ఎన్టీఆర్ ట్వీట్ ల వెనుక ప్లాన్ ఏంటీ…?
“నందమూరి కుటుంబంలో విభేదాలు” గత పదేళ్ళ నుంచి సినీ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసిన అంశం ఇది. అసలు ఉన్నాయో లేదో తెలియదు గాని 2019 నుంచి మాత్రం జనాలకు అదే పనిగా కనపడింది అనే మాట వాస్తవం.
“నందమూరి కుటుంబంలో విభేదాలు” గత పదేళ్ళ నుంచి సినీ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసిన అంశం ఇది. అసలు ఉన్నాయో లేదో తెలియదు గాని 2019 నుంచి మాత్రం జనాలకు అదే పనిగా కనపడింది అనే మాట వాస్తవం. 2018 తెలంగాణా ఎన్నికల్లో నందమూరి సుహాసినికి ఆమె సోదరులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ప్రచారం చేయకపోవడం… ఆ తర్వాత ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడం, కొడాలి నాని ఎన్ని తిడుతున్నా ఎన్టీఆర్ నుంచి స్పందన రాకపోవడం, అలాగే చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై ఏపీ అసెంబ్లీలో విమర్శలు చేసినప్పుడు ఆశించిన స్పందన లేకపోవడం…
ఇలా ఎన్నో అంశాలు చర్చలకు దారి తీసాయి. బాలకృష్ణ కూడా కొన్ని సందర్భాల్లో వివాదం పెంచే విధంగా వ్యాఖ్యలు చేయడం కూడా తలనొప్పిగా మారింది. అయితే ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన తర్వాత సినిమా మారిపోయింది. ఎన్టీఆర్ నుంచి శుభాకాంక్షలు చెప్పే పోస్ట్ లు వచ్చాయి. ఆ పోస్ట్ లు కూడా బాగానే వైరల్ అయ్యాయి. చంద్రబాబును… మావయ్యా అంటూ తారక్ ట్వీట్ చేయడంతో అంతా సెట్ అవుతుందా అని చాలా మంది ఎదురు చూసారు. ఇక ఇప్పుడు బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ… సినిమా ఎంట్రీపై కూడా ఎన్టీఆర్ ఎక్స్ లో పోస్ట్ చేసారు.
దీనితో ఇప్పుడు ఒక విషయం పెద్ద చర్చకు వేదిక అవుతోంది. అదే దేవర సినిమా రిలీజ్. ఈ సినిమాపై ఎన్టీఆర్ చాలా పట్టుదలగా ఉన్నాడు. ఈ సినిమాను ఒక్క టీడీపీ కార్యకర్తలే కాదు జనసేన, పవన్ అభిమానులు కూడా చూడాలి. అందుకే ఎన్టీఆర్ వరద సహాయం విషయంలో గాని పోస్ట్ లు చేసే విషయంలో గాని జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు అంటున్నారు జనాలు. ఎన్టీఆర్ కు గత అయిదేళ్ళలో కొందరు అభిమానులు దూరం అయిన సంగతి తెలిసిందే. దానికి అతని వైఖరి కారణమా వాళ్ళ అభిప్రాయమా ఏంటి అనేది తెలియదు… కానీ కొందరు అభిమానులు దూరం అయ్యారు. వాళ్ళను మళ్ళీ దగ్గర చేసుకోవాలంటే ఎన్టీఆర్ కు ఇప్పుడు దూకుడు తగ్గించి కలుపుకుని పోవడమే మంచి మార్గం. అందుకే ఎన్టీఆర్ ఇప్పుడు తన వైఖరి మార్చుకున్నాడు అంటున్నారు సినీ, రాజకీయ జనాలు.