నెక్ట్స్ 1000 కోట్లు ఎవరికి..? 6 గురు మొనగాళ్ళ ఆశలు…
పాన్ ఇండియా హిట్లు ఆల్ మోస్ట్ టాలీవుడ్ టాప్ హీరోలందరికీ వచ్చాయి. కాబట్టే ఇప్పుడు ఎన్టీఆర్, ప్రభాస్, చరణ్, బన్నీ టార్గెట్ పాన్ ఇండియా హిట్ కాదు... వెయ్యికోట్ల వసూళ్ల వరదలు... అవే అందరి టార్గెట్.

పాన్ ఇండియా హిట్లు ఆల్ మోస్ట్ టాలీవుడ్ టాప్ హీరోలందరికీ వచ్చాయి. కాబట్టే ఇప్పుడు ఎన్టీఆర్, ప్రభాస్, చరణ్, బన్నీ టార్గెట్ పాన్ ఇండియా హిట్ కాదు… వెయ్యికోట్ల వసూళ్ల వరదలు… అవే అందరి టార్గెట్. అంటే సూపర్ స్టార్ మహేశ్ బాబుకి పాన్ ఇండియా హిట్ పడలేదు. అలాంటి మూవీ రాలేదు. ఎలాగూ రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. కాబట్టి తనకి పాన్ ఇండియా హిట్టేంటి, పాన్ వరల్డ్ బ్లాక్ బస్టరే వచ్చే ఛాన్స్ ఉంది. సో తన సంగతి వేరు… తను తప్ప మిగతా హీరోలందరికి అర్జెంట్ గా వెయ్యికోట్ల వసూళ్లే కావాలి… రెండు సార్లు వెయ్యికోట్లు కొల్లగొట్టిన షారుఖ్ కి మళ్లీ వెయ్యికోట్లే కావాలి… కల్కీ 2, బాహుబలి 2 తో వెయ్యికోట్లు రాబట్టిన ప్రభాస్ కి మళ్లీ వెయ్యికోట్లే కావాలి.. యష్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కికూడా అదే కావాలి…నిజం చెప్పాలంటే ఆచార్య, గేమ్ ఛేంజర్ తో డిజాస్టర్లు ఫేస్ చేసిన చరణ్ కి పాన్ ఇండియా లెవల్లో హిట్ పడి, గట్టెక్కితే చాలు.. కాని తను కూడా 1000 కోట్లే కావాలంటున్నాడు. ఇంతకి నెక్ట్స్ వెయ్యికోట్లు ఎవరి ఎకౌంట్ లో పడబోతున్నాయి…? హావేలుక్
నెక్ట్స్ పాన్ ఇండియా హిట్ ఎవరికనే రోజులు పోయాయి. తమిల్, మలయాళం, కన్నడ స్టార్లుకు పాన్ ఇండియా హిట్ పెద్ద మ్యాటర్ కావొచ్చు, మన హీరోలకి మాత్రం వెయ్యికోట్ల వసూళ్లే అసలైన మ్యాటర్ .
ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ తో 1350 కోట్లు వసూళ్లను రుచి చూశాడు. కాని అది మల్టీ స్టారర్ మూవీ, దేవర 670 కోట్లొచ్చినా వెయ్యికోట్ల క్లబల్ లో అడుగు పెట్టలేదు. చరణ్ కి త్రిబుల్ ఆర్ తప్ప మరో పాన్ ఇండియా హిట్లేదు. బన్నీకి పుష్ప2, యష్ కి కేజీయఫ్ 2 లాంటి సినిమాలు వెయ్యికోట్లు దాటేలా చేశాయి. షారుఖ్ ఖాన్ కి పటాన్, జవాన్ లు వెయ్యికోట్ల వసూళ్లని తేలికగా మార్చాయి. దంగల్ వల్ల ఆమిర్ ఖాన్ కి కూడా వెయ్యికోట్లు కాదు, ఏకంగా 2 వేల కోట్ల లెక్కలు తేలాయి.. ఇవన్ని జరిగిపోయిన ముచ్చట్లు.. మరి నెక్ట్స్ ఎవరికి వెయ్యికోట్ల వరదొస్తుందనేదే అసలు ప్రశ్న… బాహుబలి 2, కల్కీ 2 తో వెయ్యికోట్ల వసూళ్లని రెండు సార్లు టేస్ట్ చేసిన ప్రభాస్, రాజా సాబ్ తో సెప్టెంబర్ లో ఎటాక్ చేయబోతున్నాడు.
