ఎవరీ కృష్ణ ప్రసాద్..? సురేఖ కూతురికి అతనికి లింక్ ఏంటీ…?

2016-17 సమయంలో తెలంగాణాను డ్రగ్స్ కేసు ఓ ఊపు ఊపింది. సినిమా వాళ్ళు చాలా మంది ఈ డ్రగ్స్ కేసులో ఉండటంతో అప్పట్లో అధికారులు సినిమా వాళ్ళను కూడా పిలిచి విచారించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 4, 2025 | 05:55 PMLast Updated on: Feb 04, 2025 | 5:55 PM

Who Is Krishna Prasad What Is His Link To Surekhas Daughter

2016-17 సమయంలో తెలంగాణాను డ్రగ్స్ కేసు ఓ ఊపు ఊపింది. సినిమా వాళ్ళు చాలా మంది ఈ డ్రగ్స్ కేసులో ఉండటంతో అప్పట్లో అధికారులు సినిమా వాళ్ళను కూడా పిలిచి విచారించారు. ఈ కేసులో పూరి జగన్నాథ్, రవితేజా, నవదీప్, ముమైత్ ఖాన్ వంటి వాళ్ళు విచారణకు హాజరు అయ్యారు. ఆ తర్వాత అనేక కారణాలతో ఈ డ్రగ్స్ కేసు సైలెంట్ అయిపోయింది. ఇక ఆ సమయంలో కొందరిని అధికారులు ఎక్కువగా టార్గెట్ చేసారనే ప్రచారం జరిగింది. ఆ వ్యవహారంలో ప్రధానంగా చాలా మంది నటుల పేర్లు బయటకు వచ్చినా.. విచారణ ముందుకు వెళ్ళలేదు.

ఆ తర్వాత కూడా టాలీవుడ్ ను డ్రగ్స్ కేసు వెంటాడింది. ఈసారి నిర్మాత కేపి చౌదరి నేరుగా డ్రగ్స్ అమ్ముతున్న సమయంలో పోలీసులు అరెస్ట్ చేసారు. రజనీ కాంత్ హీరోగా వచ్చిన కబాలి అనే సినిమాకు తెలుగు నిర్మాతగా ఆయన వ్యవహరించారు. అలా తెలుగులో ఫేమస్ అయిన కృష్ణ ప్రసాద్.. డ్రగ్స్ కేసుతో అంతకు మించి పాపులర్ అయ్యారు. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు నిర్మించిన కేపి చౌదరి.. అలియాస్ సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి, గోవాలో ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం అయింది. కేపి చౌదరిది.. ఖమ్మం జిల్లాలోని మధిర.

2016లో నిర్మాతగా టాలీవుడ్‌లో అడుగు పెట్టాడు. కబాలి సినిమా భారీ నష్టాల్లో ముంచడంతో.. అతను కోలుకోలేదు. ఆ తర్వాత ప్రేమిక అనే సినిమాలో కూడా పెట్టుబడి పెట్టగా ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది. కేపీ చౌదరికి టాలీవుడ్‌లో చాలా మందితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు చెప్తారు. ముఖ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్టులు హేమ, సురేఖలతో క్లోజ్‌గా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో రివీల్ అయ్యాయి. వీరితో పాటుగా సురేఖ కూతురు సుప్రీత, బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి, జ్యోతి పేర్లు కూడా వార్తల్లో ఉన్నాయి. కేపీ చౌదరి ద్వారానే ఇండస్ట్రీలోని చాలా మందికి డ్రగ్స్ సరాఫరా అవుతున్నాయని ప్రచారం కూడా జరిగింది.

ఈ కేసు విచారణలో ఉండగానే అతను ఆత్మహత్య చేసుకోవడం సంచలనం అయింది. సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడంతో అతను ఆర్ధికంగా ఇబ్బందులు పడ్డాడు. ఆ నష్టాలతోనే అతను ఇక్కడి నుంచి వెళ్ళిపోయి గోవాలో ఉంటున్నాడు అని సమాచారం. తాను ఎక్కడ ఉంటున్నాడు అనేది కూడా ఎవరికి ఇప్పటి వరకు చెప్పలేదు. అయితే ఇటీవల ఆయన ఉంటున్న క్లబ్ గురించి బయటకు వచ్చింది. అదే క్లబ్ లో ఆయన విగత జీవిగా కనిపించినట్టు సమాచారం.. సురేఖ కూతురు సుప్రిత, కేపీ చౌదరి మృతిపై సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టింది. 2023లో 2023లో డ్రగ్స్ విక్రయిస్తుండగా కేపీ చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో కేపీ చౌదరి ప్రస్తుతం బెయిల్ పై బయట తిరుగుతున్నాడు. కేపీ చౌదరి మృతిపై ఆయన తల్లికి పోలీసులు సమాచారం అందించారు. కేపీ చౌదరి తల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఉంటున్నట్టు సమాచారం.