Kalki… run time : ‘కల్కి’ రన్ టైం ఎంతంటే..!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'కల్కి 2898AD'.. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 30, 2024 | 04:21 PMLast Updated on: May 30, 2024 | 4:21 PM

What Is The Run Time Of Kalki

 

 

 

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కల్కి 2898AD’.. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. హాలీవుడ్ స్టాండర్డ్స్ ని మించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ సినిమా సంబంధించి వస్తున్న అప్డేట్స్ మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే ‘కల్కి’ నుంచి పోస్టర్స్ తో పాటు గ్లింప్స్ మూవీపై అంచనాలను స్కైహైకి పెంచేశాయి. మేకర్స్ బుజ్జి ప్రోమోని రిలీజ్‌ చేశాక ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా నెట్టింట క్షణాల్లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ బయటకి వస్తుండగా.. ఈ సినిమా భారీ రన్ టైం బయటకి వచ్చింది.

ఈ మధ్య కాలంలో ఈ తరహా సినిమాలు అన్నీ దాదాపు 3 గంటలు లేదా 3 గంటలు దాటే రన్ టైం తో వస్తున్నాయి. ఈ తరహాలోనే కల్కి మూవీ కూడా భారీ రన్ టైంతో రాబోతోందట.. కల్కి మూవీ కూడా ఏకంగా 3 గంటల రన్ టైం తో రాబోతున్నట్టుగా ఇప్పుడు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే.. ఈ వార్తలో ఎంత నిజం ఉందనే దానిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

హాలీవుడ్ స్టాండర్డ్స్ తో గ్రాండ్ స్కేల్ లో రూపొందుతున్న ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తున్నారు. ప్రభాస్ సరసన దీపికా పదుకొణె, దిశా పటానీ హీరోయిన్స్ గా నటిస్తుండగా.. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ విలన్ రోల్ చేస్తున్నారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.. ఇప్పటి వరకు వరల్డ్ సినిమా చూడనంత గ్రాండ్‌గా ‘కల్కి 2898 AD’ తెరకెక్కుతుందని మేకర్స్ ఇప్పటికే రివీల్ చేశారు. కాగా సినిమాలో నటిస్తున్న ప్రధాన తారాగణంతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ‘కల్కి’ క్లైమాక్స్ ని ఎంతో గ్రాండ్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.