Jai Hanuman : ప్రశాంత్ వర్మ నెక్ట్స్ సూపర్ హీరో ఎవరంటే..!
ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prashanth Varma) పేరు మారుమోగిపోతోంది. ఆయన డైరెక్ట్ చేసిన 'హనుమాన్' (Hanuman ) మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అద్భుతమైన టేకింగ్ తో సినిమా రేంజ్ ను పెంచేశాడు. అతి తక్కువ టైమ్ లోనే రాజమౌళి రేంజ్ గ్రాఫిక్స్ ను చూపించి.. మనల్ని ఆశ్చర్యపరిచాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.

Who is Prashanth Varma's next superhero?
ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prashanth Varma) పేరు మారుమోగిపోతోంది. ఆయన డైరెక్ట్ చేసిన ‘హనుమాన్’ (Hanuman ) మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అద్భుతమైన టేకింగ్ తో సినిమా రేంజ్ ను పెంచేశాడు. అతి తక్కువ టైమ్ లోనే రాజమౌళి రేంజ్ గ్రాఫిక్స్ ను చూపించి.. మనల్ని ఆశ్చర్యపరిచాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఇక హనుమాన్ భారీ విజయం సాధించడంతో.. ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు.
ఈ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో సూపర్ హీరోల సినిమాలు నిర్మిస్తానని ముందునుంచే చెప్పుకొస్తున్నాడు. అందులో భాగంగా హనుమాన్ ను తెరకెక్కించాడు.పరిమిత బడ్జెట్ లో సూపర్ హీరో ఫిల్మ్ అద్భుతంగా తెరకెక్కించాడనే ప్రశంసలు దక్కుతున్నాయి. అంతేకాదు సినిమా చివరిలో సీక్వెల్ గా ‘జై హనుమాన్’ ( Jai Hanuman) కూడా ఉంటుందని లీడ్ ఇచ్చాడు దర్శకుడు. ఇది 2025 లో విడుదల కానుంది. అయితే దీని కంటే ముందే ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మరో సినిమా రానుంది.
‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా మొదటి సినిమాగా ‘హనుమాన్’ రూపొందింది. ఈ యూనివర్స్ లో పలు సూపర్ హీరో సినిమాలు రానున్నాయి. రెండో సినిమాగా ‘అధీర’ను ఎప్పుడో ప్రకటించాడు ప్రశాంత్ వర్మ. ఈ చిత్రంతో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు కళ్యాణ్ దాసరి హీరోగా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ స్ట్రైక్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ఏడాదే ‘అధీర’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.