డ్రాగన్ టైటిల్ లొల్లికి బ్రేక్ ఎప్పుడు.. టైటిల్ కే 5 కోట్లిచ్చారా..?

కేజీయఫ్, సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ తీస్తున్న మూవీ డ్రాగన్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ప్లాన్ చేసిన ఈ ప్రాజెక్ట్ ఫిబ్రవరి మూడో వారం నుంచి సెట్స్ పైకెళ్లబోతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 1, 2025 | 08:25 PMLast Updated on: Feb 01, 2025 | 8:25 PM

When Is The Break For Dragon Title Did You Give 5 Crores For The Title

కేజీయఫ్, సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ తీస్తున్న మూవీ డ్రాగన్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ప్లాన్ చేసిన ఈ ప్రాజెక్ట్ ఫిబ్రవరి మూడో వారం నుంచి సెట్స్ పైకెళ్లబోతోంది. కాని ఈలోపే టైటిల్ వార్ షురూ అయ్యింది. తమిల హీరో కమ్ డైరెక్టర్ అయిన ప్రదీప్ రంగనాథన్ మూవీకి సేమ్ టైటిల్ పెట్టడం వల్లే అసలు సమస్య వచ్చింది. కట్ చేస్తే ఈలోపే కోలీవుడ్ లో పరాశక్తి టైటిల్ వార్ మొదలై, ఆ గొడవ ఎండ్ కార్డ్ పడేలోపు జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. అలాంటి ఇబ్బందుల్లేకుండా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ రంగంలోకి దిగారా? డ్రాగన్ టైటిల్ కోసం ఏకంగా 5 కోట్లు వదులుకున్నారా? కేవలం ఒక టైటిల్ కోసం అంత సమర్పించుకుర్నారా? మరో టైటిల్ సూట్ కాదా? అంతగా ఆ టైటిల్ లో ఏముంది? ఎందుకు అంత సమర్పించుకోవాల్సి వచ్చింది.హావేలుక్.
రెబల్ స్టార్ తో సలార్ , యష్ తో కేజీయఫ్ లు తీసి హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో డ్రాగన్ తీస్తున్నాడు. ఆ సినిమా వచ్చేనెల మూడో వారం షురూ కాబోతోంది. అంతవరకు బానే ఉంది. కాని ఈ సినిమా కోసం అనుకున్న టైటిల్ ని తమిళ యాక్టర్ కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథ్ రిజిస్టర్ చేయించాడు. దీంతో ఇప్పుడా టైటిల్ వార్ కి 5 కోట్లతో ఎండ్ కార్డ్ వేసింది ప్రశాంత్ నీల్ టీం

నిజానికి ఇంచుమించు ఇలాంటి పరిస్థితే తమిళ మూవీ పరాశక్తికి వచ్చింది. శివ కార్తికేయన్ తో ఆకాశమే నీ హద్దురా ఫేం సుధా కొంగర ఓ మూవీ తీసింది. దానికి పరాశక్తనే పేరు పెట్టారు. బిచ్చగాడు ఫేం విజయ్ ఆంటోనీ తన కొత్త సినిమా కూడా పరాశక్తిగా ప్రోమో వదిలాడు. కట్ చేస్తే ఒకే సారి రెండు తమిళ సినిమాలు, ఒకే టైటిల్ తో వస్తే సమస్య అని, సినీ పెద్దలు సీన్ లోకొచ్చారు. శివ కార్తికేయన్ మూవీ టైటిల్ తమిల్, తెలుగులో పరాశక్తిగా ఉంటుందట. కన్నడ, మలయాళం, హిందీలో మాత్రం విజయ్ ఆంటోనీ మూవీకి ఆ టైటిల్ ఉంచుతారట.

అంటే కన్నడ, మళయాలం, హిందీలో శివకార్తికేయన్ మూవీ టైటిల్ మారుతుంది. తెలుగులో విజయ్ ఆంటోనీ టైటిల్ మారుతుంది. అచ్చుగుద్దినట్టు ఇలాంటిదే డ్రాగన్ కి అప్లై చేస్తేఎలా ఉంటుందనే డిస్కర్షన్ జరిగిందట.
తమిళ్ లో ప్రదీప్ రంగనాథన్ మూవీకి డ్రాగన్ ఉంచి, తెలుగులో మరో టైటిల్ పెట్టాలని…అలానే ఎన్టీఆర్ డ్రాగన్ కి తమిళ్ లోమరో టైటిల్ పెట్టాలనే చర్చ జరిగిందట.

కాని ఎన్టీఆర్ ఇమేజ్ వేరు, కుర్ర నటుడు డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ రేంజ్ వేరు..దీనికి తోడు డ్రాగన్ పాన్ ఇండియా మూవీనే కాదు, పాన్ ఆసియా సినిమా కూడా.. అందుకే ప్రదీప్ రంగనాథన్ మూవీ టీం రిజిస్టర్ చేసుకున్న డ్రాగన్ టైటిల్ కోసం 5 కోట్లు ఇవ్వటానికి ముందుకొచ్చిందట డ్రాగన్ టీం. ఆల్రెడీ చర్చలు జరిగాయి. ఫైనల్ గా ఓ డిసీజన్ కూడాతీసుకున్నారు

ఇందులో అన్నీంటికంటే విచిత్రం ఏంటంటే ఆమధ్య లవ్ టుడే తో హిట్ కొట్టిన ఈ కుర్ర హీరో కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్… కొత్త మూవీ డ్రాగన్ బడ్జెట్టే 3 కోట్లట.. అంటే ఈ సినిమా పెట్టుబడే కాదు, 2 కోట్ల లాభాన్ని కూడా ఎన్టీఆర్ మూవీ డ్రాగన్ వల్ల తనకి దక్కింది. ఒక్క టైటిల్ ఇస్తేనే ఇంతగా ప్రదీప్ అండ్ టీం లాభపడింది. అంత పెట్టి మరీ డ్రాగన్ టైటిల్ తీసుకోవటానికి రీజర్, ఇండియాలెవల్లో 8 భాషల్లోనే కాదు, జపాన్, తైవాన్, వియత్నం, ఇండోనేషియా, మలేసియా, కొరియాలో కూడా ఈ సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి అక్కడి మార్కెట్ కి ఈ టైటిలే పర్ఫెక్ట్ అని ఇంతలా టైటిల్ కోసం అంత పెట్టాల్సి వచ్చిందట.