Hero Vishal : నా సినిమాలు ఎవడ్రా ఆపేది ! నిర్మాతలకు విశాల్ వార్నింగ్
సినీ ఇండస్ట్రీ అన్న తరువాత చిన్న చిన్న గొడవలు కామన్. ఎవరు ఎవరితో గొడవ పెట్టుకున్నా ప్రొడ్యూసర్స్ జోలికి మాత్రం ఎవరూ వెళ్లరు. ఎందుకంటే ప్రొడ్యూసర్స్‌తో పెట్టుకుంటే లైఫే ఉండదు కాబట్టి.
సినీ ఇండస్ట్రీ అన్న తరువాత చిన్న చిన్న గొడవలు కామన్. ఎవరు ఎవరితో గొడవ పెట్టుకున్నా ప్రొడ్యూసర్స్ జోలికి మాత్రం ఎవరూ వెళ్లరు. ఎందుకంటే ప్రొడ్యూసర్స్‌తో పెట్టుకుంటే లైఫే ఉండదు కాబట్టి. కానీ హీరో విశాల్ మాత్రం డైరెక్ట్‌గా ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కే వార్నింగ్ ఇచ్చాడు. మీరు నాతో సినిమాలు తీయకపోయినా పర్లేదంటూ సంచలన పోస్ట్ చేశాడు. విశాల్ ముక్కు సూటిగా ఉంటాడన్న సంగతి తెలిసిందే. మార్క్ ఆంటోని విడుదల టైంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. రెడ్ జెయింట్ గుత్తాధిపత్యాన్ని, థియేటర్ల మాఫియాను ఎండగట్టాడు. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వాలని మీరెందుకు డిసైడ్ చేస్తారు ? మీకేం హక్కు ఉందంటూ రెడ్ జెయింట్‌ని, ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు విశాల్.
ఇలా ప్రతీ సారి విశాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటాడు. సామాజిక సేవలోనూ విశాల్ ముందుంటాడు. చెన్నైలో వరదలు ముంచెత్తినప్పుడు సహాయ కార్యక్రమాలు చేయడంలో ముందు నిలబడుతుంటాడు. తాజాగా విశాల్ మీద తమిళ నిర్మాతల మండలి చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. విశాల్‌తో ఎవ్వరూ సినిమాలు తీయొద్దని తీర్మానించుకున్నట్టుగా సమాచారం. దీంతో విశాల్ మండిపడ్డాడు. టీఎఫ్‌పీసీకి కౌంటర్‌గా విశాల్ ట్వీట్ చేశాడు. మిస్టర్ కథిరేసన్ మనం ఓ బృందంగా, సమష్టిగా కలిసి తీసుకున్న నిర్ణయాలు నీకు తెలియదా. ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లోని సభ్యుల సంక్షేమం కోసం నిధులు ఖర్చు చేశాం.. వారి కుటుంబం, విద్య, వైద్యం అంటూ ఇలా సంక్షేమానికి ఖర్చు చేశాం.. మీరు అక్కడ మీ పని సక్రమంగా చేయండి.. ఇండస్ట్రీలో చాలా పని ఉంది.. డబుల్ టాక్సేషన్, థియేటర్ మెయింటైన్స్ ఛార్జెస్ అంటూ ఇలా ఎన్నో సమస్యలకు పరిష్కరాలు వెతకాల్సి ఉంది.
నేను ఇక్కడ కంటిన్యూగా సినిమాలు చేస్తూనే ఉంటాను.. మీరు కావాలంటే నన్ను ఆపేందుకు ట్రై చేసుకోవచ్చు.. అసలు అక్కడ సినిమాలు తీసే నిర్మాతలున్నారా ? అన్నట్టుగా కౌంటర్ వేశాడు విశాల్. ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో గతంలో 12 కోట్ల నిధులకు సంబంధించిన విషయంలో ప్రొడ్యూసర్లకు విశాల్‌కు వివాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ డబ్బు విశాల్ దోచేశాడని కౌన్సిల్ సభ్యులు అంటుంటే పబ్లిక్‌గా ప్రజా సేవలకు ఖర్చు చేశామని విశాల్ చెప్తున్నారు. ప్రస్తుతం ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కు ట్విటర్ వేదికగా విశాల్ ఇచ్చిన వార్నింగ్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ వివాదం ఇంకా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.