Film Industry: మనోళ్లకు ఎవరికి ఆస్కార్ వచ్చిందంటే..
ఆస్కార్ అవార్డు అందుకోవడం అంటే.. దేశ ప్రతిష్టను ఇంకో మెట్టు ఎక్కించినట్లే అనడంలో ఎలాంటి అనుమానం లేదు. 94 ఏళ్ల చరిత్రలో మనకు, మనవాళ్లకు అవార్డు దక్కింది చాలా తక్కువసార్లు మాత్రమే !
భాను అథయ్యా.. మొదటిసారి భారత్ నుంచి ఆస్కార్ విజేతగా నిలిచి హిస్టరీ క్రియేట్ చేశారు. 1983లో విడుదలైన గాంధీ సినిమాకు.. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా 55వ ఆస్కార్ వేడుకల్లో అవార్డు గెలుచుకుంది. ఆ తర్వాత భారతీయ చలన చిత్ర పరిశ్రమకు వన్నె తెచ్చిన సత్యజిత్‌రే ఆస్కార్ అందుకున్నాడు. సినీ రంగానికి సత్యజిత్‌రే చేసిన విశేష సేవలను గుర్తించిన ఆస్కార్స్ 1992లో సత్యజిత్‌రేకు హానరరి అవార్డును ప్రకటించింది. అనారోగ్య కారణాలతో సత్యజిత్ రే ఆ వేడుకలకు వెళ్లలేకపోయాడు. దీంతో అకాడమీ స్వయంగా హాస్పిటల్‌కు వచ్చి ఆస్కార్ అందించింది.
ఆ తర్వాత స్వర మాంత్రికుడు రెహమాన్… ఏకంగా రెండు ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకున్నాడు. స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమాకూ బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో అవార్డులను గెలుచుకున్నాడు. ఇలా రెండు అకాడమీ అవార్డులను గెలచుకున్న తొలి భారతీయుడిగా రెహమాన్ రికార్డు సృష్టించాడు. 81వ ఆస్కార్ వేడుకల్లో స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు గానూ ఉత్తమ సౌండ్ మిక్సింగ్ కేటగిరీలో రూసల్ పూకుట్టి ఆస్కార్ గెలిచాడు. ఆ తర్వాత దర్శకుడిగా, నిర్మాతగా, గేయ రచయితగా భారతీయ చలన చిత్ర పరిశ్రమకు విశేష సేవలందించిన గుల్జర్.. 81వ ఆస్కార్ వేడుకల్లో అవార్డు గెలుచుకన్నాడు. స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాలోని జయహో పాటకు ఉత్తమ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆయనను ఆస్కార్ వరించింది. ఇక ఢిల్లీకి చెందిన ప్రముఖ నిర్మాత గునీత్ మోన్గా… 91వ ఆస్కార్ వేడుకల్లో అవార్డు గెలుచుకుంది. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌గా.. పీరియడ్ ఎండ్ ఆఫ్ ఏ సెంటెన్స్ మూవీకి గునీత్ ఆస్కార్‌ను గెలుచుకుంది.