సెక్సీ హీరోయిన్ సన్యాసినిగా ఎందుకు మారింది?

90లలో బాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసిన మమతా కులకర్ని హఠాత్తుగా కుంభమేళాలో సన్యాసిని అవతారం యెత్తింది. హీరోయిన్ గా మంచి రైసింగ్ టైం లో అనేక వివాదాలతో కెరీర్ కోల్పోయిన మమత ఇప్పుడు కొత్త జీవితం మొదలు పెట్టింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 27, 2025 | 09:50 AMLast Updated on: Jan 27, 2025 | 9:50 AM

Why Did The Sexy Heroine Become A Nun

90లలో బాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసిన మమతా కులకర్ని హఠాత్తుగా కుంభమేళాలో సన్యాసిని అవతారం యెత్తింది. హీరోయిన్ గా మంచి రైసింగ్ టైం లో అనేక వివాదాలతో కెరీర్ కోల్పోయిన మమత ఇప్పుడు కొత్త జీవితం మొదలు పెట్టింది. ఇన్నాళ్లు నా అందాలని చూశారు… ఇప్పుడు నాలో దాగివున్న అంతర్గత సౌందర్యాన్ని చూస్తారు అంటుంది ఒకప్పటి స్టార్ హీరోయిన్. మాఫియా, డ్రగ్స్ , లాంటి వ్యవహారాలతో స్టార్ ఇమేజ్ ని వదులుకున్న మమతా జీవితంలో అసలేం జరిగింది.? ఇప్పుడెందుకు సన్యాసిని గా మారింది.

ముంబై పోలీస్ కమిషనర్ కూతురు మమతా కులకర్ణి. చాలా చిన్న వయసులో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మమత. స్టార్ హీరోలు అందరితోనూ నటించింది. సల్మాన్, షారుక్, అజయ్ దేవగన్, మిథున్ చక్రవర్తి, బాబి డ్యూయల్, సంజయ్ దత్, అక్షయ్ కన్నా, సైఫ్ అలీ ఖాన్ అమీర్ ఖాన్, అనిల్ కపూర్, మోహన్ బాబు ఇలా టాప్ హీరోల అందరితోనూ జతకట్టిందామే. కరణ్ అర్జున్, బాజీ, వంశ్, తెలుగులో ప్రేమ శిఖరం, దొంగ పోలీస్, బ్రహ్మ లాంటి హిట్ మూవీస్ లో నటించింది మమత. స్టార్ డస్ట్ కవర్ పేజీపై సగం నగ్నంగా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం ద్వారా 90 లలో మమత పెద్ద కాంట్రవర్సీ లో ఇరుక్కుంది. స్టార్ డస్ట్ పత్రిక కవర్ పేజీపై ఆమె టాప్ లెస్ ఫోజులపై అప్పట్లో కోర్టు జరిమానా విధించింది.

అయితే కోర్టుకు హాజరైనప్పుడు ముస్లింలు ధరించే బురఖా వేసుకొని రావడంతో ఇస్లాం మతస్తుల అగ్రహాన్ని చవిచూసింది మమతా కులకర్ణి. అడపాదడపా కాంట్రవర్షల్ స్టేట్మెంట్స్ ఇవ్వడం…. బాయ్ ఫ్రెండ్స్… నైట్ క్లబ్స్ ఇవన్నీ మమతా కి చెడ్డ పేరు తెచ్చాయి.2002లో కభీ తుమ్ కభి హం చిత్రం బాలీవుడ్ లో ఆమెకి చివరి సినిమా. హీరోయిన్ గా ఉన్న రోజుల్లోనే ముంబై డాన్ చోటా రాజన్ తో మమతకు సంబంధాలు ఉండేవని….. అండర్ వరల్డ్ ఒత్తిడితోనే ఆమెకు హీరోయిన్ గా ఛాన్స్ లు ఇచ్చేవారని చెప్పుకునేవారు. అండర్ వరల్డ్ భయం తోనే మమత తో అఫైర్స్ కి హీరోలు దూరంగా ఉండేవారు. బాలీవుడ్ ను వదిలిపెట్టిన తర్వాత ఒక ఎన్నారై బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకొని అమెరికా వెళ్లి న్యూయార్క్ లో సెటిల్ అయింది. కానీ ఆ పెళ్లి కొన్నాళ్లకు పెటాకులు అయింది. ఆ తర్వాత తన ఒకప్పటి బాయ్ ఫ్రెండ్ అయినా విక్కీ గోస్వామినీ పెళ్లి చేసుకుంది.

విక్కీ గోస్వామికి దుబాయ్, నేపాల్ కేంద్రంగా డ్రగ్స్ బిజినెస్ ఉండేది . భర్త డ్రగ్స్ వ్యాపారంలో మమత కూడా చేతులు కలిపింది.2014లోనే ఈ డ్రగ్స్ వ్యాపారం సంబంధించి దాన్ని పోలీసులు విక్కీ గోస్వామి కి నోటీసులు ఇచ్చారు. అయితే తెలివిగా పోలీసుల నుంచి తప్పించుకొని విక్కీ, మమత ఇద్దరూ కెన్యా పారిపోయారు. అక్కడ నుంచి డ్రగ్స్ బిజినెస్ చేసేవారు.2017లో 20 వేల కోట్ల రూపాయలు విలువైన డ్రగ్స్ సప్లై కి సంబంధించి వీళ్ళిద్దరిపై నార్కోటిక్స్ కేసు బుక్ అయింది. మమతా పై నాన్ బైబుల్ వారెంట్ కూడా జారీ అయింది. చాన్నాళ్లు దుబాయ్ లో రహస్యంగా జీవించింది మమత. ఆ తరువాత ఆ కేసు నుంచి బయట పడింది. అందం ఐశ్వర్యం అన్నీ ఉన్నా జీవితంలో క్రమశిక్షణ లేకపోవడం తో సినిమా హీరోయిన్ గాను నిలదొక్కు కోలేకపోయింది.

క్రిమినల్స్ తో తిరిగి…. వాళ్లతోనే బతికి జీవితాంతం వివాదాలతోనే గడిపింది. చివరికి ఆ కేసులు అన్నిట్లోంచి బయటపడి 23 ఏళ్ల తర్వాత ఇప్పుడు స్వదేశానికి వచ్చింది. ఇక జీవితంలో అన్ని వదిలేసానని… సన్యాసం తీసుకుంటున్నట్లు 52 ఏళ్ల మమత ప్రకటించింది. మహా కుంభమేళా సందర్భంగా… మౌని అమావాస్య రోజున మమత కులకర్ణి సన్యాసినిగా మారింది. ఒకప్పుడు సెక్సీ హీరోయిన్ ఇలా కాషాయ దృష్టిలో దర్శనం ఇవ్వడం ఆమె ఫ్యాన్స్ కి చాలా బాధగా ఉంది. కానీ మమత మాత్రం నాలో మీరు ఆ సెక్సీ భావనలను చూడకండి…. ఆధ్యాత్మికతని దర్శించండి అంటుంది. చూడాలి ఈ కొత్త అవతారంలో ఎన్నాళ్లు కొనసాగుతుందో.