అఖిల్ అక్కినేని, జైనాబ్ పెళ్లి డేట్ ఎప్పుడు.. వెన్యూ ఎక్కడ..? ఎలా ప్లాన్ చేస్తున్నారు..?

అక్కినేని కుటుంబంలో ఈ మధ్య వరుస శుభకార్యాలు జరుగుతున్నాయి. మొన్న డిసెంబర్లోనే నాగ చైతన్య, శోభిత దూళిపాల పెళ్లి జరిగింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 7, 2025 | 12:30 PMLast Updated on: Mar 07, 2025 | 12:30 PM

When Is Akhil Akkineni And Zainabs Wedding Date Where Is The Venue How Are They Planning It

అక్కినేని కుటుంబంలో ఈ మధ్య వరుస శుభకార్యాలు జరుగుతున్నాయి. మొన్న డిసెంబర్లోనే నాగ చైతన్య, శోభిత దూళిపాల పెళ్లి జరిగింది. వాళ్ల పెళ్లికి 10 రోజుల ముందు నవంబర్ 26న అఖిల్ అక్కినేని నిశ్చితార్థం కూడా జరిగింది. చైతు పెళ్లి అయిపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి అఖిల్ మీదకు వెళ్ళింది. వీర పెళ్లి ఎప్పుడు.. ఎక్కడ ఉండబోతుంది.. ఎలా ప్లాన్ చేస్తున్నారు అంటూ ఆరా తీస్తున్నారు అభిమానులు. ఇదే ఎక్కువగా డెస్టినేషన్ వెడ్డింగ్స్ వైపు వెళ్తున్నారు సెలబ్రిటీస్. అఖిల్ పెళ్లి కూడా అలాగే జరగబోతుందని తెలుస్తుంది. ప్రముఖ పారిశ్రామిక వేత్త జుల్ఫీ రావ్డీ కూతురు జైనాబ్ రావ్డీతో కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నాడు అఖిల్. వీళ్ళ ప్రేమ గురించి తెలిసి అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే వయసు అఖిల్ కంటే జైనాబ్ 9 సంవత్సరాల పెద్దది. అందుకే తన ప్రేమ కథను సీక్రెట్‌గా కొనసాగించాడు అక్కినేని వారసుడు.

అఖిల్, జైనాబ్ నిశ్చితార్థ వేడుక నవంబర్ 26, 2024న కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. అప్పుడే పెళ్లి తేది కూడా ఫిక్స్ చేశారు. ఇరు కుటుంబాలు ఒక మాట అనుకొని మార్చి 24న పెళ్లికి ఏర్పాట్లు భారీగా చేస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే తమ పెళ్లి షాపింగ్ కోసం అఖిల్, జైనాబ్ దుబాయ్ వెళ్లినట్టు తెలుస్తుంది. ఈ మధ్యే ఎయిర్ పోర్టులో కూడా ఇద్దరు కలిసి కనిపించారు. రాజస్థాన్‌లోని ఓ ప్యాలెస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారు అక్కినేని కుటుంబ సభ్యులు. చాలా తక్కువ మందితో అఖిల్ పెళ్లి జరగబోతుందని తెలుస్తోంది. హైదరాబాదులో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు అఖిల్. అందులో ఒకటి ఆల్రెడీ సెట్స్ మీద ఉంది.

కిరణ్ అబ్బవరంతో వినరో భాగ్యము విష్ణుకథ సినిమా చేసిన మురళీ కిషోర్ అబ్బురుతో ఒక సినిమా చేస్తున్నాడు అఖిల్. ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తుంది. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. దీని తర్వాత యువి క్రియేషన్స్ లో అనిల్ అనే కొత్త దర్శకుడితో భారీ విజువల్ వండర్ చేయబోతున్నాడు అఖిల్. దీనికి ధీర అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కాకపోతే ఈ సినిమా స్క్రిప్ట్ ఇంకా పూర్తి కాకపోవడంతో మురళి కిషోర్ అబ్బూరు సినిమాను ముందుకు తీసుకొచ్చాడు అఖిల్. పెళ్లి కోసం కొన్ని రోజులు బ్రేక్ తీసుకుంటున్నాడు అక్కినేని వారసుడు. మళ్లీ ఏప్రిల్ తర్వాత సినిమా షూటింగ్ లో పాల్గొంటాడని తెలుస్తుంది.