ఏంటి.. సూర్య చేసేది పవన్ కళ్యాణ్ సినిమా రీమేకా..? పదేళ్ల తర్వాత ఇప్పుడెందుకు..?

ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు సూర్య. మనసుకు నచ్చిన కథ వస్తే ఓకే చెప్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం కమెడియన్ కమ్ డైరెక్టర్ ఆర్ జె బాలాజీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు సూర్య.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 8, 2025 | 02:50 PMLast Updated on: Mar 08, 2025 | 2:50 PM

What Is Surya Doing A Remake Of Pawan Kalyans Movie Why Now After Ten Years

ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు సూర్య. మనసుకు నచ్చిన కథ వస్తే ఓకే చెప్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం కమెడియన్ కమ్ డైరెక్టర్ ఆర్ జె బాలాజీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు సూర్య. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో సూర్య 45 వస్తుంది. చాలా తక్కువ బడ్జెట్ లో ఈ సినిమా చేస్తున్నాడు సూర్య. దీనికోసం రెమ్యూనరేషన్ కూడా తీసుకోవడం లేదు. రిలీజ్ అయిన తర్వాత బిజినెస్ లో వాటా షేర్ చేసుకోవాలి అనేది సూర్య ఆలోచన. అయితే ఈ సినిమా కథ మీద తాజాగా సోషల్ మీడియాలో ఆసక్తికరమైన ప్రచారం జరుగుతుంది. సూర్య ప్రస్తుతం చూస్తున్న సినిమాకు పవన్ కళ్యాణ్ పదేళ్ల కింద చేసిన గోపాల గోపాల సినిమాతో పోలికలు ఉన్నాయంటూ తెలుస్తుంది.

అప్పట్లో పవన్, వెంకటేష్ హీరోలుగా నటించిన గోపాల గోపాల హిందీ సినిమా ఓ మై గాడ్ కు రీమేక్. అయితే తెలుగులో పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి ఆయన ఇమేజ్ కు తగ్గట్టు కొన్ని సీన్స్ మార్చి రాశారు.. 2017 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా పర్లేదు అనిపించింది. ప్రస్తుతం సూర్య 45 స్టోరీ బ్యాక్ డ్రాప్ కూడా ఆ సినిమాను పోలి ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో సూర్య డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ఒకటేమో దేవుడు.. రెండోది లాయర్..! కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఆ దేవుడు భూమి మీదకు రావాల్సి వస్తుంది.. అనుకోని సమస్యలో చిక్కుకున్న దేవుడి తరఫున వాదించే బాధ్యత ఓ న్యాయవాదిపై పడుతుంది. మీరు కూడా సూర్యనే. అప్పుడు దేవుడు, లాయర్ మధ్య ఉండే ఎమోషనల్ డ్రామా ఈ సినిమా కథ అని తెలుస్తుంది. ఈ పాయింట్ వింటుంటే గోపాల గోపాల గుర్తుకు రాక మానదు.

కాకపోతే నేపథ్యం అలాగే ఉన్నా స్క్రీన్ ప్లే కంప్లీట్ గా వేరేలా డిజైన్ చేస్తున్నాడు బాలాజీ. నిజానికి ఇదే కథను నయనతారతో అనుకున్నాడు ఈ దర్శకుడు. నాలుగేళ్ల కింద కరోనా సమయంలో నయనతారతో అమ్మోరు తల్లి అనే సినిమా తీశాడు ఆర్జే బాలాజీ. దానికి సీక్వెల్ తాజాగా చెన్నైలో సుందర్ సి దర్శకత్వంలో మొదలైంది. 20 ఏళ్ల తర్వాత ఈ సినిమా ఓపెనింగ్ కే వచ్చింది నయనతార. ఇప్పుడు సూర్యతో చేస్తున్న సినిమా కథ ఫిమేల్ వర్షన్ నయనతారతో చేయాలనుకున్నాడు బాలాజీ. కొన్ని క్రియేటివ్ డిఫరెన్స్ ల కారణంగా ఫిమేల్ వర్షన్ కాస్తా మేల్ వెర్షన్ అయిపోయింది. ఈ రెండిట్లో ఏది ముందు విడుదలయితే దానికి లాభం.. రెండూ ఒకేసారి వస్తే మాత్రం కథ విషయంలో కచ్చితంగా సారూప్యత తప్పకపోవచ్చు. మొత్తానికి చూడాలిక.. కనీసం ఈ సినిమాతో అయినా సూర్య కష్టాలు తీరిపోతాయో లేదో..!