మన హీరోయిన్లకు ఏమి రోగం వచ్చింది?

తెలుగు రాష్ట్రాల్లో వరదలు జన జీవితాన్ని అతలాకుతలం చేసేశాయి. కోట్ల రూపాయల ఆస్తులు పోయాయి. పంటలు నాశనం అయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులన్నీ నీటి మునిగాయి. ఈ అపార నష్టాన్ని ఎంతోకొంత భర్తీ చేయడానికి, ఆదుకోవడానికి తెలుగు సినిమా హీరోలంతా ముందుకు వచ్చారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 5, 2024 | 02:12 PMLast Updated on: Sep 05, 2024 | 2:12 PM

Why Heroins Didnt Donate Money

తెలుగు రాష్ట్రాల్లో వరదలు జన జీవితాన్ని అతలాకుతలం చేసేశాయి. కోట్ల రూపాయల ఆస్తులు పోయాయి. పంటలు నాశనం అయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులన్నీ నీటి మునిగాయి. ఈ అపార నష్టాన్ని ఎంతోకొంత భర్తీ చేయడానికి, ఆదుకోవడానికి తెలుగు సినిమా హీరోలంతా ముందుకు వచ్చారు. వాళ్ల శక్తి కొలది విరాళాలు ఇస్తున్నారు. కానీ తెలుగు సినిమాల్లో నటిస్తూ కోట్ల రూపాయలు రెమ్యూనిస్టులు తీసుకుని హీరోయిన్లు మనసు మాత్రం కలగటం లేదు. ఒక్క అగ్ర హీరోయిన్ కూడా వరద బాధితులకు ఒక రూపాయి విరాళం ఇచ్చిన పాపాలు పోలేదు.

తెలుగు సినిమా హీరోలందరిలో పవన్ కళ్యాణ్ మరోసారి నిరూపించుకున్నారు. రెండు కోట్ల రూపాయలు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు విరాళంగా ఇవ్వడమే కాక, నాలుగు కోట్ల రూపాయలు దెబ్బతిన్న పంచాయితీ లను ఆదుకోవడానికి విరాళంగా ప్రకటించారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ 6 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇక ప్రభాస్ రెండు తెలుగు రాష్ట్రాలకు రెండు కోట్లు ఇవ్వగా, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు తన కోటి రూపాయలు విరాళం ఇస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు వరదని చూసి చలించిపోయి వెంటనే రియాక్ట్ అయ్యారు. యంగ్ హీరోలైన జొన్నలగడ్డ సిద్ధూ 30 లక్షలు, అలాగే విశ్వక్సేన్ 10 లక్షలు విరాళం ప్రకటించి బాధితులకు అండగా నిలబడ్డారు.

ఎంతమంది హీరోలు కదిలి వస్తుంటే… తెలుగు సినిమాల్లో టాప్ రేంజ్ లో ఉన్న హీరోయిన్లు మాత్రం ఒక రూపాయి కూడా విరాళంగా ప్రకటించలేకపోయారు. కనీసం సోషల్ మీడియాలో కూడా ఎక్కడ రియాక్ట్ కాకపోవడం మరీ దారుణం. తెలుగు సినిమాల నుంచి కోట్లు కోట్లు దండుకునే హీరోయిన్లు ఒక్కరు కూడా, వరదలో సామాన్యుల కష్టాలు చూసి చెల్లించలేదు. స్టార్ హీరోయిన్స్ అందరి కంటే పెద్దగా క్రేజ్ లేని అనన్య నాగళ్ళ తెలుగు రాష్ట్రాల వరద బాధితుల కోసం ఐదు లక్షల విరాళంగా ప్రకటించింది. ఆమె ఒక్కరు తప్ప ఒక్క హీరోయిన్ కూడా తమకు సామాజిక బాధ్యత ఉందని చెప్పుకోలేకపోయారు. తెల్లారి లేచిన దగ్గర్నుంచి సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉండే సమంత మౌనంగా ఉంది. తెలుగు సినిమా పేరు చెప్పుకొని కోట్లు సంపాదించిన సామ్ కి నీట మునిగిన వాళ్ల జీవితాలు కన్నీళ్లు తెప్పించలేదా అంటూ సోషల్ మీడియాలో జనం ఆడుకుంటున్నారు. ఇక ఈ మధ్యకాలంలో సినిమాకి నాలుగు కోట్ల రూపాయలు రేమినేషన్ తీసుకుంటున్న అయితే అడ్రస్ లేదు. తెలుగు సినిమాల నుంచి ఏకంగా బాలీవుడ్కి ఎదిగిపోయిన రష్మిక నీ ఇక్కడ జనం బాధలు కదిలించలేకపోయాయి. సమంత, రష్మిక మాత్రమే కాదు తెలుగులో టాప్ టెన్ హీరోయిన్స్ ఒక్కరూ పర్సులోంచి రూపాయి తీసి విదిలించలేదు. తమన్నా, శ్రీ లీల, శృతిహాసన్, కాజల్ అగర్వాల్, కీర్తి సురేష్ ,రకుల్ ప్రీత్ సింగ్ , పూజా హెగ్డే, రాసి కన్నా, సాయి పల్లవి ,నయనతార….
అంటే ఒక్కరు కూడా వరద బాధితులపై దయ చూపలేదు.

హీరోయిన్ల లో చాలామంది తెలుగు రాష్ట్రానికి చెందిన వారు కాదు. వాళ్లు పుట్టి పెరిగింది కూడా ఇక్కడ కాదు.
కేవలం టాలీవుడ్ లో నటించి కోట్లు దండుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే తెలుగు రాష్ట్రాల కష్టం బహుశా తెలిసుండకపోవచ్చు. కానీ ఇక్కడ ప్రజల డబ్బు…. అభిమానం దండిగా దండుకొని, కోట్లు సంపాదించుకున్న…. జనం కష్టంలో ఉన్నప్పుడు ఓ లక్ష రూపాయలు విరాళంగా ఇవ్వాలన్న కామన్ సెన్స్ కూడా లేని వాళ్ళు హీరోయిన్ లు. అందుకే తెలుగు హీరోలను ఈ సమయంలో ఎంతగా పొగుడుతున్నారో హీరోయిన్లను అంతగా చీల్చి చెండాడుతున్నారు నేటిజన్లు.