ముసలి హీరోలకి అంత కొవ్వా… మీకెందుకురా గొట్టం..?

బాలీవుడ్ లో ముసలి డొక్కు హీరోలు, పదహారేళ్ల క్యూట్ కుట్టీస్ తో ఇప్పటికీ రొమాన్స్ చేయటమేంటనే కామెంట్లు వివాదంగా మారాయి. సికిందర్ తాతతో క్రష్మిక రొమాన్స్ అని సోషల్ మీడియాలో ట్రోలింగ్స్, కామెంట్లు దుమ్ముదులిపేస్తున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 25, 2025 | 07:45 PMLast Updated on: Mar 25, 2025 | 7:45 PM

Why Are Old Heroes So Fat Why Do You Have A Dick

బాలీవుడ్ లో ముసలి డొక్కు హీరోలు, పదహారేళ్ల క్యూట్ కుట్టీస్ తో ఇప్పటికీ రొమాన్స్ చేయటమేంటనే కామెంట్లు వివాదంగా మారాయి. సికిందర్ తాతతో క్రష్మిక రొమాన్స్ అని సోషల్ మీడియాలో ట్రోలింగ్స్, కామెంట్లు దుమ్ముదులిపేస్తున్నాయి. ఈ విషయంలో పాపం సల్మాన్ ఖాన్ ఒంటిరి వాడయ్యడు. తనకి షారుఖ్ ఖాన్ నుంచి ఆమీర్ ఖాన్ వరకు, అక్షయ్ నుంచి అజయ్ దేవ్ గన్ వరకు ఎవరూ సపోర్ట్ చేయట్లేదు. ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్లని తాత ముత్తాతలంటూ ట్రోలింగ్ చేయటం పక్కా… ఐతే హిట్లు లేక అడ్రసే లేకుండాపోతున్న సల్మాన్ కనీసం ఇలా అయినా జనాల్లోకి వెళ్లాడు. లేకపోతే తనని సౌత్ లోనే కాదు, నార్త్ లో కూడా పట్టించుకునే నాథుడే కరువయ్యే పరిస్థితి.. ఐతే ముసలి తాతతో టీనేజ్ హీరోయిన్ రొమాన్స్ రోత అన్న కామెంట్, సల్మాన్ కే కాదు, సౌత్ హీరోలకు కూడా వర్తిస్తుంది. కాని బాలీవుడ్ ముసలి ఖాన్లు, కపూర్లే ట్రోలింగ్ కి గురౌతున్నారు.. ఎందుకు? టేకేలుక్

సల్మాన్ ఖాన్ రష్మికతో జోడీ కట్టి సికిందర్ మూవీ చేశాడు. తమిళ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో ఈసినిమా రిలీజ్ కి రెడీ అయ్యింది. పాటతో పాటు ట్రైలర్ మీద కూడా కామెంట్లు, ట్రోలింగ్స్, మీమ్స్ ఇలా అవి ఇవి అని కాదు కాని, సోషల్ మీడియాలో ఈ మూవీ మీద పెద్ద పోస్టు మార్టమే జరుగుతోంది.ముసలి డొక్కు హీరోలు అసలు మారారా అంటూ కామెంట్ల దాడి కూడా భారీగా పెరిగింది.
ఎక్కడ 60 ఏళ్లు ఇక్కడ ఇరవై తొమ్మిదేళ్లు , అసలు హీరో హీరోయిన్ మద్య కనీసం 31 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. ఏంటిదనంటే రష్మికకు,తన పేరెంట్స్ కి లేని ఇబ్బంది మీకెందుకన్నాడు సల్మాన్. అదే మిస్ ఫైర్ అయ్యింది. హిందీ, తెలుగు అని తేడాలేకుండా, సోషల్ మీడియాలో అసలు సికిందర్ కి సినిమా చూపిస్తున్నాు ట్రోలర్స్.

విచిత్రం ఏంటంటే ముసలి తనం వచ్చినా, టీనేజ్ హీరోయిన్స్ తో రొమాన్స్ చేసేప్పుడు, ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ అంటారు. వయసనేది మ్యాటరే కాదంటారు. కాని వయసులో చిన్న వాళ్లు మాత్రం ఈ హీరోలని గౌరవించాలి. పెద్దలని గౌరవించటం మన సంస్క్రుతని సోది చెబుతారు… మరెందుకు గౌరవం కావాల్సి వచ్చినప్పుడు, ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ అనే విషయం వీళ్లకు గుర్తుకు రాదు..ఇదే మ్యాటర్ మోహన్ బాబుకి అప్లై చేశారు. తను కూడా మనవరాళ్లంతవాళ్లతో జోడీకట్టాడు, చిరుతో పాటు తెలుగు,తమిళ్, కన్నడ,మలయాళం హీరోలు కూడా ఇలానే యంగ్ హీరోయిన్లతో జోడీకట్టారు. కాకపోతే సల్మాన్ ఖాన్ మీద ట్రోలింగ్ అయినంతగా, ఇంకెవరి మీద కాలేదు. కావట్లేదు.

కారనం ఇంకా తను షర్ట్ విప్పి సిక్స్ ప్యాక్స్ తో స్వీట్ సిక్స్ టీనే అనుకోవటం అన్నది ట్రోలర్స్ వర్షన్… ఏదేమైనా ఖాన్లూ గ్రాఫిక్స్ తో ముఖాలతో ముసలి తనాన్ని దాచిపెట్టే పద్దది మీద కూడా కామెంట్లు ఘాటుగానే పడుతున్నాయి. ఈ విషయంలో తోటి ఖాన్లు, కపూర్లు కనీసం నోరు విప్పట్లేదు. ఎందుకంటే ఎవరు రియాక్ట్ అయినా వాళ్లని ముసలి డొక్కనే కామెంట్లు వెంటాడే పరిస్తితి ఉంది. అందుకే నోరు మూసుకుంటున్నారనే కామెంట్లు పెరిగాయి.