Bigg Boss 7 Grand finale : బిగ్ బాస్7 గ్రాండ్ ఫినాలే గెస్టులు ఎవరంటే..?

బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలే కి ముహూర్తం కుదిరింది. డిసెంబర్ 17 ఆదివారం రోజు బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలే చాలా అట్టహాసంగా జరగబోతుంది. అయితే బిగ్ బాస్ 7 విన్నర్ ఎవరు అనేది ప్రస్తుతం అందరిలో ఒక ఉత్కంఠ ఉన్నప్పటికీ బిగ్ బాస్ విన్నర్ కి ట్రోఫీ ఎవరు ఇస్తారు అనే దానిలో కూడా కొంతమందికి అనుమానాలు ఉన్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 14, 2023 | 05:08 PMLast Updated on: Dec 14, 2023 | 5:08 PM

Who Is The Guest Of Bigg Boss 7 Grand Finale

బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలే కి ముహూర్తం కుదిరింది. డిసెంబర్ 17 ఆదివారం రోజు బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలే చాలా అట్టహాసంగా జరగబోతుంది. అయితే బిగ్ బాస్ 7 విన్నర్ ఎవరు అనేది ప్రస్తుతం అందరిలో ఒక ఉత్కంఠ ఉన్నప్పటికీ బిగ్ బాస్ విన్నర్ కి ట్రోఫీ ఎవరు ఇస్తారు అనే దానిలో కూడా కొంతమందికి అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే పూర్తయిన కొన్ని సీజన్ లకి గ్రాండ్ ఫినాలేకి గెస్ట్ లుగా కొంతమంది స్టార్ హీరోలు వచ్చి వారి చేతుల మీదుగా బిగ్ బాస్ విన్నర్లకు ట్రోఫీలు అందజేస్తారు.అయితే ఈసారి బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలే కి గెస్ట్ లుగా ఎవరు వస్తున్నారు అని అందరూ భావిస్తున్నారు.

అయితే ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈసారి బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలే కి అతిధులుగా నందమూరి బాలకృష్ణ అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు రాబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ కి నాగార్జునకి మధ్య కొన్ని గొడవలు ఉన్న కారణంగా ఆయన ఈ షో కి వస్తారో లేదో తెలియదు. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం గ్రాండ్ ఫినాలే కి వస్తున్నారని తెలుస్తోంది.

ఇక ఈ గ్రాండ్ ఫినాలే కి రావడంతో పాటు తన గుంటూరు కారం సినిమాకి కూడా ప్రమోషన్స్ చేసుకుంటారని తెలుస్తోంది. ఇక ఈ గ్రాండ్ ఫినాలే రోజు కంటెస్టెంట్స్ డ్యాన్స్ పర్ఫామెన్స్ లతో పాటు సెలబ్రిటీస్ కూడా డాన్స్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకోబోతున్నట్టు తెలుస్తుంది. మరి ఈసారి బిగ్ బాస్ విన్నర్స్ గా అమర్ దీప్ పల్లవి ప్రశాంత్ మధ్య టఫ్ ఫైట్స్ జరుగుతుంది. అయితే ఈసారి బిగ్ బాస్ 7 విన్నర్ ఎవరు అవుతారో చూడాలి.