Star Heroine Samantha : నా మైండ్‌లో అల్లు అర్జున్ ఉన్నాడు.. బాంబు పేల్చిన సమంత..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఏం మాట్లాడినా ఇట్టే వైరల్ అవుతుంది. ఇది ఈ అమ్మడుకు ఉండే క్రేజ్ మాత్రమే కాదు.. ఆమె చుట్టూ అల్లుకుపోయిన గాసిప్స్ కూడా ఇందుకు కారణం. విడాకుల తరువాత సినీ ఇండస్ట్రీలో నాగచైతన్య, సమంత హాట్ టాపిక్‌గా మారిపోయారు.

Whatever Tollywood Star Heroine Samantha says will go viral This is not just a selling craze
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఏం మాట్లాడినా ఇట్టే వైరల్ అవుతుంది. ఇది ఈ అమ్మడుకు ఉండే క్రేజ్ మాత్రమే కాదు.. ఆమె చుట్టూ అల్లుకుపోయిన గాసిప్స్ కూడా ఇందుకు కారణం. విడాకుల తరువాత సినీ ఇండస్ట్రీలో నాగచైతన్య, సమంత హాట్ టాపిక్‌గా మారిపోయారు. వాళ్ల జీవితాల్లో జరిగే సంఘటనలు, వాళ్లు చేసే కామెంట్లు కూడా అనేక రూమర్స్‌కు కారణమవుతాయి. ఇలా రీసెంట్‌గా అల్లు అర్జున్ గురించి సమంత చేసిన ఓ కామెంట్ ఇప్పుడు ఇంటర్నెట్‌నే షేక్ చేస్తోంది. రీసెంట్‌గా “ది మార్వెల్” సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్‌కు సమంత హారజరయ్యింది.
SS RAJAMOULI: రాజమౌళితో అల్లు అర్జున్..! మరో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న జక్కన్న..
ఈవెంట్ తరువాత మీడియాతో మాట్లాడుతూ అల్లు అర్జున్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.మీరు కనుక ఒక్కరోజు అవెంజర్ అయితే మీరు ఎవరితో కలిసి ప్రపంచాన్ని కాపాడతారు అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకి సమంత ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది. ఇంకెవరూ నా ఫ్యాన్స్‌తోనే వాళ్లు నిజమైన హీరోలు అంటూ సామ్ చెప్పింది. అయితే ఇండస్ట్రీలో ఉన్నవాళ్లలో అయితే ఎవరూ అని యాంకర్ అడగడంతో సమంత కాసేపు ఆలోచించి క్రేజీ ఆన్సర్ ఇచ్చింది. ప్రస్తుతం అల్లు అర్జున్ నా మైండ్‌లో నుంచి పోవట్లేదు.. సో అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, ప్రియాంక చోప్రా, ఆలియా భట్ వీళ్లతో కలిసి ప్రపంచాన్ని కాపాడతాను అంటూ సామ్ ఆన్సర్ ఇచ్చింది. దీంతో బన్నీ గురించి సామ్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.