అసలు ఆ అదృంష్టవంతుడికి.. ఫ్లాప్ ఎప్పుడొస్తుంది…?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరినీ గ్లోబల్ గా ఫోకస్ చేసింది డైరెక్టర్ రాజమౌలి. ప్రభాస్ పాన్ ఇండియా కింగ్ గా మారింది కూడా తన డైరెక్షన్ లోనే... విచిత్రం ఏంటంటే స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి రాజమౌలికి హిట్లు మొదలయ్యాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 20, 2025 | 07:00 PMLast Updated on: Feb 20, 2025 | 7:00 PM

When Will The Flop Actually Happen To That Lucky Person

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరినీ గ్లోబల్ గా ఫోకస్ చేసింది డైరెక్టర్ రాజమౌలి. ప్రభాస్ పాన్ ఇండియా కింగ్ గా మారింది కూడా తన డైరెక్షన్ లోనే… విచిత్రం ఏంటంటే స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి రాజమౌలికి హిట్లు మొదలయ్యాయి. ఇంత వరకు ఒక్కటంటే ఒక్క ఫ్లాపు పడలేదు. దాంతో భారీ బడ్జెట్ తో రాజమౌలి బాహుబలితీస్తున్నప్పుడు, ఈ సారి తను బొక్కబోర్లా పడతాడన్నారు. కాని అలా జరగలేదు. త్రిబుల్ ఆర్ తో పంచ్ పడుతుందన్నారు. అక్కడ కూడా అసూయ బ్యాచ్ కోరుకుంది జరగలేదు. ఎందుకో రాజమౌళి ఎప్పుడు మూవీ మొదలు పెట్టినా ఈసారి, పంచ్ పడుతుందంటూ, అసూయ బ్యాచ్ ఎదురుచూస్తూనే ఉంది. బేసిగ్గా ఒకరు కంటిన్యూయస్ గా సక్సెస్ అవుతుంటే, ఎప్పుడు కిందపడతారా అని ఎదురుచూసే బ్యాచ్ కూడా ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ఇది కాస్త శాడిస్టిక్ ఐడియాలజీనే అయినా, రియాలిటీని వదిలేయలేం… అలా బాహుబలి వరకు చాలా మంది కోరుకున్నారు.. ఇప్పడు అలా కోరుకునే సాహసం ఎవరూ చేయలేరు.. ఎందుకు..? సూపర్ స్టార్ మహేశ్ తో రాజమౌళి చేస్తున్న సినిమాకు ఎందుకు వన్ పర్సెంటేజ్ కూడా నెగెటీవిటీ కనిపించట్లేదు..? అక్కడే కథలో ట్విస్ట్ ఉంది.. అదేంటో చూసేయండి.

రాజమౌళికి ఎప్పుడు ఫ్లాప్ పడుతుంది..? మొన్నటి వరకు అంటే త్రిబుల్ ఆర్ వరకు కూడా ఈప్రశ్న చాలా మంది నుంచి వినిపించింది. ఎవరైనా పచ్చగా ఉంటే కళ్లల్లో నిప్పులు పోసుకుంటారా అన్న మాటలు రావొచ్చు… కాని రియల్ వరల్డ్ లో అసూయ కొన్ని సార్లు ఇలా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. బాలీవుడ్ లో కొందరైతే ఏ రాజమౌళి మనిషి కాదా? తనకి ఫ్లాప్ పడదా..? అన్న కామెంట్లు కూడా పెట్టారప్పట్లో
సూపర్ స్టార్ మహేవ్ బాబు, ప్రియాంకచోప్రా కాంబినేషన్ లో రాజమౌళి 1000 కోట్ల సినిమా తీస్తున్నాడు.. ఇదే తన తొలి పాన్ వరల్డ్ మూవీ. సో ఫస్ట్ పాన్ వరల్డ్ మూవీ కాబట్టి, ఇది ఏమాత్రం అయినా అటు, ఇటైతే ఎలా? పాన్ వరల్డ్ ప్లాట్ ఫాంలోకి వెళ్లి రాజమౌళి ఈ సారి బొక్కబోర్లా పడితే ఎలా? ఇలాంటి డౌట్లు మామూగా అయితే వినిపించాలి. కాని వినిపించట్లేదు.

