Telangana Nativity: పాన్‌ ఇండియా మోజు సరే.. తెలంగాణ నేటివిటీ ఎక్కడ ?

చాలా మంది నిర్మాతలు సినిమా తీయడం కంటే దాన్ని ప్రమోట్‌ చేయడంలోనే ఎక్కువ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు. దాని కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కానీ అందులో కొన్ని సినిమాలు మాత్రమే హిట్‌ అవుతున్నాయి. దీనికి కారణంగా సినిమా నేచర్‌ను ప్రమోషన్స్‌లో చూపించలేకపోవడమే అంటున్నారు విమర్శకులు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 16, 2023 | 01:30 PMLast Updated on: Mar 16, 2023 | 1:30 PM

Where Is Telangana Nativity In Pan Indian Movies

బాహుబలి సినిమా తరువాత తెలుగు హీరోలకు పాన్‌ ఇండియా మోజు పెరిగిపోయింది. ప్రతీ ఒక్కరూ ఇండియా వైడ్‌గా ఫేమ్‌ తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా పేరు సంపాదిస్తే మంచిదే.. కానీ పాన్‌ ఇండియా మోజులో తెలుగు నేటివిటీని పక్కన పెట్టేస్తున్నారు అనే వాదనలు వినిపిస్తున్నాయి. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో నాచురల్‌ స్టార్‌ నాని దసరా అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమాను 5 భాషల్లో రిలీజ్‌ చేస్తున్నట్టు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. పక్క స్టేట్స్‌లో చాలా బిజీగా ప్రమోషన్స్‌ చేస్తున్నారు. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటి అంటే.. సినిమా తీసింది కంప్లీట్‌గా తెలంగాణ, సింగరేణి బ్యాగ్రాప్‌లో. యాస, భాష మొత్తం తెలంగాణ పల్లెలను గుర్తుకు తెస్తుంది. కానీ సినిమా ప్రమోషన్స్‌లో తెలంగాణ నేటివిటీ ఎక్కడా కనిపించడంలేదనే విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సినిమాను ముఖ్యంగా ప్రమోట్‌ చేయాల్సింది తెలంగాణలో. ప్రతీ పల్లెకు వెళ్లాల్సిన సినిమాను పక్క రాష్ట్రాల్లో తిప్పుతున్నారంటూ కొందరు విమర్శకులంటున్నారు. బాహుబలి, ట్రిపులార్‌ లాంటి కథలు దేశవ్యాప్తంగా ఈజీగా కనెక్ట్‌ అవుతాయి. ఎర్రచందనం స్మగ్లింగ్‌ బ్యాగ్రాప్‌లో వచ్చిన పుష్ప సినిమా కూడా అంతే. రెడ్‌ శాండల్‌ స్మగ్లింగ్‌ గురించి కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ అందరికీ తెలుసు. కానీ దసరా సినిమా తెలంగాణ గ్రామీణ ప్రాంతానికి సంబందించింది. అలాంటి సినిమాకు నార్త్‌ పీపుల్‌ని రప్పించాలి అంటే.. మన నేటివిటీ గొప్పతనాన్ని సినిమా ప్రమోషన్స్‌లోనే చూపించాల్సిన ఉంది. కానీ దసరా ప్రమోషన్స్‌లో ఇది ఎక్కడా కనిపించడంలేదనేది వాదన. ఈ మధ్య చాలా మంది నిర్మాతలు సినిమా తీయడం కంటే దాన్ని ప్రమోట్‌ చేయడంలోనే ఎక్కువ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు. దాని కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కానీ అందులో కొన్ని సినిమాలు మాత్రమే హిట్‌ అవుతున్నాయి. దీనికి కారణంగా సినిమా నేచర్‌ను ప్రమోషన్స్‌లో చూపించలేకపోవడమే అంటున్నారు విమర్శకులు. దేశవ్యాప్తంగా సినిమాను ప్రమోట్‌ చేయడం మంచిదే.. కానీ ఈ ప్రమోషన్స్‌లోనే తెలంగాణ ఎమోషన్స్‌ చూపించాలి అంటున్నారు విమర్శకులు.