పోకిరిలో అలీ భాయ్… ప్రకాష్ రాజ్ కాదా…?
పోకిరి... ఈ సినిమా ముందు వరకు మహేష్ బాబు కెరీర్ వేరు ఈ సినిమా తర్వాత మహేష్ బాబు కెరీర్ వేరు. పోకిరి హిట్ మహేష్ బాబు ఖాతాలో పడకుండా ఉంటే మహేష్ కెరీర్ చాలా స్లోగా ఉండేది అంటారు ఇప్పటికీ సిని జనాలు.
పోకిరి… ఈ సినిమా ముందు వరకు మహేష్ బాబు కెరీర్ వేరు ఈ సినిమా తర్వాత మహేష్ బాబు కెరీర్ వేరు. పోకిరి హిట్ మహేష్ బాబు ఖాతాలో పడకుండా ఉంటే మహేష్ కెరీర్ చాలా స్లోగా ఉండేది అంటారు ఇప్పటికీ సిని జనాలు. ఈ సినిమాలో పండుగాడు పాత్రలో మహేష్ బాబు జీవించాడు. ఇక ఈ సినిమా క్లైమాక్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా అప్పటి వరకు చాలా స్లోగా ఉన్నా ఆ తర్వాత మాత్రం ఒక్కసారిగా హైప్ వచ్చేసింది. క్లైమాక్స్ తో సినిమా రేంజ్ ఏ మారిపోయింది. వసూళ్లు భారీగా రావడానికి, అసలు సినిమా హిట్ కావడానికి క్లైమాక్స్ ఏ కారణం.
ఇక ఈ సినిమాలో మహేష్ బాబు తర్వాత బాగా ఫేమస్ అయింది అలీ భాయ్ పాత్ర. కాని అలీ భాయ్ పాత్రకు ముందు ప్రకాష్ రాజ్ ని అనుకోలేదట దర్శకుడు పూరి జగన్నాథ్. నటీ నటుల ఎంపిక జరుగుతున్న సమయంలో ప్రకాష్ రాజ్ ను పిలిచి ఆశిష్ విద్యార్ధి చేసిన ఎస్సై పాత్రను ఇస్తా అని చెప్పాడట. అయితే ఆ పాత్ర సెట్ కాదని ప్రకాష్ రాజ్ నో అన్నారట. ఆ తర్వాత షాయాజీ షిండే చేసిన పాత్ర అడిగినా కూడా నో అన్నారట. మాటల సందర్భంలో… వేరే ఊరి నుంచి వచ్చే వాడు ఉన్నాడు కదా ఆ పాత్రకు ఎవరిని ఎంపిక చేసావని పూరిని అడిగారట.
అది కేవలం ఏడు రోజుల పాత్ర మాత్రమే అని… అది నీకు సూట్ అవ్వదు అన్నారట పూరి. క్లైమాక్స్ లో హీరో ఫైట్ చేసేది ఎవరు అని అడిగారట ప్రకాష్ రాజ్. ఆ పాత్రే అనడంతో నేను ఆ పాత్రలో నటిస్తా అన్నారట ప్రకాష్ రాజ్. దీనితో పూరి వెంటనే ఓకే చేసారట. అలా ఒక రోజు… ముమైత్ ఖాన్ తో ఐటెం సాంగ్ చేస్తున్న సమయంలో ప్రకాష్ రాజ్ సెట్స్ క్కి వచ్చారట. వెంటనే పూరికి ఓ ఆలోచన వచ్చిందట. ఆ షూటింగ్ సమయంలో వెంటనే ఒక సెట్ పక్కన వేయించి ప్రకాష్ రాజ్ తో ఆ సమయంలో సీన్ షూట్ చేసారట. అలా అలీ భాయ్… పాత్రకు ప్రకాష్ రాజ్ ను తీసుకున్నారు.