ఎన్టీఆర్, ప్రభాస్ లో ఉన్నదే… బన్నీలో మిస్..?
రెబల్ స్టార్ ప్రభాస్ 5 పాన్ ఇండియా హిట్ల తర్వాత మరో నాలుగు పాన్ ఇండియా ప్రాజెక్టులు చేస్తున్నాడు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రెండు పాన్ఇండియా హిట్ల తర్వాత, మరో రెండు పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీ అయ్యాడు.

రెబల్ స్టార్ ప్రభాస్ 5 పాన్ ఇండియా హిట్ల తర్వాత మరో నాలుగు పాన్ ఇండియా ప్రాజెక్టులు చేస్తున్నాడు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రెండు పాన్ఇండియా హిట్ల తర్వాత, మరో రెండు పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీ అయ్యాడు. ఆతర్వాత మరో రెండు ప్రాజెక్టులు పట్టాలెక్కించబోతున్నాడు. విచిత్రం ఏంటంటే ప్రభాస్ ఏ కొత్త మూవీ చేసినా అదో వార్తైపోతోంది. ఎన్టీఆర్ ముంబై లో అడుగుపెడితే, అక్కడ మీడియాకు కావాల్సినంత న్యూస్ దొరికినట్టౌతోంది. కాని పుష్ప, పుష్ప2 ఇలా రెండు హిట్లు పడ్డా, బన్నీని ఎవరూ పట్టించుకోవట్లేదా.? తన బర్త్ డే దగ్గరికి వస్తోంది. ఆట్లీ మూవీ, త్రివిక్రమ్ సినిమా ఎనౌన్స్ మెంట్లని ప్రచారం పెరిగింది. అయినా పెద్దగా రెస్పాన్స్ లేదు. ఇలాంటి టైంలో పుష్ప 3 లో స్పెషల్ విలన్ వార్త వైరలైంది. సుకుమార్ పేల్చిన బాంబుతో, విజయ్ దేవరకొండ, నాని ఇద్దరిలో ఒకరు పుష్ప 3 కొత్త విలనంటున్నారు. విచిత్రం ఏంటంటే పుష్ప 3 మీద కంటే ఈ ఇద్దరిలో ఎవరు విలన్ అన్నదాని మీదే చర్చ జరుగుతోంది. ఎందుకో హిట్ తో కూడా బన్నీ వెనక్కి పోయాడనే మాటే వినిపిస్తోంది.. ఎందుకు? హావేలుక్
రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి, బాహుబలి హిట్ల తర్వాత సాహో తో యావరేజ్ సక్సెస్ సొంతం చేసుకున్నాడు. ఇది కూడా నార్త్ ఇండియాలోనే ఆడింది. కాని సౌత్ లో సాహో పెద్దగా ఆడలేదు. ఆతర్వాత రాధేశ్యామ్ ఫ్లాపైంది. అయినా ప్రభాస్ రేంజ్ తగ్గలేదు. ఆదిపురుష్ భయంకరమైన డిజాస్టర్ గా మారింది. అయిన రెబల్ స్టార్ రేంజ్ పడిపోలేదు. తనని ఎవరూ తప్పుపట్టలేదు.సలార్ టాక్ యావరేజ్ గా వచ్చినా 800 కోట్ల వసూల్ల వరదొచ్చింది. కల్కీ తో 1200 కోట్ల సినీ సునామీ కనిపించింది. ఇది ప్రభాస్ పాన్ ఇండియా జెర్నీ… ఇలానే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి జరిగింది. త్రిబుల్ ఆర్ హిట్ తో గ్లోబల్ గా గుర్తింపు, దేవర హిట్ తర్వాత వార్ 2 మీద నార్త్ మీడియా ఇస్తున్న భారీ అటెన్షన్… వీటికి తోడు డ్రాగన్ మీద పెరిగిపోతున్న అంచనాలు..
ఎలా చూసినా రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇద్దరికి పాన్ ఇండియా లెవల్లో హిట్లు పడ్డాక, కొత్త సినిమా లు షురూ చేశాక, పాన్ ఇండియా లెవల్లో అటెన్షన్ కనిపిస్తోంది. వీళ్లేం చేసినా మీడియాలో వార్తైపోతోంది. కాని విచిత్రంగా పుష్ప రాజ్ గా పాన్ ఇండియాని షేక్ చేసిన బన్నీ పరిస్థితి ఇందుకు రివర్స్ లో ఉంది. ఆట్లీ మూవీకి 175 కోట్లు తీసుకుంటున్న బన్నీ అన్న పెద్దగా రెస్పాన్స్ లేదు. లోకల్ మీడియా నుంచి నేషనల్ మీడియా వరకు పెద్దగా రియాక్షన్ లేదు. త్రివిక్రమ్ మూవీ పట్టాలెక్కితే ఏంటి, ఎక్కకపోతే ఏంటి… ఇవి బన్నీ తాలూకు వార్తలకు సోషల్ మీడియాలో దక్కుతున్న ప్రతి స్పందనలు
పుష్ప 2 1800 కోట్లు రాబట్టిందన్నా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. నార్త్ ఇండియాలో తప్ప పుష్పరాజ్ కి రెండోసారి పెద్దగా ఏం కలిసొచ్చినట్టులేదు. దీనికి తోడు ఆట్లీ మూవీ, త్రివిక్రమ్ సినిమా మీద నమ్మకం లేకే, పుష్ఫ 3 ని బ్యాకప్ ప్లాన్ గా పెట్టుకున్న బన్నీ అంటున్నారు. ఇప్పుడు పుష్ప 2 క్లైమాక్స్ లో స్పెషల్ గెస్ట్ గా వచ్చిన విలనే విజయ్ దేవరకొండ, లేదంటే నాని అంటూ ప్రచారం పెరిగింది. వాళ్లలో ఎవరు ఆ పాత్ర వేస్తారో అప్పడుు సుకుమార్ కి తెలియదు కాని, వచ్చే ఏడాది కథ రాసే సుకుమార్ కిమాత్రం తెలుసన్నాడు. అది ఇప్పుడు వైరలైంది.బన్నీ కాకుండా, తన దర్శకుడైనా సుకుమార్, లేదంటే పుష్ప 3 లో విలన్ గా రానున్న కొత్త హీరో గా విజయ్ లేదంటే, నాని ఇలా మిగతా వాళ్లంతా ఫోకస్ అవుతున్నారు. వాళ్ల పేర్లే మీడియా అటెన్షన్ లాక్కుంటోంది కాని, బన్నీ మీద ఎందుకో ఎవరి అటెన్షన్ కనిపించట్లేదు.