ఎవరు ఈ కయాడు లోహర్..? సోషల్ మీడియాలో ఎందుకింత ట్రెండ్ అవుతుంది..?

కయాడు లోహర్.. సోషల్ మీడియాలో రెండు మూడు రోజులుగా ట్రెండింగ్ అవుతున్న బ్యూటీ పేరు ఇది. ఈ భామ కోసం కుర్రాళ్ళు తెగ డ్యూటీ చేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 27, 2025 | 02:20 PMLast Updated on: Feb 27, 2025 | 2:20 PM

Who Is This Kayadu Lohar Why Is It A Trend In Social Media

కయాడు లోహర్.. సోషల్ మీడియాలో రెండు మూడు రోజులుగా ట్రెండింగ్ అవుతున్న బ్యూటీ పేరు ఇది. ఈ భామ కోసం కుర్రాళ్ళు తెగ డ్యూటీ చేస్తున్నారు. అసలు కయాడు లోహర్ అంటే ఎవరో కూడా మన ఆడియన్స్ కు పెద్దగా పరచయం లేదు. తెలుగులో పెద్దగా సినిమాలు కూడా చేసింది లేదు. అయినా కూడా కయాడు పేరు మామూలుగా వినిపించట్లేదు ఇప్పుడు. మొన్న విడుదలైన ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ సినిమాలో హీరోయిన్ ఈమె. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ కావడంతో కయాడు లోహర్ పేరు బాగా మారుమోగిపోతుంది. తెలుగులోనూ విడుదలైంది కాబట్టి ఇక్కడ కూడా ఈ ముద్దుగుమ్మను బాగానే ఆరాధిస్తున్నారు మన కుర్రాళ్ళు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు కయాడు లోహర్ ఫోటోలు బాగా ట్రెండ్ అవుతున్నాయి.

ఇంకా చెప్పాలంటే నేషనల్ వైడ్ నెంబర్ వన్ ట్రెండింగ్ లో ఉంది ఈ బ్యూటీ. అందంగా ఉంది.. పైగా గ్లామర్ షో చేయడానికి ఎలాంటి హద్దులు పెట్టుకోలేదు.. అవసరమైతే బికినీ వేసుకోవడానికి అయినా.. లిప్ లాక్ సన్నివేశాల్లో నటించడానికి అయినా సిద్ధమే అని చెప్పడంతో.. కయాడు లోహర్ కు బ్రేక్ ఇవ్వడానికి దర్శక నిర్మాతలు రెడీ అంటున్నారు. అవకాశం వచ్చినప్పుడే అన్ని చూసుకోవాలి కాబట్టి.. అమ్మడు కూడా అసలు వెనక్కి తగ్గేది లేదు అంటుంది. సినిమాలు ఉన్నా లేకపోయినా హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది కయాడు లోహర్. ఈ భామ ప్రయత్నాలు బాగానే సక్సెస్ అయ్యాయిప్పుడు. అందుకే రెండు మూడు రోజుల నుంచి కయాడు పేరు బాగా వినిపిస్తుంది.

నిజానికి నాలుగేళ్ల కింద శ్రీ విష్ణు హీరోగా నటించిన అల్లూరి సినిమాలో హీరోయిన్ గా నటించింది కయాడు లోహర్. కానీ ఆ సినిమా ఫ్లాప్ అవడంతో ఎవరూ పట్టించుకోలేదు. తమిళంలోకి వెళ్లి అక్కడ ట్రై చేసింది. అక్కడ కూడా కొన్నాళ్లు టైం కలిసి రాలేదు కాని.. డ్రాగన్ సినిమా తర్వాత అమ్మడు జాతకం మారిపోయింది. ప్రస్తుతం కోలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఈ ముద్దుగుమ్మ. ఇక తెలుగులో కూడా విశ్వక్ సేన్ హీరోగా అనుదీప్ కె.వి తెరకెక్కిస్తున్న ఫంకీ సినిమాలో కయాడు లోహర్ ను హీరోయిన్ గా తీసుకుంటున్నారు. దీంతో పాటు మరో రెండు మూడు సినిమాల్లో కూడా ఈమె పేరు వినిపిస్తుంది.. ఎలా చూసుకున్నా కూడా రాబోయే రోజుల్లో తెలుగు ఇండస్ట్రీలో కయాడు లోహర్ నామస్మరణ గట్టిగానే జరిగేటట్టు కనిపిస్తుంది.