Anushka : బొమ్మాలి బొమ్మ మళ్లీ ఎప్పుడు ?

వెయిట్‌ తగ్గకపోయినా అనుష్కకు ఆఫర్స్‌ విషయంలో కొదవే లేదు.. వెయిట్‌తో.. బాడీ లాంగ్వేజ్‌తో సంబంధం లేకుండా ఈ అమ్మడే కావాలనే దర్శకులు చాలా మంది ఉన్నారు. మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి తర్వాత అనుష్క (Anushka) నటించే తెలుగు సినిమా ఏమై ఉంటుందని అంతా ఎదురుచూస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 18, 2024 | 02:17 PMLast Updated on: Feb 18, 2024 | 2:17 PM

When Is The Toy Again

వెయిట్‌ తగ్గకపోయినా అనుష్కకు ఆఫర్స్‌ విషయంలో కొదవే లేదు.. వెయిట్‌తో.. బాడీ లాంగ్వేజ్‌తో సంబంధం లేకుండా ఈ అమ్మడే కావాలనే దర్శకులు చాలా మంది ఉన్నారు. మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి తర్వాత అనుష్క (Anushka) నటించే తెలుగు సినిమా ఏమై ఉంటుందని అంతా ఎదురుచూస్తున్నారు. 18 ఏళ్ల కెరీర్‌లో అనుష్క ఇప్పటివరకు రెండు భాషల్లో మాత్రమే నటించింది. తెలుగు, తమిళంలో తప్ప మరో లాంగ్వేజ్‌లో నటించని బొమ్మాళీ.. మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఫేడౌట్‌ అంటూ వస్తున్న కామెంట్స్‌కు కొత్త ఆఫర్‌ సమాధానం ఇచ్చింది. మలయాళంలో (Malayalam) ‘ కథనార్‌’ (Kathnar) అనే మలయాళ మూవీ చేస్తోంది. ఇందులో బొమ్మాళీ అరుంధతి మాదిరి పవర్‌ఫుల్‌ రోల్లో కనిపించనుంది. అనుష్క డెబ్యూ మలయాళ మూవీ “కథనార్‌” మొదటి భాగం ఈ ఏడాది రిలీజ్‌ అవుతోంది. రోజిన్ థామస్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఈ మూవీ.. 14 భాషల్లో ఒకేసారి రిలీజ్‌ అవుతోంది. ఎనిమిదేళ్ల క్రితం సైజ్‌ జీరో కోసం వెయిట్‌ పెరిగి ఆతర్వాత తగ్గలేక ఆఫర్స్‌కు దూరమైంది.

ఓవర్‌ వెయిట్‌తో వున్న బొమ్మాళీని హీరోలు పక్కన పెట్టేశారు. మూడేళ్లు ఖాళీగా వున్న అనుష్కకు అనుకోకుండా ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’ (Miss Shetty.. Mr. Polishetty) సినిమాలోయంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టితో నటించే ఛాన్స్‌ వచ్చింది. సినిమా కమర్షియల్‌గా వర్కవుట్ కావడంతో.. దర్శకులు బొమ్మాళీపై ఫోకస్‌ పెట్టారు. ఎనిమిదేళ్లుగా వెయిట్‌ తగ్గాలని అనుష్క చేస్తున్న ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టాయి. మిస్‌ శెట్టిలో ఫేస్‌ బొమ్మలా వున్నా.. టెక్నాలజీతో బాడీ వెయిట్‌ తగ్గించారు. ఈ అమ్మడితో వేదం తీసిన క్రిష్‌ (Krish) మరోసారి డైరెక్ట్ చేయనున్నాడు. ఇందులో యంగ్ హీరో వున్నా… లీడ్ రోల్‌ అనుష్కదే.