ఆంధ్రావాలాకు దేవరకు లింక్ ఏంటీ…? అసలు ఫ్యాన్స్ భయం ఏంటీ…?

దేవర సినిమాను ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో గాని ఒక్కో ప్రచారం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ సినిమాపై హైప్ భారీగా క్రియేట్ అవుతుంది. ఇదే సమయంలో నెగటివ్ ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 25, 2024 | 01:54 PMLast Updated on: Sep 25, 2024 | 1:54 PM

What Is The Link To Andhrawala What Is The Real Fear Of Fans

దేవర సినిమాను ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో గాని ఒక్కో ప్రచారం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ సినిమాపై హైప్ భారీగా క్రియేట్ అవుతుంది. ఇదే సమయంలో నెగటివ్ ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. మొదటి ట్రైలర్ ముంబైలో విడుదల చేయడం ఇక్కడి తెలుగు మీడియాకు అసలు నచ్చలేదు. దీనితో కొన్ని వర్గాల మీడియా నెగటివ్ పబ్లిసిటీ బాగానే చేసింది. ఇక ఇదే సమయంలో ఒక్కో సెంటిమెంట్ ఇప్పుడు బయటకు వస్తున్నాయి.

ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ కావడం కూడా ఫ్యాన్స్ లో భయాలను పెంచుతోంది. గతంలో ఆంధ్రావాలా సినిమా ఆడియో ఫంక్షన్ ను గుడివాడలో నిర్వహించారు. ఆ ఫంక్షన్ ను మాజీ మంత్రి కొడాలి నానీ హోస్ట్ చేసారు. ఇప్పటి వరకు తెలుగు ఏ ఆడియో ఫంక్షన్ కూడా ఆ రేంజ్ లో జరగలేదు. రైళ్ళలో బస్సుల్లో భారీగా హాజరు అయ్యారు ఆడియో ఫంక్షన్ కు. ఆ రద్దీ తట్టుకోలేక కేవలం అరగంటలోనే కార్యక్రమాన్ని ముగించారు. తీరా చూస్తే సినిమా ఫ్లాప్ అయింది. ఇప్పుడు ఆ సెంటిమెంట్ దేవరను కూడా వెంటాడే అవకాశం ఉందని ఫ్యాన్స్ భయపడుతున్నారు.

ఇక రాజమౌళి సినిమా తర్వాత ఏ హీరోకి సినిమా హిట్ రాలేదు ఇప్పటి వరకు. ఆ సెంటిమెంట్ ఒకటి దేవరను బాగా భయపెడుతోంది. ఇక శక్తి, ఆంధ్రావాలా సినిమాల్లో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా నటించాడు. ఆ రెండు సినిమాలు డిజాస్టర్ లు. దేవర సినిమాలో కూడా ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా నటించాడు. ఈ సినిమా కూడా ఫ్లాప్ అవుతుందేమో అనే భయం ఉంది. సరిగా 11 ఏళ్ళ క్రితం రామయ్య వస్తావయ్య ట్రైలర్ ను సెప్టెంబర్ 22 నే విడుదల చేసారు. దేవర ట్రైలర్ కూడా సెప్టెంబర్ 22 నే విడుదల అయింది. ఆ సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది. ఈ భయం కూడా ఫ్యాన్స్ లో ఉంది. దానికి తోడు కొరటాల శివపై మెగా ఫ్యాన్స్ పగబట్టారు. అది కూడా ఇప్పుడు భయపెడుతున్న అంశం. ఇలా ఇంత నెగటివ్ మధ్యలో దేవర విడుదల అవుతుంది. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.