ఏంటి సల్మాన్ భాయ్ ఇది.. ‘సికిందర్’ను ముందే వదిలేసావా.. ఆ పాట ఏంటి మహాప్రభో..!
సల్మాన్ ఖాన్ కెరీర్ ఆల్రెడీ సంపులో ఉంది. ఎప్పుడు మునిగిపోతుందో తెలియదు. ఒకప్పుడు బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర చెడుగుడు ఆడుకున్న సల్మాన్ భాయ్ సినిమాలు ఇప్పుడు అంతగా ఆడటం లేదు.

సల్మాన్ ఖాన్ కెరీర్ ఆల్రెడీ సంపులో ఉంది. ఎప్పుడు మునిగిపోతుందో తెలియదు. ఒకప్పుడు బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర చెడుగుడు ఆడుకున్న సల్మాన్ భాయ్ సినిమాలు ఇప్పుడు అంతగా ఆడటం లేదు. ఇంకా చెప్పాలంటే వచ్చినట్టు కూడా ప్రేక్షకులు గుర్తు పెట్టుకోవడం లేదు. రెండేళ్ల కింద వచ్చిన కిసీకా భాయ్ కిసీకా జాన్ డిజాస్టర్ గా నిలిచింది. అందులో వెంకటేష్ కూడా కీలక పాత్రలో నటించాడు. కాటమరాయుడు సినిమా హిందీలో రీమేక్ చేశారు.. కానీ అది అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ఆశలని సికిందర్ సినిమా మీదే ఉన్నాయి. సౌత్ డైరెక్టర్లు ఏం చెప్పినా ఇట్టే నమ్మేస్తున్నారు బాలీవుడ్ హీరోలు. సికిందర్ సినిమాను కూడా మురుగుదాస్ తెరకెక్కిస్తున్నాడు.
ఇక్కడ బంపర్ ఆఫర్ ఏంటంటే మురుగుదాస్ కూడా ప్లాపుల్లోనే ఉన్నాడు. అయినా కూడా ఆయనను నమ్మి సికిందర్ ఆఫర్ ఇచ్చాడు సల్మాన్. కానీ ఇప్పుడు కంటెంట్ చూస్తుంటే సినిమా మీద అంచనాలు పెరగడం కాదు ఉన్నవి కూడా తగ్గిపోతున్నాయి. మొన్న విడుదలైన టీజర్ జుజుబి అనిపించింది. అసలు సల్మాన్ ఖాన్ రేంజ్ కు ఎవరైనా ఇలాంటి సాదాసీదా టీజర్ కట్ చేస్తారా అని ఫ్యాన్స్ కూడా ఫుట్బాల్ ఆడుకున్నారు. పోనీలే తర్వాత వచ్చే కంటెంట్ అయినా జాగ్రత్తగా రిలీజ్ చేస్తారేమో అనుకుంటే.. ఇప్పుడు విడుదలైన పాట చూస్తుంటే మొన్న విడుదల టీజరే బెటర్ అనిపిస్తుంది. స్క్రీన్ మీద సల్మాన్ అంత యాక్టివ్ గా కనిపించడం లేదు. ఎందుకో తెలియదు కానీ ఈ సినిమా మీద ముందు నుంచే పెద్దగా అంచనాలు కనిపించడం లేదు. ఇప్పుడు విడుదలవుతున్న కంటెంట్ చూసిన తర్వాత సినిమా మీద నమ్మకాలు తగ్గిపోతున్నాయి.
రంజాన్ సందర్భంగా విడుదల కానుంది సికిందర్. ఒకప్పుడు ఈద్ కు సల్మాన్ సినిమా వచ్చింది అంటే బాక్సాఫీస్ బద్దలైపోయేది. కానీ కొన్ని సంవత్సరాల నుంచి రంజాన్ కూడా భాయ్ కి కలిసి రావడం లేదు. అయినా కంటెంట్ లేని సినిమాలు తీసుకొస్తే రంజాన్ సీజన్ అయినా ఏం చేస్తుంది..? సికిందర్ సినిమాకు ఉన్న ఒకే ఒక్క పాజిటివ్ పాయింట్ రష్మిక మందన్న హీరోయిన్ కావడమే. ప్రస్తుతం ఈమె గోల్డెన్ లెగ్ బాలీవుడ్ లో..! యా, ఛావా లాంటి బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. తన అదృష్టంలో కాస్త సల్మాన్ ఖాన్ కు కూడా అంటిస్తే సికిందర్ సూపర్ హిట్ అయినట్టే. లేదంటే మాత్రం భాయ్ కెరీర్ ఓకే బై అన్నట్టు ఉంటుంది. చూడాలి మరి ఏం జరగబోతుందో..!