చిరంజీవిని టార్గెట్ జూనియర్ ఎన్టీఆర్, రవితేజ.. మెగాస్టార్ ను ఇలా బుక్ చేశారేంటి..?
అసలే చిరంజీవికి కొన్నేళ్లుగా టైం అసలు బాలేదు. కెరీర్ పరంగా మెగాస్టార్ డైలమాలో ఉన్నారు. ఒకప్పుడు తన నుంచి సినిమా వస్తే టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ అదిరిపోయేవి.

అసలే చిరంజీవికి కొన్నేళ్లుగా టైం అసలు బాలేదు. కెరీర్ పరంగా మెగాస్టార్ డైలమాలో ఉన్నారు. ఒకప్పుడు తన నుంచి సినిమా వస్తే టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ అదిరిపోయేవి. కానీ ఇప్పుడు ఏమాత్రం తేడా కొట్టిన డిజాస్టర్ అవుతున్నాయి. దాంతో తన ఇమేజ్ తగ్గిపోయిందా లేదంటే ప్రేక్షకులను తనను చూడడానికి మునపట్ల ఇష్టపడట్లేదా ఆత్మవిమర్శ చేసుకుంటున్నాడు మెగాస్టార్. అందుకే తన వర్కింగ్ స్టైల్ కూడా మార్చాడు. కుర్ర దర్శకులతో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం వశిష్టతో విశ్వంభర.. నెక్స్ట్ అనిల్ రావిపూడి తో ఒక సినిమా.. ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమా చేయబోతున్నాడు చిరంజీవి. ఈ మూడు సినిమాల తర్వాత కూడా ఎక్కువగా యంగ్ డైరెక్టర్స్ కే అవకాశాలు ఇవ్వాలని చూస్తున్నాడు. ఇదిలా ఉంటే అనిల్ రావిపూడి సినిమా సంక్రాంతికి మొదలవుతుందని ఇప్పటికే ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది. ఇది పక్కా పండగ సినిమా అంటున్నాడు అనిల్. అలాగే మెగా ఫాన్స్ పండగ చేసుకునే సినిమా అవుతుందని నమ్ముతున్నాడు ఆయన.
అంతా బాగానే ఉంది కానీ చిరంజీవి టార్గెట్ చేయడానికి మరో ఇద్దరు స్టార్ హీరోని కూడా సంక్రాంతికి వస్తున్నారు. ఇక్కడే అసలు సమస్యలు వస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ సినిమా సంక్రాంతికే వస్తుందని ఇప్పటికే అనౌన్స్ చేశారు. షూటింగ్ ఈ మధ్యే మొదలైంది. తారక్ తలుచుకుంటే ప్రశాంత్ సినిమా పండక్కి రావడం పెద్ద విషయం కాదు. అలా కాకుండా ఏదైనా ఆలస్యం అయితే మాత్రం సంక్రాంతి బరి నుంచి జూనియర్ ఎన్టీఆర్ తప్పుకుంటాడు. అది జరిగితే మెగా ఫాన్స్ కు అంతకంటే గుడ్ న్యూస్ మరొకటి లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ లాంటి హీరో పండక్కి వస్తే అక్కడ ఉన్నదీ చిరంజీవి అయినా కూడా కచ్చితంగా కలెక్షన్స్ లో భారీ ఎఫెక్ట్ పడుతుంది. దాంతో 100 కోట్లు వచ్చే సినిమాకు 50 కోట్లే వస్తాయి.
రవితేజ సైతం సంక్రాంతినే టార్గెట్ చేస్తున్నాడు. ఈయన ప్రస్తుతం నటిస్తున్న మాస్ జాతర సినిమా మేలో విడుదల కానుంది. దీని తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఒక సినిమా చూస్తున్నాడు మాస్ రాజా. ఈ సినిమా షూటింగ్ మే నుంచి మొదలు కానుంది. ఇప్పటికే స్టోరీ లాక్ అయిపోయింది. దసరా, పారడైజ్ సినిమాలు నిర్మిస్తున్న సుధాకర్ చెరుకూరి ఈ సినిమాకు నిర్మాత. రవితేజ సినిమాలు కూడా సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ చిరంజీవికి కలిసొచ్చే విషయం ఒకటి ఉంది. రవితేజ సినిమా నిర్మించబోయే సుధాకర్ చెరుకూరియే చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమాకు కూడా నిర్మాత. కాబట్టి రెండు సినిమాలు ఒకేసారి పండక్కి తీసుకొస్తాడా లేదా అని ఆప్షన్ ఆయన చేతిలోనే ఉంటుంది. మొన్న పండక్కి గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం రెండూ రిలీజ్ చేశాడు దిల్ రాజు. అలా చిరు, రవితేజ సినిమాలు కూడా విడుదల చేస్తే చెప్పలేము. ఏదేమైనా 2026 సంక్రాంతికి పోటీ భారీగా ఉండబోతుంది.