Rajini kanth : రజనీకాంత్ బయోపిక్ కి దివ్య భారతి మరణానికి సంబంధం ఏంటి…
సూపర్ స్టార్ రజనీ కాంత్. ఈ పేరు చెప్తే ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ఆనందంతో పులకరించిపోతుంది. ఒకటి కాదు రెండు కాదు సుమారు నాలుగున్నర దశాబ్దాలుగా ఇదే తంతు.

What is the connection between Rajinikanth's biopic and Divya Bharti's death?
సూపర్ స్టార్ రజనీ కాంత్. ఈ పేరు చెప్తే ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ఆనందంతో పులకరించిపోతుంది. ఒకటి కాదు రెండు కాదు సుమారు నాలుగున్నర దశాబ్దాలుగా ఇదే తంతు. ఇప్పటి వరకు 169 చిత్రాల్లో నటించిన రజనీ కి ఇండియా వైడ్ గా కోట్లల్లో అభిమానులు ఉన్నారు. బహుశా ఏజ్ లిమిట్ లేని ఫ్యాన్స్ ఉన్న హీరో రజనీ మాత్రమే అని చెప్పవచ్చు. తాజాగా ఆయనకి సంబంధించిన న్యూస్ ఒకటి హాట్ టాపిక్ గా మారింది
రజనీ కాంత్ బయోపిక్ ని తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియావాలా ఆ బాధ్యతని తీసుకోబోతున్నాడు. ఈ మేరకు రజనీ తో సంప్రదింపులు కూడా జరిపారు. రజనీ కూడా ఆ విషయంలో సానుకూలంగానే స్పందించాడని తెలుస్తుంది.ఇక చాలా మందికి తెలియని విషయం ఏంటంటే రజనీ కి సాజిద్ చాలా పెద్ద అభిమాని. రజనీ వ్యక్తిత్వాన్ని కూడా చాలా ఇష్టపడతాడు. బస్ కండక్టర్ స్థాయి నుంచి సూపర్ స్టార్ స్థాయి వరకు రజనీ ఎదుర్కున్న ఎన్నో సవాళ్లు బయోపిక్ లో ఉండబోతున్నాయి. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ కూడా ప్రారంభం అయిందనే వార్తలు వినపడుతున్నాయి
ఇక రజనీ సినిమాల గురించి అందరకి తెలిసిందే.ప్రస్తుతం వేట్టియన్ అనే మూవీ చేస్తున్నాడు.లేటెస్ట్ గా కూలీ మూవీ కి కూడా కమిట్ అయ్యాడు. ఇటీవలే ఫస్ట్ లుక్ వచ్చి అందర్నీ ఆకట్టుకుంది. త్వరలోనే షూటింగ్ కి వెళ్లనుంది. ఇక సాజిద్ విషయానికి వస్తే బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలని నిర్మించాడు. 1992 లో వచ్చిన జులుం కి హుకుమత్ ఆయన ఫస్ట్ మూవీ..అందలున్, జీత్, హౌస్ ఫుల్ సిరీస్, భాగీ పార్ట్ 1 , పార్ట్ 2 , కిక్ ,హీరో పంథి ఇలా మొత్తం 40 చిత్రాలకి పైనే నిర్మించాడు. ఒకప్పటి టాప్ హీరోయిన్ దివ్య భారతి మరణం విషయంలో సాజిద్ పై ఆరోపణలు వచ్చాయి. వాళ్లిదరు పెళ్లి కూడా చేసుకున్నారనే వార్తలు వచ్చాయి.