రెబల్ స్టార్ తర్వాత నెంబర్ నాదే… తేల్చిందెవరు…?
పాన్ ఇండియా కింగ్ అంటే రెబల్ స్టార్ ప్రభాసే... తన స్ఠానం ఎవరూ కదపలేనిది... అలాంటి ఇమేజ్, మార్కెట్ ని తను సొంతం చేసుకన్నాడు. అందుకు తన హిట్లే కాదు,తన క్యారెక్టర్ కూడా కారణం కావొచ్చు. ఏదేమైనా ఎవరైనా ప్రభాస్ తర్వాతే అనేంతగా ఆమధ్య తారక్, త్రిబుల్ ఆర్ టైంలో రామ్ చరణ్ కూడా అన్నాడు.
పాన్ ఇండియా కింగ్ అంటే రెబల్ స్టార్ ప్రభాసే… తన స్ఠానం ఎవరూ కదపలేనిది… అలాంటి ఇమేజ్, మార్కెట్ ని తను సొంతం చేసుకన్నాడు. అందుకు తన హిట్లే కాదు,తన క్యారెక్టర్ కూడా కారణం కావొచ్చు. ఏదేమైనా ఎవరైనా ప్రభాస్ తర్వాతే అనేంతగా ఆమధ్య తారక్, త్రిబుల్ ఆర్ టైంలో రామ్ చరణ్ కూడా అన్నాడు. బన్నీ ఎన్నోసార్లు ప్రభాస్ ని ఆకాశానికెత్తాడు.. కాకపోతే ఇప్పుడు టైం వచ్చింది. ప్రభాస్ ని దాటి వెళ్లడానికి కాదు… రెబల్ స్టార్ తర్వాత ప్లేస్ లో తిష్టవేసే హీరో ఎవరు…..? ఇదే ప్రశ్నకు సౌత్ మొత్తం నుంచే కాదు బాలీవుడ్ నుంచి కూడా పోటీ అంటే ముగ్గురి మధ్యే.. వాళ్లే ఎన్టీఆర్, బన్నీ, రామ్ చరణ్… కాకపోతే ఈ ముగ్గురిలో పాన్ ఇండియా సెకండ్ కింగ్ గా దేవరే నిలిచేలా ఉన్నాడు. ముందే వస్తున్నాడు కాబట్టా? మరింకేమైనా లాజిక్ ఉందా?
రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో ఏ స్టార్లు టచ్ చేయలేని స్థానంలో నిలుచున్నాడు. పాన్ ఇండియా కింగ్ గా మారి, మార్కెట్ కే మొగుడయ్యాడంటున్నారు. బాహుబలి రెండు భాగాలు, సాహో, సలార్, కల్కీలతో తను క్రియేట్ చేసిన ట్రెండ్ ని మించి రికార్డులు క్రియేట్ చేయటం ఆల్ మోస్ట్ అన్ ఇమాజినబుల్…
అందుకే ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో ఖాన్లు కపూర్లే కాదు, తమిళ, కన్నడ స్టార్లు అలానే తెలుగు స్టార్లు సెకండ్ ప్లేస్ కోసం పోరాడుతున్నారు. కేజీయఫ్ 1,2 హిట్ల ప్రకారం చూస్తే యష్ కి కూడా ప్రభాస్ తర్వాత ప్లేస్ లో తిష్ట వేసే సీన్ ఉంది. పుష్ప , త్రిబుల్ ఆర్ పుణ్యమాని బన్నీ, ఎన్టీఆర్, రామ్ చరన్ కి కూడా పాన్ ఇండియా కింగ్ లిస్ట్ లో సెకండ్ ప్లేస్ మీద అడుగుపెట్టే ఛాన్స్ ఉంది..
కాని ఎన్టీఆర్ కే ఈ విషయంలో అవకాశాలు ఎక్కువున్నాయి. కారణం దేవర మూవీ రిలీజ్ కిముందే రికార్డులు క్రియేట్ చేస్తూ, హైప్ ని పెంచడం అన్నీంట్లో ముఖ్యమైన కారనం. ఓ తెలుగు హీరో సినిమా వస్తోందంటే పాన్ ఇండియా మార్కెట్ మొత్తం ఇంతగా హైప్ వస్తోందంటే చిన్న విషయం కాదు. ఇదే ఊపులో దేవర హిట్ అయితే పాన్ ఇండియా సెకండ్ కింగ్ గా ముందు ఎన్టీఆర్ పేరే మారుమోగే ఛాన్స్ ఉంది
త్రిబుల్ ఆర్ తర్వాత సెకండ్ పాన్ ఇండియా హిట్ కొడితే ఎన్టీఆర్ కి తిరుగుండదు. లక్కీగా ఈ సినిమాకు హైప్ రావటమే కాదు, పుష్ప 2, గేమ్ ఛేంజర్ కంటే ముందే వస్తోంది కాబట్టి, ఏమాత్రం దేవరకి లక్ కలిసొచ్చినా పాన్ ఇండియా సెకండ్ కింగ్ ఎన్టీఆరే. ఆతర్వాత రెండు నెల్లకు పుష్ప 2, ఆవెంటనే 20 రోజుల గ్యాప్ తో గేమ్ ఛేంజర్ గా చరణ్ వస్తున్నాడు. వాళ్లకు కూడా పాన్ ఇండియా లెవల్లో రెండో హిట్ పడితే, ప్రభాస్ తర్వాత ప్లేస్ లో కుర్చీ వేసుకుని కూల్ గా హల్చల్ చేసే సీన్ వస్తుంది… కాకపోతే ముందు గా విడుదలవ్వటం, విడుదలకు ముందుగానే రికార్డులు క్రియేట్ చేయటం బట్టి చూస్తే మ్యాన్ ఆఫ్ మాసెస్ కి ఆ క్రెడిట్ దక్కేలా ఉంది.