గ్లోబల్ స్టార్ టైటిల్ కు ఎసరు..? మళ్ళీ మెగా పవర్ స్టారే దిక్కు…!
పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ మొదలైన తర్వాత హీరోలకు టైటిల్ మారుతూ వస్తోంది. పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా మారిపోయాడు.
పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ మొదలైన తర్వాత హీరోలకు టైటిల్ మారుతూ వస్తోంది. పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా మారిపోయాడు. ఇక త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ కు గ్లోబల్ స్టార్ టైటిల్ రాగా ఎన్టీఆర్ కు మేన్ ఆఫ్ ది మాసేస్ అనే టైటిల్ కన్ఫర్మ్ అయింది. ప్రభాస్ కు రెబల్ స్టార్ అనే టైటిల్ కంటిన్యూ అవుతుంది. ఆ టైటిల్ తోనే ఇండియా వైడ్ గా ప్రభాస్ ఫేమస్ అవుతున్నాడు. అయితే ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విషయంలోనే అభిమానులకు కాస్త టెన్షన్ వాతావరణం కనబడుతోంది.
ప్రస్తుతం రామ్ చరణ్ కెరీర్ పరంగా ఇబ్బంది పడుతున్నట్లే కనబడుతోంది. త్రిబుల్ ఆర్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన రాంచరణ్ ఆ తర్వాత ఆచార్య సినిమాతో ఫ్లాప్ ఎదుర్కొన్నాడు. ఇక గేమ్ చేంజర్ సినిమాతో కచ్చితంగా హిట్ కొడతాడని చాలా కాన్ఫిడెంట్ గా ఫాన్స్ ఉంటే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. వాటిలో ఒక్కటి కూడా ఈ సినిమా అందుకోలేకపోయింది. వసూళ్ల పరంగా కూడా ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఖచ్చితంగా దేవర, పుష్ప పార్ట్ 2 సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తామని కాన్ఫిడెంట్ గా చెప్పారు.
కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్లాప్ టాక్ రావడంతో థియేటర్లు ఖాళీగా కనబడుతున్నాయి. వీకెండ్ లో వసూళ్లు భారీగా ఉంటాయని అంచనా వేసుకున్నారు. వేరే సినిమాల రిలీజ్ రెండు రోజులు ఉండటంతో ఈ సినిమా కలెక్షన్లు భారీగా వచ్చే అవకాశం ఉందనే ప్లాన్ లో కూడా మేకర్స్ ఉన్నారు. కానీ ఊహించిన విధంగా ఫ్లాప్ టాక్ రావడంతో షాక్ అయ్యారు. అయితే ఇక్కడ మెగా ఫాన్స్ ను ఒక విషయం ఇబ్బంది పెడుతోంది. త్రిబుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారినా ఆ సినిమా మల్టీస్టారర్ కాబట్టి క్రెడిట్ మొత్తం రామ్ చరణ్ కొట్టే ఛాన్స్ లేదు.
కచ్చితంగా గేమ్ చేంజర్ సినిమా పాన్ ఇండియా వైడ్ గా హిట్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా రాంచరణ్ కు గ్లోబల్ స్టార్ అనే టైటిల్ కన్ఫర్మ్ అయి ఉండేది. కానీ సినిమా ఫ్లాప్ కావడంతో ఇప్పుడు మెగా పవర్ స్టార్ గానే మిగిలిపోయే ఛాన్స్ ఉంది. అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 సూపర్ హిట్ కావడంతో ఐకాన్ స్టార్ అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నాడు. దేవర సినిమా సూపర్ హిట్ కావడంతో ఎన్టీఆర్ కూడా మ్యాన్ ఆఫ్ ది మాసేస్ అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నాడు. ఇప్పుడున్న యంగ్ హీరోల్లో రామ్ చరణ్ భారీ బడ్జెట్ మూవీస్ ప్లాన్ చేస్తున్నా సరే అనుకున్న విధంగా సక్సెస్ రావడం లేదు.
ఇక గేమ్ చేంజర్ సినిమా తర్వాత చేయబోయే ప్రాజెక్ట్ పై కూడా రామ్ చరణ్ గట్టిగానే ఫోకస్ పెట్టాడు. బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న ఆ సినిమా కోసం ఇప్పటికే తన లుక్ కూడా చేంజ్ చేసుకున్నాడు. మరి ఆ సినిమా హిట్ కొడుతుందా అనేది చూడాలి.