ఈ ఏప్రిల్ 10కి ది రాజా సాబ్ ఫుల్ ఫెడ్జ్ డ్ ప్రోమో రాబోతోంది. ఆల్రెడీ ఫిల్మ్ టీమే బయటికి లీకులిస్తోంది కూడా. ఇలా అయినా సినిమా వాయిదా వల్ల గాయపడ్డ ఫ్యాన్స్ మనసు కుదుటపడుతుందనే కోణంలో, ప్రోమోని గట్టిగానే ప్లాన్ చేశారు. మరి రాజా సాబ్ కి 1000 కోట్లు రాబట్టే సీన్ ఉందా అంటే, ఏమాత్రం కథ బాగున్నా వెయ్యికోట్లు ప్రభాస్ లాంటి కటౌట్ కి అసాధ్యం కాదు.సలార్ టాక్ వీకైనా 800 కోట్ల వసూళ్లొచ్చాయి. కల్కీ ఫస్ట్ హాఫ్ మీద నెగెటీవ్ టాక్ వచ్చినా సెకండ్ హాఫ్ లో కథే 1200 కోట్ల వసూళ్లని రాబట్టింది. కాబట్టే ఐతే రాజా సాబ్, లేదంటే ఫౌజీ తో ఒకటికి రెండు సార్లు వెయ్యికోట్లకు మళ్లీ ప్రభాస్ గేలమేసేందుకు వస్తున్నాడు. పటాన్ సీక్వెల్ పటాన్ 2 చేస్తున్నాడు కాబట్టి, షారుఖ్ కూడా మరోసారి వెయ్యికోట్ల ఆశలు పెట్టుకున్నాడు. పటాన్, జవాన్ తర్వాత డంకీ తో వెయ్యికోట్లని మూడు సార్లు కొల్లగొట్టాలన్న తన ప్లాన్ వర్కవుట్ కాలేదు. కాబట్టే పటాన్ సీక్వెల్ తో ఎటాక్ చేసే పనిలో ఉన్నాడు.
హ్రితిక్ రోషన్ కూడా ఎన్టీఆర్ తో కలిసి చేస్తున్నవార్ 2 తో వెయ్యికోట్ల కలలు కంటున్నాడు. కేజీయఫ్ 2 తో దుమ్ముదులిపిన యష్ టాక్సిక్ తో పాన్ ఇండియా హిట్ కంటే, వెయ్యికోట్ల వసూళ్ల మీదే ఎక్కువ ఆశలు పెట్టుకున్నాడు. సో తన టాక్సిక్ ఏమాత్రం బాగున్నా వెయ్యికోట్లు రాబట్టే స్టామినా తనకి కూడా ఉంది. పుష్ప 2 తో 1800 కోట్లు కొల్లగొట్టిన బన్నీని మళ్లీ వెయ్యికోట్ల ఆశ ఉంది కనకే, త్రివిక్రమ్ ని పక్కన పెట్టి, పటాన్ తో 1000 కోట్లు రాబట్టిన ఆట్లీతో సినిమా చేస్తున్నాడు. వెయ్యికోట్ల ఆశ ఉన్నా కాని, ప్రజెంట్ గట్టెక్కడమే ముఖ్యం కాబట్టి, చరణ్ పెద్దిగా ప్రయోగం చేస్తున్నాడు. సో అరడజన్ హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా హిట్లకంటే, 1000 కోట్ల వసూళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు.