టాల్సి వచ్చిందట.
అందుకే నిర్మాతను కాపాడేందుకు 65 కోట్లు తీసుకున్నాడట చరణ్. నిజానికి ఎన్టీఆర్ 370 కోట్ల రెమ్యునరేషన్ లో 65 కోట్లు ఐదో వంతుకూడా కాదు. బన్నీ, ప్రభాస్ రెమ్యునరేషన్ లో కూడా ఇది ఐదో వంతు కాదు.. అంతా వందా, రెండువంల కోట్లు, మూడొందలకోట్లు తీసుకుంటుంటే, చరణ్ 65 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది.
అయితే తెలంగాణ రైట్స్ తోపాటు, కర్ణాటక రైట్స్ ని రామ్ చరణ్ కి రాసిచ్చాడట దిల్ రాజు. సో వాటి రూపంలో తనకి అదనంగా మరో 200 కోట్లు దక్కే ఛాన్స్ ఉంది. శంకర్ కి తమిళ నాడు రైట్స్ తో ఈజీగా 75 కోట్లు కలిసొచ్చే అవకాశం ఉంది. ఐతే ఇదంతా గేమ్ ఛేంజర్, దేవర రేంజ్ లో హిట్ అయితేనే… కల్కీ రేంజ్ లో వసూళ్ల వరద తీసుకొస్తేనే… అలా జరక్క పోతే, దిల్ రాజు సేఫ్ అవ్వాలని, ఇలా హీరో దర్శకుడు తక్కువ పారితోషికంతో సరిపెట్టుకున్నారని తెలుస్తోంది. అంటే గేమ్ ఛేంజర్ మీద వాళ్లకి నమ్మకం లేదా అంటే, కాన్పిడెన్స్ ఉంటే ఉండొచ్చు కాని, హిట్టైతే అందరికీ లాభం, అలా కాకపోతే, కూడా నిర్మాత సేవ్ అయ్యేలా ప్లానింగ్ ఉండాలి కాబట్టే ఇలా చేశారట.