Jai Hanuman : రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేంటి

చిన్న సినిమాగా మొదలైన హనుమాన్ (Hanuman) సినిమా.. పాన్ ఇండియా (Pan India) లెవల్లో బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 16, 2024 | 11:00 AMLast Updated on: Apr 16, 2024 | 11:00 AM

What Was Hanumans Speech To Rama

 

 

చిన్న సినిమాగా మొదలైన హనుమాన్ (Hanuman) సినిమా.. పాన్ ఇండియా (Pan India) లెవల్లో బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. దీంతో సీక్వెల్‌గా రానున్న జై హనుమాన్ కోసం ఎదురు చూస్తున్నారు సినీ అభిమానులు. తాజాగా జై హనుమాన్ (Jai Hanumanu) అప్డేట్ రానుందని సమాచారం.

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashant Varma).. యంగ్ హీరో తేజ సజ్జ (Young Hero Teja Sajja) కాంబినేషన్లో వచ్చిన హనుమాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. పాన్ ఇండియా హిట్‌గా నిలిచి 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. క్లైమాక్స్‌లో ఆడియెన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించిన ప్రశాంత్ వర్మ.. ఈసారి రెండున్నర గంటలసేపు సీట్‌లో కూర్చోకుండా చేస్తానని సీక్వెల్ అనౌన్స్ చేశాడు. రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేంటి అంటూ జై హనుమాన్ అనౌన్స్ చేశాడు. దీంతో ఈ సీక్వెల్ నెక్స్ట్ లెవెల్ హైప్ నెలకొంది. ఇప్పటికే సీక్వెల్ వర్క్ స్టార్ట్ చేసిన ప్రశాంత్ వర్మ.. త్వరలోనే జై హనుమాన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని చెప్పాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి అప్డేట్ రావాల్సి ఉంది.. కానీ మేకర్స్ స్కిప్ చేశారు. అయితే ఇప్పుడు మెగా అప్డేట్ రెడీ అయినట్టుగా తెలుస్తోంది

సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా.. ఏప్రిల్ 17కి 100 రోజులు పూర్తి చేసుకోనుంది. దీంతో 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా జై హనుమాన్ అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది. అదే రోజు శ్రీరామ నవమి కూడా కావడంతో.. జై హనుమాన్ నుంచి బిగ్ అప్డేట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడి నుంచే సినిమా పై మరింత హైప్ క్రియేట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో శ్రీరాముడిగా, హనుమాన్‌గా స్టార్ హీరోలను తీసుకోవాలని అనుకుంటున్నాడు ప్రశాంత్ నీల్. కాబట్టి.. వచ్చే ఏడాదిలో ఈ క్రేజీ సీక్వెల్ ఖచ్చితంగా పాన్ ఇండియా లెవల్లో దుమ్ముదులిపేయడం గ్యారెంటీ