No. 1 heroine : టాలీవుడ్‌లో నెంబర్.1 హీరోయిన్ ఎవరు

టాలీవుడ్‌ (Tollywood) లో నెంబర్.1 హీరోయిన్ ఎవరు..? టక్కున ఎవరి పేరు కూడా చెప్పలేని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ ప్రశ్న అడిగేముందు. అసలు తెలుగులో టాప్ హీరోయిన్స్ ఉన్నారా అనే అనుమానం వస్తుంది. రోజుకొక హీరోయిన్ ఇండస్ట్రీకి వస్తున్న ఈ నేపథ్యంలో ఈ స్థానం కోసం పోటీ పడుతున్న వారు, పోటీ పడినవారు చాలా మంది ఉన్నప్పటికీ.. ఎవరికీ ఆ ప్లేస్‌ ఇప్పటికీ ఫిక్స్‌ కావడం లేదు..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 11, 2024 | 10:06 AMLast Updated on: Mar 11, 2024 | 10:06 AM

Who Is The No 1 Heroine In Tollywood

టాలీవుడ్‌ (Tollywood) లో నెంబర్.1 హీరోయిన్ ఎవరు..? టక్కున ఎవరి పేరు కూడా చెప్పలేని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ ప్రశ్న అడిగేముందు. అసలు తెలుగులో టాప్ హీరోయిన్స్ ఉన్నారా అనే అనుమానం వస్తుంది. రోజుకొక హీరోయిన్ ఇండస్ట్రీకి వస్తున్న ఈ నేపథ్యంలో ఈ స్థానం కోసం పోటీ పడుతున్న వారు, పోటీ పడినవారు చాలా మంది ఉన్నప్పటికీ.. ఎవరికీ ఆ ప్లేస్‌ ఇప్పటికీ ఫిక్స్‌ కావడం లేదు.. రోజుకో కొత్త ముద్దుగుమ్మ తెలుగు తెరకు పరిచయం అవుతూనే ఉన్నా.. టాలీవుడ్‌కు హీరోయిన్స్ కొరత మాత్రం తీరట్లేదు. ఉన్న హీరోయిన్లు సరిపోరు. కొత్త హీరోయిన్లు స్టార్స్‌కు సెట్ అవ్వరు. దాంతో దర్శక నిర్మాతలకు చుక్కలు కనిపిస్తూనే ఉన్నాయి. దీంతో.. తెలుగు ఇండ్రస్టీల్లో నెంబర్ వన్, నెంబర్ టూ హీరోయిన్ల కొరత తీరెదెప్పుడు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతూనే ఉన్నాయి.

నిజానికి టాలీవుడ్‌లో టాప్‌ హీరో అనగానే చాలానే పేర్లు వినిపిస్తుంటాయి. కానీ.. నెంబర్‌ వన్‌ హీరోయిన్‌ అంటే మాత్రం ఫిక్స్‌డ్‌గా చెప్పుకోవడానికి ఒక్క హీరోయిన్‌ కూడా కనిపించడం లేదు.. సీనియ‌ర్లు రిలాక్స్ అవుతున్నా..జూనియ‌ర్ భామ‌లు ఫాంలో ఉన్నా ఇంకా ఆస్థానం ఎవ‌రూ చేజిక్కించుకోలేకపోవడం చాలా ఆశ్చర్యంగా కలిగిస్తోంది.. అనుష్క శెట్టి..కాజ‌ల్ అగ‌ర్వాల్..త‌మ‌న్నా..స‌మంత‌ లాంటి సీనియ‌ర్ భామ‌లు ఫాంలో ఉన్నంత కాలం నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్ ఎవ‌రంటే? ఆ న‌లుగురిలో ఎవ‌రో ఒక‌రి పేరు వినిపించేది.. కానీ.. ఇప్పుడు వీళ్లంతా అంత యాక్టివ్‌గా లేరు.. వీళ్ళంతా సీనియర్స్ కావడంతో ఆఫర్స్ కూడా తగ్గిపోయాయి.. సో వీళ్లంతా టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ రేసులో లేనట్లే లెక్క..

ప్రజెంట్ ర‌ష్మిక మంద‌న్న.. శ్రీలీల‌…కీర్తి సురేష్‌..సాయిప‌ల్లవి రేస్‌లోకి వచ్చారు.. వరసగా బడా హీరోలతో సినిమాలు చేస్తూ.. టాలీవుడ్‌ తెరపై సందడి చేస్తున్నారు. అయినప్పటికీ వీళ్లలో ఎవరో ఒకరికి టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ ట్యాగ్ ఇవ్వలేని పరిస్థితి.. రష్మిక మందన్న సైతం టాలీవుడ్‌కు గ్యాప్ ఇచ్చేసింది. పుష్ప 2 మినహా.. ఈమె తెలుగులో మరే సినిమా చేయట్లేదు.
ఈ గ్యాప్‌లో ఆషికా రంగ‌నాధ్.. జాన్వీ క‌పూర్..మీనాక్షి చౌద‌రి లాంటి భామ‌లు కూడా తెలుగు తెరపైకి దూసుకొచ్చారు. ఈ భామ‌లు వ‌రుస‌గా స‌క్సెస్ లు అందుకుంటే? టైర్ వ‌న్ జాబితాలో చేరిపోతారు.

వీరిలో అందరికంటే జాన్వీక‌పూర్‌కు ఆ ఛాన్స్‌ ఎక్కువగా ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జూనియర్, చెర్రీ సినిమాలతో లాక్‌ అయిపోయిన జాన్వీకి.. తెలుగులో ఎక్కువ అవకాశాలు వచ్చే ఛాన్స్‌ ఉందంటున్నారు. అయితే.. తను చేయబోతున్న సినిమాల రిజల్ట్ మీదనే జాన్వీకపూర్ ఫ్యూచర్ ఆధారపడి ఉంది. మరి.. ఈ రేసులో ఉన్న మిగిలిన కుర్ర హీరోయన్లను కూడా తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు.. సో.. నెంబర్ వన్‌ ప్లేస్ కోసం వీల్లందరి మధ్య కుర్చీలాట గట్టిగానే సాగనుంది. మరి.. ఈ లెక్కలన్నీ చూస్తుంటే.. టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోయిన్ పీఠం మరికొన్నిరోజులు ఖాళీగా ఉంటుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం నెం.1 హీరోయిన్ ఎవరన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నే అని చెప్పుకోవాల్సి వస్తోంది..