రాజమౌళి కాంట్రవర్సీలో నిజమెంత..? ఆ అమ్మాయిని జక్కన్న ప్రేమించాడా.. టార్చర్ మ్యాటర్ ఏంటి..?
ఎప్పుడు సినిమాలతో ట్రెండింగ్ లో ఉండే రాజమౌళి.. చాలా రోజుల తర్వాత వివాదంతో ట్రెండింగ్ లోకి వచ్చాడు. అనూహ్యంగా ఈయన పేరు చెబుతూ శ్రీనివాసరావు అనే వ్యక్తి సెన్సేషనల్ వీడియో విడుదల చేశాడు.

ఎప్పుడు సినిమాలతో ట్రెండింగ్ లో ఉండే రాజమౌళి.. చాలా రోజుల తర్వాత వివాదంతో ట్రెండింగ్ లోకి వచ్చాడు. అనూహ్యంగా ఈయన పేరు చెబుతూ శ్రీనివాసరావు అనే వ్యక్తి సెన్సేషనల్ వీడియో విడుదల చేశాడు. ఇది తన మరణ వాంగ్మూలం ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉన్నట్టుండి రాజమౌళిపై వచ్చిన ఈ కాంట్రవర్సీతో ఆయన అభిమానులు మాత్రమే కాదు టాలీవుడ్ కూడా ఉలిక్కిపడింది. అసలేంటి వివాదం.. ఎవరు ఈ శ్రీనివాసరావు.. 34 ఏళ్లు రాజమౌళితో నిజంగానే ఈయనకు స్నేహం ఉందా లేదంటే వైరల్ అవ్వడానికి ఏదైనా ఫేక్ వీడియో చేశాడా అనే కోణంలో అందరూ ఆలోచిస్తున్నారు. కాకపోతే రాజమౌళి పేరు తీశాడు కాబట్టి ముందు వెనుక ఆలోచించకుండా సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతూనే ఉంది.
ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తే శాంతినివాసం టైం నుంచి తనకు రాజమౌళితో పరిచయం ఉంది అంటున్నాడు శ్రీనివాసరావు. అప్పట్లో ఇద్దరం ఒకే అమ్మాయిని ప్రేమించామని.. తనకోసం ఆ అమ్మాయిని త్యాగం చేయాల్సిందిగా రాజమౌళి తనను కోరాడని శ్రీనివాసరావు చెప్తున్నాడు. అప్పటికే స్టూడెంట్ నెంబర్ వన్ హిట్ అవడంతో.. పేరు వచ్చింది కాబట్టి లేని కొన్ని గొడవలు ఎందుకని తాను కూడా తప్పుకున్నట్టు చెప్పాడు ఈయన. అంతేకాదు యమదొంగ సినిమాకు తాను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేశాను అంటున్నాడు. ఇలా చాలా విషయాలు రాజమౌళి గురించి చెప్పాడు శ్రీనివాసరావు. అమ్మాయి విషయంలో ఆర్య సినిమా స్థాయిలో తమ మధ్య కథ నడిచింది అంటూ చెబుతున్న శ్రీనివాసరావు కథలో అసలు ఎన్ని నిజాలు ఉన్నాయి అనే విషయంపై చర్చ మొదలైంది ఇప్పుడు.
రాజమౌళికి అత్యంత సన్నిహితులు సాయి కొర్రపాటి.. ఈ వీడియోను పూర్తిగా ఫేక్ అని కొట్టికారేసినట్టు తెలుస్తుంది. కేవలం రాత్రికి రాత్రి పబ్లిసిటీ కోసం చేసే చీప్ ట్రిక్స్ ఇవి.. రాజమౌళి ఇలాంటి వాడు అనే విషయం తమకు తెలుసు అంటున్నాడు ఈయన. మరోవైపు ఇండస్ట్రీలో కూడా ఈ వీడియోపై ఎవరు స్పందించడం లేదు. పోలీసులు కూడా ఈ వీడియో పెద్దగా సీరియస్ గా తీసుకున్నట్టు ప్రస్తుతం అయితే అనిపించడం లేదు. ప్రపంచ సినిమాను శాసిస్తున్న రాజమౌళి గురించి ఒక వీడియో చేసి విడుదల చేయాలి అంటే కచ్చితంగా చాలా ధైర్యం కావాలి. శ్రీనివాస రావు అది చేశాడు అంటే కచ్చితంగా వెనకాల ఏదో జరిగే ఉంటుందని మరొక వర్గం వాదిస్తుంది. తన విషయాలు అన్నీ ఎక్కడ బయట పెడతాను అని రాజమౌళి తనను కొన్ని సంవత్సరాలుగా టార్గెట్ చేసి టార్చర్ చేస్తున్నాడు అని చెప్తున్నాడు శ్రీనివాసరావు. మరి ఈ విషయం మీద రాజమౌళి బయటకు వచ్చి మాట్లాడతాడా లేదంటే.. అనవసరంగా స్పందించి విషయాన్ని పెద్దది చేయడం ఎందుకు అని ఊరుకుంటాడా అనేది చూడాలి.