Pushpa 2 : పుష్ప2 లో ఐటెం సాంగ్ బ్యూటీ ఎవరు?.
Pushpa 2 పుష్ప (Pushpa) తో ట్రెండ్ బెండు తీశారు సుకుమార్. పాన్ ఇండియా (Pan India Movie) రేంజ్ లో సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు దాని తలతన్నేలా సీక్వెల్ ని రెడీ చేస్తున్నాడు.

Who is the item song beauty in Pushpa 2 ?
Pushpa 2 పుష్ప (Pushpa) తో ట్రెండ్ బెండు తీశారు సుకుమార్. పాన్ ఇండియా (Pan India Movie) రేంజ్ లో సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు దాని తలతన్నేలా సీక్వెల్ ని రెడీ చేస్తున్నాడు. ఇంతవరకు ఓకే..కానీ పుష్ప 2 లో ఐటెం సాంగ్ (Item Song) చేసే బ్యూటీ ఎవరు?. బన్నీతో మరోసారి సామ్ చిందేసే ఛాన్స్ ఉందా? ఇప్పుడు ఇండస్ట్రీ లో ఇదే చర్చ.
BIGG BOSS : కొత్త కెప్టెన్ గా శివాజీ.. రతిక ఫెయిల్.. అమర్ పాస్..
పుష్ప తో నేషనల్ అవార్డు అందుకున్న బన్నీ ఇప్పుడు సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప2 చేస్తున్నాడు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ ఫినిష్ అవ్వడంతో సాంగ్స్ పై ఫోకస్ పెట్టింది యూనిట్. పుష్ప2 లో ఐటెం సాంగ్ ని స్పెషల్ గా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
పుష్ప: ది రైజ్ లో సమంతతో స్పెషల్ సాంగ్ చేయించాడు సుకుమార్. ఆ పాట బాగా పాపులర్ అయ్యింది. నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకుంది. అల్లు అర్జున్ తో కలిసి సమంత వేసిన స్టెప్స్ కి సినీ లవర్స్ ఫిదా అయ్యారు. అందుకే పుష్ప 2 లో ఐటెం సాంగ్ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తోంది యూనిట్. దీని కోసం బాలీవుడ్ , కోలీవుడ్ లో చాలా మంది హీరోయిన్స్ తో చర్చలు జరిపారు మేకర్స్. కానీ ఏది వర్కౌట్ కాలేదు. దీంతో మళ్లీ సమంత తోనే ఐటెం సాంగ్ చేయించాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం ఐటమ్ సాంగ్ మాత్రమే కాకుండా కొన్ని సన్నివేశాల్లో సామ్ కనిపించేలా కథలో చిన్న చిన్న మార్పులు చేస్తున్నారట.త్వరలోనే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.