Mahesh Babu : అయోమయంలో మహేష్‌బాబు..

గుంటూరుకారం తర్వాత మహేశ్‌ చేసే సినిమా ఏంటి... రాజమౌళి లైన్ లో ఉన్న.. మధ్యలో మరో సినిమా చేస్తానన్న వార్తలు గుప్పుమన్నాయి. మరో మూవీ చేసే ఛాన్స్‌ రాజమౌళి ఇచ్చాడా? లేదంటే డైరెక్ట్‌గా జక్కన్న ప్రాజెక్ట్‌లోకి వెళ్లిపోతాడా..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 12, 2023 | 02:02 PMLast Updated on: Oct 12, 2023 | 2:02 PM

What Movie Will Mahesh Do After Gunturukaram Rajamouli Is In The Line News That He Will Do Another Movie In The Middle

గుంటూరుకారం తర్వాత మహేశ్‌ చేసే సినిమా ఏంటి… రాజమౌళి లైన్ లో ఉన్న.. మధ్యలో మరో సినిమా చేస్తానన్న వార్తలు గుప్పుమన్నాయి. మరో మూవీ చేసే ఛాన్స్‌ రాజమౌళి ఇచ్చాడా? లేదంటే డైరెక్ట్‌గా జక్కన్న ప్రాజెక్ట్‌లోకి వెళ్లిపోతాడా.. గుంటూరు కారం తర్వాత మహేశ్‌ మరో సినిమాలకు కమిట్‌ అయ్యాడన్న వార్త పూర్తిగా గాసిప్పే. జనవరి 12న గుంటూరు కారం రిలీజ్‌ కాగానే… యాజ్‌ యూజువల్‌గా మహేశ్‌ ఫ్యామిలీతో కలిసి ఫారిన్‌ ట్రిప్‌కు వెళ్లిపోతాడు. రాజమౌళి మూవీ మొదలైతే.. ఫారిన్‌ ట్రిప్‌.. సెలబ్రేషన్స్‌ అంటే కుదరదు. మరోసారి ఇన్ని రోజులు ఎంజాయ్‌ చేస్తానా? లేదా అన్న డౌట్‌తో…ఈసారి ఎక్కువ రోజులే హాలిడే ట్రిప్‌ వేస్తాడు మహేశ్‌. ఎందుకంటే.. మార్చి నుంచి రాజమౌళి సినిమా సెట్స్‌పైకి వచ్చేయనుంది.

రాజమౌళి కొన్ని నెలలుగా మహేశ్‌ సినిమా కథపై కూర్చున్నాడు. ఒకట్రెండు రోజుల్లో నేరేషన్‌ కూడా ఇవ్వనున్నాడని తెలిసింది. అంతా ఓకె అయితే.. మార్చిలో షూటింగ్‌ స్టార్ట్ చేస్తారట. ప్రస్తుతం కథ గురించి చెప్పినా..ఈ ఆరు నెలల్లో కథను చెక్కుతూ.. పక్కా స్క్రిప్ట్‌ ప్రిపేర్‌ చేస్తాడు జక్కన్న. కథ అందించిన విజయేంద్రప్రసాద్‌ ఆమధ్య మాట్లాడుతూ.. సినిమాలో హాలీవుడ్‌ యాక్టర్స్‌ వుండే అకాశంం ఉందని.. ఆఫ్రికా బ్యాక్‌డ్రాప్‌లో సాగే అడ్వెంచర్గా మూవీ ఉంటుందని చెప్పారు. ట్రిపుల్‌ఆర్‌ రిలీజ్‌ తర్వాత మహేశ్‌ సినిమా ఎలా వుండబోతుందంటే రాజమౌళి హింట్ ఇచ్చాడు. తన గత సినిమాల కంటే భారీగా వుంటుందన్నారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ 450కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కితే.. ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్ల గ్రాస్‌ కలెక్ట్ చేసింది. మహేశ్‌ సినిమాను దాదాపు 1000 కోట్లు అవుతుందని అంచనా.. దీన్ని కవర్‌ చేయడానికి పాన్‌ ఇండియా నుంచి పాన్‌ ఇంటర్నేషనల్‌కు వెళ్తున్నాడు జక్కన్న. ఆర్‌ఆర్‌ఆర్‌లోనటించిన హాలీవుడ్‌ యాక్టర్స్‌ కంటే.. పాపులర్‌ నటీనటులను మహేశ్‌ మూవీ కోసం తీసుకుంటాడట. సినిమాను రాజమౌళి మార్కెటింగ్‌ చేసినంత బెటర్‌గా ఎవరూ చేయలేరు. మహేశ్‌తో 1000 కోట్ల సినిమా కావడంతో.. కథ రెడీ కాకుండానే.. మార్కెంటింగ్‌ స్టార్ట్‌ చేశాడు. మహేశ్‌ మూవీని 30 భాషల్లో డబ్‌ చేసి రిలీజ్‌ చేసేలా నెట్‌ఫ్లిక్స్‌తో చర్చలు జరిగాయట. ఓటీటీ ద్వారానే సగానికి పైగా బడ్జెట్‌ లాగేయాలన్నది జక్కన్న ప్లాన్‌.