సూపర్ స్టార్ మహేవ్ బాబు సినిమా వస్తోందంటేనే, యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గట్టిగా వేసుకుంటారు. సూపర్ ఫ్లాప్ అని నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తారు.. కాని ఈ సారి అలాంటిదేం కనిపించట్లేదు. అదేదో అద్భుతమే జరగబోతోందా? అన్నట్టు అంతా ఈమూవీ అప్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఫ్యాన్స్ ని మించేలా కామన్ ఆడియన్స్ లో కూడా ఈ ప్రాజెక్ట్ మీద భయంకరమైన క్యూరియాసిటీ చూస్తున్నాడు. ఈ మూవీ తాలూకు ఏ చిన్న ప్రోగ్రెస్ కనిపించినా గూగుల్ సెర్చ్ లో ఈ సినిమా మీద సెర్చ్ చేస్తున్నారు..

ఇంతకి రాజమౌళి ఎప్పుడు బొక్కబోర్లా పడతాడా అని ఎదురుచూసినా బ్యాచ్ ఎందుకు సైలెంట్ అయ్యింది. అంటే తనకి ఇక ఫెల్యూర్ రానే రాదని ఫిక్స్ అయ్యారా? లేదంటే ఫెల్యూర్స్ ని జయించే మత్రం ఏదౌనా రాజమౌళి కనిపెట్టాడా? ఇక్కడే రాజమౌళి సక్సెస్ అయ్యాడు. మార్కెట్ డెఫినేషన్ తాను అర్ధం చేసుకుని ప్రతీసారి గట్టెక్కతున్నాడు.స్టూడెంట్ నెంబర్ వన్ తో డైరెక్టర్ గా మారిన తను, సింహాద్రి టైంలోనే రిలీజ్ కి ముందే ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకున్నాడు. కట్ చేస్తే అది విడుదలై వండర్స్ చేసింది. సై కూడా పోయిందన్నారు కాని బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఛత్ర పతి రిలీజైన మొదటి రోజు ఫ్లాప్ టాకే వచ్చింది. తీరా చూస్తే వీకెండ్ కల్లా బాక్సాఫీస్ లోవసూళ్ల సౌండ్ మారింది. విక్రమార్కుడు ఒక్కటే రిలీజ్ కి ముందు కూడా హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.

యమదొంగలో ఎన్టీఆర్ సన్నగా ఉన్నాడు, ఇక ఈ సినిమా పోయినట్టే అన్నారు. కాని అది హిట్టైంది. మగధీర సెన్సేషన్ క్రియేట్ చేసింది. మర్యాదరామన్నలో సునీల్ హీరో ఏంటి,ఇదిపోయినట్టే అన్నారు. అది జరగలేదు. ఇలా ప్రతీ సారి రాజమౌళి పులి నోట్లో తలపెట్టి హ్యాపీగా బయట పడ్డాడు. ఫైనల్ గా ఈగ ఎగిరే లోపే రాలిపోతుందన్నారు. అది ఏకంగా పాన్ ఇండియా మార్కెట్ వైపు అడుగులేసేలా రాజమౌలి మనసు మార్చింది. నార్త్ లో కూడా వసూళ్లు భారీగా రావటంతో, అది ఓరకంగా బాహుబలి లాంటి భారీ బడ్జెట్ మూవీ కి కారణమైంది.

బాహుబలి వచ్చినప్పుడు అది పోతుందన్నారు. కాని అది సౌత్, నార్త్ మధ్యగోడల్ని కూల్చేసింది. పార్ట్ 2 కి మాత్రం బాహుబలి పోతుందనే మాట రాలేదు. రిలీజ్ కి ముందే రిసౌండ్ చేస్తుందన్నారు, అదే జరిగింది. త్రిబుల్ ఆర్ తో పాన్ వరల్డ్ వైపు రాజమౌళి అడుగులేసేలా నాటు పాట తూటాలా పేలింది. హాలీవుడ్ జనాల అటెన్షన్ కూడా లాక్కుంది. ఇంత జరిగాక కూడా ఇకమీద రాజమౌళిక పంచ్ పడుతుందా అన్న ప్రశ్నే రాదు. కారనం కథని, కథనాన్ని, దీనికి తోడు సినిమా ను మార్కెట్ చేసి విదానాన్ని ఎప్పటి కప్పుడు మార్చుకుంటూ, ఫోకస్డ్ గా వెలుతున్నాడు రాజమౌళి. అసలు తన సినిమా వస్తే వసూళ్లెన్ని వచ్చాయో చూసుకోవాలి తప్పా… హిట్ ఫ్లాప్ రేంజ్ ని తానెప్పుడో దాటేశాడు. హాలీవుడ్ లో టైటానిక్, అవతార్ లాంటి మూవీలు తీసిన జేమ్స్ కామెరున్, జురాసిక్ పార్క్ లాంటి ప్రయోగాలు చేసిన స్టీవెన్ స్పిల్ బర్గ్.