నేను వస్తానంటే మీరే వద్దంటున్నారు.. సమంత కామెంట్స్ వెనక అంతరార్థం ఏంటి..?
సినిమాలు చేసినా చేయకపోయినా ఒకే రకమైన ఇమేజ్ మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం. అది చాలా తక్కువ మందికి మాత్రమే సాధ్యమవుతుంది. అందులో సమంత కూడా ఉంటుంది.

సినిమాలు చేసినా చేయకపోయినా ఒకే రకమైన ఇమేజ్ మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం. అది చాలా తక్కువ మందికి మాత్రమే సాధ్యమవుతుంది. అందులో సమంత కూడా ఉంటుంది. తెలుగులో ఈమె సినిమా చేసి దాదాపు రెండేళ్లవుతుంది. అప్పుడెప్పుడో విజయ్ దేవరకొండ ఖుషి సినిమా తర్వాత మళ్లీ తెలుగులో కనిపించలేదు సమంత. మధ్యలో మయోసైటీస్ వచ్చి అసలు సినిమాలే చేయలేదు. అప్పట్లో సమంతను చూసిన వాళ్ళకు అసలు మళ్ళీ ఈమె స్క్రీన్ మీద కనిపిస్తుందా లేదా అని అనుమానాలు కూడా వచ్చాయి. కానీ ఎప్పటికప్పుడు జీవితంలో ఫైట్ చేయడం బాగా నేర్చుకున్న సమంత.. చాలా త్వరగానే మయోసైటీస్ నుంచి బయటపడింది. ఇప్పటికి మందులు వాడుతుంది.. కానీ మెడికల్ ట్రీట్మెంట్ తో పాటు మెంటల్ గానూ తనను తాను దృఢపరుచుకునేలా ముందుకు వెళుతుంది సమంత.
ప్రస్తుతం సినిమాల కంటే ఎక్కువగా వెబ్ సిరీస్ ల మీద ఫోకస్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ లో రాజ్ డీకే పుణ్యమా అని అక్కడే వరస సిరీస్ లకు సైన్ చేస్తుంది. వాళ్ళ దర్శకత్వంలో ఈమె నటించిన ఫ్యామిలీ మెన్ సీజన్ 2 సూపర్ డూపర్ హిట్ కావడమే కాకుండా.. బాలీవుడ్లో సమంతను తిరుగులేని హీరోయిన్గా నిలబెట్టింది. ఇక గతేడాది సిటాడెల్ సిరీస్ తో వచ్చింది స్యామ్. ఈ సిరీస్ కు నెగటివ్ రెస్పాన్స్ వచ్చినా.. సమంత యాక్షన్ సీక్వెన్స్ లకు మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం రక్త్ బ్రహ్మాండ్ తో పాటు మరో రెండు వెబ్ సిరీస్ లు కమిట్ అయింది సమంత. వీటి మధ్యలో పడి అసలు సినిమాలు చేయడమే మర్చిపోయింది ఈ ముద్దుగుమ్మ.
అయితే తనకు తెలుగు ఇండస్ట్రీకి మళ్ళీ రావాలని ఉందని.. తెలుగులో ఎవరైనా అవకాశం ఇస్తే నటిస్తాను అంటుంది ఈ సీనియర్ హీరోయిన్. కానీ ఈమె మాటలను మన దర్శక నిర్మాతలు పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. ఎందుకంటే తెలుగులో సమంతకు ఇప్పుడు మునపటి ఇమేజ్ ఉందా అంటే కచ్చితంగా లేదు అనే చెప్పాలి. పైగా ఈమె రెమ్యూనరేషన్ కూడా దాదాపు 4 కోట్ల వరకు ఉంది. ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో ఆమెకు అన్ని కోట్లు ఇచ్చి సినిమా చేసే నిర్మాతలు మన దగ్గర చాలా తక్కువగానే ఉన్నారు. ఒకవేళ నిజంగా ఈ సినిమాకు కచ్చితంగా సమంతే కావాలని కోరుకుంటే తప్ప ఆమెను మళ్లీ తెలుగు సినిమాల్లో చూడడం దాదాపు అసాధ్యం. ప్రస్తుతం తమిళంలో కూడా సమంత సినిమాలేవి చేయడం లేదు. కేవలం హిందీ మీద మాత్రమే ఫోకస్ చేసింది. ఇలాంటి సమయంలో ఇండస్ట్రీకి తీసుకొచ్చే హీరో గానీ.. దర్శకుడు కానీ ఎవరైనా ఉన్నారేమో చూడాలి.