మోక్షజ్ఞ విషయంలో ఏం జరుగుతుంది.. బాలయ్యకు తప్పని సన్ స్ట్రోక్..!
అందరి పొలంలోనూ మొలకలు వస్తున్నాయి నా పొలంలో తప్ప అంటూ నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో సిద్ధార్థ ఓ డైలాగ్ చెప్తాడు గుర్తుంది కదా.

అందరి పొలంలోనూ మొలకలు వస్తున్నాయి నా పొలంలో తప్ప అంటూ నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో సిద్ధార్థ ఓ డైలాగ్ చెప్తాడు గుర్తుంది కదా. ఇప్పుడు నందమూరి అభిమానులను చూస్తుంటే అదే అనిపిస్తుంది. అందరు హీరోల వారసులు వస్తున్నారు ఒక బాలకృష్ణ వారసుడు తప్ప. వాళ్ల ఎదురు చూపులకు తెర దించుతూ ఈ మధ్యే బాలయ్య వారసుడు మోక్షజ్ఞ మొదటి సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతుందంటూ స్వయంగా బాలకృష్ణ చెప్పాడు. మైథాలజికల్ కథతో ఈ సినిమా ఉండబోతుంది అని ప్రచారం కూడా జరిగింది.
కాకపోతే ఇప్పుడు ఈ సినిమా మరోసారి హోల్డ్ లో పడినట్టు తెలుస్తుంది. ఫిబ్రవరిలోనే సినిమా మొదలవుతుందని ఆ మధ్య ప్రచారం జరిగినా.. ఫిబ్రవరి అయిపోయి మార్చి కూడా మొదలయ్యేలా ఉంది. కానీ మోక్షజ్ఞ మొదటి సినిమా మాత్రం ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించడం లేదు. పైగా ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. దీన్ని తర్వాత మరో సినిమా కూడా చేయబోతున్నాడు. ప్రభాస్ కోసం స్క్రిప్ట్ రాసే పనిలో బిజీగా ఉన్నాడు ప్రశాంత్. ఇలాంటి టైంలో మోక్షజ్ఞ మొదటి సినిమా గురించి ఆయన ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. కథ విషయంలో బాలయ్య నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ప్రశాంత్ వర్మ, మోక్షజ్ఞ సినిమా ప్రస్తుతానికి ఆగిపోయిందని తెలుస్తోంది మరోవైపు.
మోక్షు రెండో సినిమా కోసం వెంకీ అట్లూరి కథ రెడీ చేస్తున్నాడు. కాకపోతే ఇది ఇప్పట్లో రాదు. దానికి కారణం వెంకీ నెక్స్ట్ సినిమా సూర్యతో ఉండబోతుంది. సితార ఎంటర్టైర్మెంట్స్ ఈ సినిమాను నిర్మించబోతుంది. సూర్య, వెంకీ ప్రాజెక్టు అయ్యేసరికి కనీసం ఏడాదిన్నర పడుతుంది. జై హనుమాన్ పూర్తవడానికి కూడా దాదాపు ఏడాదికి పైనే టైం పడుతుంది. ఈ లెక్కన 2025 లో కూడా నందమూరి వారసుడు ఆగమనం అనుమానమే. ఇంకోవైపు వారసుడి కోసం ఆదిత్య 999 మ్యాక్స్ కథ చేస్తున్నాడు బాలకృష్ణ. అని అనుకున్నట్టు జరిగితే వారసుడిని తన దర్శకత్వంలోనే పరిచయం చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. చూడలిక మోక్షు మొదటి సినిమా చేసే భాగ్యం ఎవరికి దక్కుతుందో.